సాక్షి, విజయవాడ: విజయవాడలో టీడీపీలో ఇంటిపోరు ముదిరింది. గురువారం మరోసారి టీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ కేశినేని నానికి బెజవాడలో చేదు అనుభవం ఎదురైంది. డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన కేశినేని నానితో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయులు వాగ్వాదానికి దిగారు. పార్టీ మారిన వారిని ఎలా ప్రోత్సహిస్తారంటూ బుద్దా వర్గీయులు నిలదీయడంతో పాటు బూతులు తిట్టారు. దీంతో తీవ్ర అవమానంతో ఆయన వెనుదిరిగారు. తాను తప్పు చేస్తే పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని కేశినేని నాని అన్నారు. మనం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచాం.. చంద్రబాబు చేసింది తప్పు కాదా అని కేశినేని ప్రశ్నించారు. పార్టీలో ఎవరు తప్పు చేసినా వారిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయొచ్చు.. నడిరోడ్డుపై అడ్డుకుని వాగ్వాదం చేస్తే పార్టీకే నష్టమంటూ ఎంపీ కేశినేని వ్యాఖ్యానించారు.
కాగా, విజయవాడ పార్లమెంటు పరిధిలో టీడీపీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎంపీ కేశినేని నానిని రాజకీయంగా ఏకాకిని చేయడానికి పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గాలు పావులు కదుపుతున్నాయి. విజయవాడ నగరం కేంద్రంగా ఎత్తులకు పైఎత్తులు కొనసాగుతున్నాయి.
చదవండి: కొడాలి నానిపై ఎస్‌ఈసీ ఆదేశాలను తోసిపుచ్చిన హైకోర్టు
ఏం చేస్తావో తేల్చుకో బాబు..!
Comments
Please login to add a commentAdd a comment