హామీలు అమలు చేయకపోతే రేవంత్ క్షమాపణ చెప్పాలి
రఘునందన్‌ను మళ్లీ మడతపెట్టి ఉతికి ఆరేయాలి
దుబ్బాక రోడ్ షోలో హరీశ్‌రావు
దుబ్బాక: కేసీఆర్‌ను అవమానిస్తే సహించేది లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ‘ఏదో అడ్డిమారి గుడ్డిదెబ్బలా గెలిచిన రేవంత్‌రెడ్డీ.. నీవు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మొదట అమలు చేయి.. చేతకాకపోతే నాతో కాదు అని ప్రజలకు క్షమాపణ చెప్పు’ అంటూ సవాల్ విసిరారు. శనివారం రాత్రి దుబ్బాకలో బీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి హరీశ్ రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ జూటా మాటలతో గెలిచి ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఈ రివర్స్‌గేర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. ‘బీడీ కట్టలపై పుర్రె గుర్తు పెట్టింది కాంగ్రెస్ కాదా?.. జీఎస్‌టీ విధించింది బీజేపీ కాదా?..’ అని ప్రశ్నించారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చింది కేసీఆరేనని గుర్తుచేశారు
. ‘పెన్షన్లు ఎటు పాయే.. ఆడబిడ్డలకు రూ.2,500, తులం బంగారం ఎటు పాయే’, ‘కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది.. మళ్లీ మోటార్లు కాలిపోయే కాలం వచ్చింది’ అంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్‌రావును దుబ్బాకలో ప్రజలు మడతపెట్టి ఉతికినట్టే ఈ ఎన్నికల్లోనూ మరోసారి ఉతికి ఆరేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment