prem sagar rao
-
ఎన్నికల వ్యూహంపై 10 రోజుల్లో నివేదిక
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా అనుసరించాల్సిన వ్యూహంపై 10 రోజుల్లో నివేదిక ఇస్తామని టీపీసీసీ స్ట్రాటజీ కమిటీ చైర్మన్ ప్రేమ్‌సాగర్‌రావు చెప్పారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సభ్యులు కె. లక్ష్మా రెడ్డి, పాల్వాయి స్రవంతి, లోకేశ్ యాదవ్ తదితరు లు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విధివిధానాలపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలు, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు చేసిన మేలు గురించి ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరించేలా పార్టీ వ్యూహాన్ని తయారు చేస్తామని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మినీ చార్జిషీట్లు తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనా వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో చార్జిషీట్లు విడుదల చేయాలని, రాష్ట్ర స్థాయిలో వేసే చార్జిషీట్‌తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మినీ చార్జిషీట్లు వేయాలని టీపీసీసీ చార్జిషీట్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. కమిటీ చైర్మన్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అధ్యక్షతన గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ చార్జిషీట్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం సంపత్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్లు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదని, ఈ అంశాలన్నింటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. స్థానికంగా ఎమ్మెల్యేల అరాచకాలను ఈ చార్జిషీట్లలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తామని సంపత్ వెల్లడించారు. మండలాల వారీగా డేటా సేకరణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రీసెర్చ్ విభాగాన్ని బలోపేతం చేయాలని, అన్ని కోణాల్లో మండలాల వారీగా డేటా సేకరించి ప్రజలకు అవసరమైన కార్యకలాపా లు చేపట్టేలా పార్టీకి తగిన సమాచారం అందించాలని టీపీసీసీ కమ్యూనికేషన్స్ కమిటీ నిర్ణయించింది. కమిటీ చైర్మన్ జెట్టి కుసుమకుమార్ అధ్య క్షతన గురువారం గాంధీభవన్‌లో సమావేశం జరి గింది. అనంతరం కుసుమకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ తరహాలోనే గాంధీభవన్ లోనూ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
ఎన్నికలకు రెండేళ్ల ముందే వేడెక్కిన మంచిర్యాల రాజకీయం
-
కాంగ్రెస్‌కు షాక్.. పార్టీని వీడనున్న మరో కీలక నేత..!
-
TS: కాంగ్రెస్‌కు షాక్.. పార్టీని వీడనున్న మరో కీలక నేత..!
సాక్షి, ఆదిలాబాద్: మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్‌రావు కాంగ్రెస్‌ను వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, ప్రేమ్ సాగర్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిని మార్చాలని ప్రేమ్ సాగర్‌రావు కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. మరికొన్ని మండలాల అధ్యక్షులను కూడా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: KTR: ఇక ఊరుకోం: విపక్షాలపై మంత్రి కేటీఆర్ ఫైర్ ప్రేమ్‌సాగర్‌రావు డిమాండ్లను తెలంగాణ పీసీసీ సీరియస్‌గా తీసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్‌రావు కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు జిల్లా రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో ఆయన కాంగ్రెస్‌పార్టీని వీడి టీఆర్ఎస్, బీజేపీలోచేరాలని చూస్తున్నట్లు సమాచారం. -
అందరి చూపు కాంగ్రెస్ వైపే
దండేపల్లి: అందరి చూపు కాంగ్రెస్ వైపే ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని తాళ్లపేటకు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరారు. వారిని ప్రేంసాగర్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీలు ఇచ్చి వాటిని విస్మరించారని మండిపడ్డారు. మళ్లీ అధికారం కోసం అమలు కానీ హామీలు ఇస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కొక్కిరాల సురేఖ, మాజీ ఎంపీపీలు కాంతరావు, శకుంతల, పుష్పలత, నాయకులు కంది సతీష్, త్రిమూర్తి, జంగు, కాంతరావు, కాంతయ్య, వేణు, గణపతి, సాధిక్ దుర్గప్రసాద్, రామయ్య, పోచయ్య, రాజం పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. మంచిర్యాల పట్టణంలోని 17వ వార్డుకు చెందిన 50 మంది యువకులు వాజిద్ అలీ ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి ప్రేంసాగర్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని, డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాములు, సలాఉద్దిన్, అంకుస్, సమీర్ పాషా పాల్గొన్నారు. పలువురి చేరిక.. తీగల్‌పహడ్ గ్రామానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు సమక్షంలో తన నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. ఎంపీటీసీ సుర్మిళ్ల వాణీ భర్త తిరుపతి, గోల్ల నాగార్జున, బొడ్డు చిన్నయ్యలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ధర్ని మధు పాల్గొన్నారు. -
ప్రేంసాగర్ వర్సెస్ వివేక్.. మధ్యలోఅరవిందరెడ్డి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ తూర్పు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గ్రూపు విభేదాలకు నిలయమైన ఆ పార్టీలో ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య వర్గపోరు కొనసాగుతుండటం ఎన్నికల వేళ చర్చనీయాంశమైంది. ఈ నేతల మధ్య పోరు ప్రభావం ఆ పార్టీ మరో అభ్యర్థిపై కూడా పడుతోంది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కేటాయింపుల్లో చక్రం తిప్పిన ప్రేంసాగర్‌రావుకు, ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వివేక్ మధ్య విభేదాలున్నాయి. ఇద్దరు కూడా బలమైన నేతలు కావడంతో ఈ పోరు రసకందాయంలో పడింది. పెద్దపల్లి ఎంపీ లోక్‌సభ స్థానం పరిధిలో వచ్చే మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో ఇరువర్గాల అనుచరులు ఎవరికివారే అన్న చందంగా తయారయ్యారు. ప్రేంసాగర్‌రావు వర్గీయుల సహకారం వివేక్‌కు అందడం లేదు. ముఖ్యంగా బెల్లంపల్లిలో ఈ పరిస్థితి నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వివేక్ ఈ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు.. ప్రేంసాగర్‌రావు వర్గీయులు ఈ ప్రచారానికి దూరంగా ఉన్నారు. సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్‌పై రెబల్‌గా బరిలోకి దిగిన చిలుముల శంకర్ ప్రేంసాగర్‌రావు వర్గీయుడు. ఆయన్ను ప్రేంసాగర్‌రావే బరిలో నిలిపారని సీపీఐ ముఖ్య నాయకులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. కాగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్.మహేందర్‌రావు, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింగరావు, మాజీ చైర్మన్ కారుకూరి రాంచందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్‌కుమార్ తదితరులు ప్రేంసాగర్‌రావు అనుచరులు. వీరంతా ఇప్పుడు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి వివేక్ ప్రచారానికి దూరంగా ఉండటం స్థానికంగా చర్చనీయాంశ మవుతోంది. మరో విశేషమేమంటే వీరు కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి చిలుముల శంకర్‌కు మద్దతుగా పని చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో మండలానికి బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పీసీసీ కార్యదర్శి, మున్సిపల్ మాజీ ైచైర్మన్ సూరిబాబు వర్గం మాత్రమే వివేక్‌కు అండగా ఉన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ప్రేంసాగర్‌రావు వర్గీయుడైన రేగాల మధుసూదన్‌ను వివేక్ తనవైపు తిప్పుకోగలిగారు. మంచిర్యాలలో.. మంచిర్యాల టిక్కెట్ కోసం ప్రేంసాగర్‌రావు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడంతో అరవిందరెడ్డి పరిస్థితి అప్పట్లో ఆగమ్యగోచరంగా తయారైంది. కానీ అధిష్టానం మాత్రం ప్రేంసాగర్‌రావును సిర్పూర్‌కు పంపి, అరవిందరెడ్డికి మంచిర్యాల టిక్కెట్‌ను ఖరారు చేసిన విషయం విధితమే. అయితే ఇక్కడి టిక్కెట్ ఆశించిన ప్రేంసాగర్‌రావుకు మంచి ర్యాలలో అనుచరవర్గం ఉంది. ఈ వర్గం ఎన్నికల్లో అరవిందరెడ్డికి సహకరించడం లేదు. మంచిర్యాలకు చెందిన ఈ నాయకులంతా అరవిందరెడ్డికి ప్రచారం చేయకుండా, సిర్పూర్ వెళ్లి వారి నాయకునికి ప్రచారం చేస్తున్నారు. మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంగల దయానంద్, మంచిర్యాల మండల శాఖ పార్టీ అధ్యక్షుడు సుంకి సత్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్‌రావు తదితరులు ప్రేంసాగర్‌రావు అనుచరులు. వీరు తమ సొంత నియోజకవర్గంలో కాకుండా, సిర్పూర్ వెళ్లి ప్రచారం నిర్వహించడం అరవిందరెడ్డికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఒకరిద్దరు నాయకులు సహకరించక పోయినా పెద్దగా నష్టమేమి ఉండదని ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. వివేక్, అరవిందరెడ్డిలు మాత్రం కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ వర్గపోరు ఎటువైపు దారితీస్తుందోనని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
బలప్రదర్శన
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : మంచిర్యాల ఆర్అండ్బీ కాంగ్రెస్ నేతల బలప్రదర్శనకు వేదికైంది. సాక్షాత్తు రాహుల్ దూత ఎదుట మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఇరువ ర్గాలు తోపులాటకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాబోయో ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేయడానికి శుక్రవారం రాహుల్ దూత, మహారాష్ట్రలోని చిమ్మూర్ శాసనసభ్యుడు విజయ్వడెట్టివార్, పీసీసీ పరిశీలకుడు బండి నర్సాగౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మంచిర్యాలకు వచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలైన మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. నాయకుల రంగప్రవేశం మొదట దివాకర్‌రావు వర్గీయులు ఐబీకి చేరుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పరిశీలకుడిని కలిసి దివాకర్‌రావు టికెట్ ఇవ్వాలని కోరారు. కొద్ది సేపటి తర్వాత ప్రేంసాగర్‌రావు రంగప్రవేశం చేశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇరు వర్గాల కార్యకర్తలు జిందాబాద్ అంటూ పరస్పర నినాదాలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నినాదాలతో ఒకరిపై ఒకరు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కార్యకర్తలను రెండు వర్గాలుగా వేర్వేరుగా చేశారు. పోలీసులు మధ్యలో నిల్చుని కార్యకర్తలను అదుపు చేయడానికి తంటాలు పడ్డారు. పరిశీలకున్ని మండలం, పట్టణాలవారీగా కలవడానికి అనుమతిచ్చారు. రెండు వర్గాల కార్యకర్తలు లోపలికి దూసుకు వెళ్లడంతో అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. అభిప్రాయాల సేకరణ రెండు గంటలపాటు కార్యకర్తల నినాదాలతో ఐబీ ప్రాంగణం ప్రతిధ్వనించింది. కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కులాలవారీగా అభిప్రాయాలను పరిశీలకుడు కోరారు. మూడు నియోజకవర్గాలకు పది దరఖాస్తులు వచ్చాయి. తన వర్గీయులను దూరంగా నెట్టి వేస్తూ ప్రేంసాగర్‌రావు వర్గీయులను ఏమి అనడం లేదని ఆరోపిస్తు పోలీసులతో దివాకర్‌రావు, ఆయన తనయుడు విజిత్‌రావు పోలీసులతో వాదనకు దిగారు. కాగా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తులో మంచిర్యాల సీఐలు రవీంద్రారెడ్డి, కరుణాకర్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, శ్రీలత, పోలీసులు ఉన్నారు. తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరు.. : పరిశీలకుడు విజయ్ వాడెట్టివార్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఏ శక్తులు అడ్డుకోలేని రాష్ట్ర పరిశీలకుడు విజయ్ వడెట్టివార్ అన్నారు. ఐబీలో కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడుతూ, ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన తెలంగాణను ఆపలేరని స్పష్టం చేశారు. సోనియాగాంధీ ఇచ్చిన మాట ప్రకారం సీడబ్ల్యుసీలో తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తోందని చెప్పారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశం అనంతరం రాష్ట్రం విభజన జరుగుతోందని ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగుర వేయాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. సందెట్లో సడేమియా సందెట్లో సడెమియాలా జేబుదొంగలు తమ హస్తలాఘవానికి పని చెప్పారు. కాంగ్రెస్‌లో రెండు వర్గాల నేతలు కయ్యానికి కాలు దూస్తున్న సమయంలో ఆదమరిచి ఉండడాన్ని జేబుదొంగలు అనుకూలంగా మలచుకున్నారు. ఓ వ్యక్తి నుంచి రూ.14 వేలు, మరోవ్యక్తి జేబు నుంచి సెల్ ఫోన్, రూ.20వేలు నగదు తస్కరించారు.