పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రేంసాగర్‌రావు
దండేపల్లి: అందరి చూపు కాంగ్రెస్ వైపే ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని తాళ్లపేటకు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరారు. వారిని ప్రేంసాగర్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హామీలు ఇచ్చి వాటిని విస్మరించారని మండిపడ్డారు.
మళ్లీ అధికారం కోసం అమలు కానీ హామీలు ఇస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కొక్కిరాల సురేఖ, మాజీ ఎంపీపీలు కాంతరావు, శకుంతల, పుష్పలత, నాయకులు కంది సతీష్, త్రిమూర్తి, జంగు, కాంతరావు, కాంతయ్య, వేణు, గణపతి, సాధిక్ దుర్గప్రసాద్, రామయ్య, పోచయ్య, రాజం పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం..
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. మంచిర్యాల పట్టణంలోని 17వ వార్డుకు చెందిన 50 మంది యువకులు వాజిద్ అలీ ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి ప్రేంసాగర్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని, డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాములు, సలాఉద్దిన్, అంకుస్, సమీర్ పాషా పాల్గొన్నారు.
పలువురి చేరిక..
తీగల్‌పహడ్ గ్రామానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు సమక్షంలో తన నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. ఎంపీటీసీ సుర్మిళ్ల వాణీ భర్త తిరుపతి, గోల్ల నాగార్జున, బొడ్డు చిన్నయ్యలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ధర్ని మధు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment