కాంగ్రెస్ ఏడాది పాలన బోనస్ హామీలు.. బోగస్ మాటలు
అయితే లూటీలు.. లేదంటే లాఠీలు అన్నట్లుగా పనితీరు
బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు విమర్శలు
సాక్షి, హైదరాబాద్ /సిద్దిపేట అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ఎన్ని సంస్థలు సర్వేలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాస్ మార్కులు కూడా రావడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎ మ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. గ్యారంటీల అ మలుకు బదులుగా ప్రభుత్వం గారడీ విన్యాసా లు చేస్తోందని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ‘డిక్లరేషన్ల అమలుకు బదులుగా డైవర్షన్ రా జకీయాలు చేస్తూ, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు.
పంటలకు బోనస్ అంటూ ఇప్పడు బోగ స్ మాటలు చెప్తున్నారు. లబి్ధదారులకు ప్రభుత్వం ఇస్తున్న చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. బీఆర్‌ఎస్ నేతలపై క్షణాల్లో కేసులు నమోదు చేస్తూ, కాంగ్రెస్ నేతలపై వచ్చే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా సీఎం ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను వక్రమార్గం పట్టిస్తూ.. అయితే లూటీ లేకుంటే లాఠీ అన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారు.
ఏడాదిలో కాంగ్రెస్, బీజేపీ స్నేహం మరింత బలపడింది’ అని హరీశ్‌రావు విమర్శించారు. పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఆరు వేల మంది రిసోర్స్ పర్సన్ల కు ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదని మండిపడ్డారు. వారి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు బట్టలు కూడా ఇవ్వలేదు
కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకొని అమలు చేయలేక విఫలమవుతోందని హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో మంగళవారం ఆయన విద్యార్థులకు దుప్పట్లు, టీషర్టు లు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మెనూకు.. హాస్టళ్లలో అమలవుతున్న మెనూకు సంబంధమే లేదని అన్నారు. పిల్లలకు ఇప్పటివరకు కనీసం బట్టలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వంతో మాట్లాడి పెండింగ్ మెస్ బిల్లులు, కాస్మొటిక్ ఛార్జీలు ఇప్పిస్తానని, మంచిగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించినవారికి తన సొంత ఖర్చులతో ఐప్యాడ్‌లు అందజేస్తానని, మెడిసిన్ చదివిస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment