MLC Buddha Venkanna
-
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బెదిరింపు కాల్స్
-
విజయవాడ టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, విజయవాడ: విజయవాడలో టీడీపీలో ఇంటిపోరు ముదిరింది. గురువారం మరోసారి టీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ కేశినేని నానికి బెజవాడలో చేదు అనుభవం ఎదురైంది. డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన కేశినేని నానితో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయులు వాగ్వాదానికి దిగారు. పార్టీ మారిన వారిని ఎలా ప్రోత్సహిస్తారంటూ బుద్దా వర్గీయులు నిలదీయడంతో పాటు బూతులు తిట్టారు. దీంతో తీవ్ర అవమానంతో ఆయన వెనుదిరిగారు. తాను తప్పు చేస్తే పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని కేశినేని నాని అన్నారు. మనం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచాం.. చంద్రబాబు చేసింది తప్పు కాదా అని కేశినేని ప్రశ్నించారు. పార్టీలో ఎవరు తప్పు చేసినా వారిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయొచ్చు.. నడిరోడ్డుపై అడ్డుకుని వాగ్వాదం చేస్తే పార్టీకే నష్టమంటూ ఎంపీ కేశినేని వ్యాఖ్యానించారు. కాగా, విజయవాడ పార్లమెంటు పరిధిలో టీడీపీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎంపీ కేశినేని నానిని రాజకీయంగా ఏకాకిని చేయడానికి పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గాలు పావులు కదుపుతున్నాయి. విజయవాడ నగరం కేంద్రంగా ఎత్తులకు పైఎత్తులు కొనసాగుతున్నాయి. చదవండి: కొడాలి నానిపై ఎస్ఈసీ ఆదేశాలను తోసిపుచ్చిన హైకోర్టు ఏం చేస్తావో తేల్చుకో బాబు..! -
ఎంపీ కేశినేని నానికి చేదు అనుభవం
-
రగులుతున్న మేయర్-కార్పొరేటర్ల పోరు!
సాక్షి, విజయవాడ: నగర మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ కార్పొరేటర్ల మధ్య తలెత్తిన అసమ్మతిపోరు ఇంకా సద్దుమణగలేదు. నోటి దురుసుతో అందరినీ బూతులు తిడుతున్న మేయర్ శ్రీధర్‌ను ఆ పదవి నుంచి తప్పించాల్సిందేనని స్వపక్ష కార్పొరేటర్లు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్లతో పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బుధవారం సమావేశమయ్యారు. మేయర్ శ్రీధర్‌ను తప్పించాల్సిందేనని ఈ సమావేశంలో కార్పొరేటర్లు బుద్దాను డిమాండ్ చేశారు. రొటేషన్ పద్ధతిలో మేయర్ పీఠాన్ని వేరేవారికి అప్పగించాలని కోరారు. మేయర్ ను తప్పించడమనేది తన పరిధిలో లేదని, మీ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్న బుద్దా కార్పొరేటర్లకు హామీ ఇచ్చారు. ఈ వివాదంపై చర్చించేందుకు మధ్యాహ్నం మేయర్ శ్రీధర్‌తో ఎమ్మెల్సీ బుద్దా సమావేశం కానున్నారు. ఈ రోజు సమావేశానికి ముగ్గురు మినహా కార్పొరేటర్లంతా హాజరయ్యారని, మేయర్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని కార్పొరేటర్లు తనకు ఫిర్యాదు చేశారని బుద్ధా మీడియాతో తెలిపాఈరు. సమన్వయలోపంతోనే మేయర్, కార్పొరేటర్లు మధ్య వివాదం తలెత్తిందని, మధ్యాహ్నం మేయర్‌తో సమావేశమై.. అందరినీ కలుపుపోవలని ఆయనకు సూచిస్తామని బుద్ధా పేర్కొన్నారు. మిగతా కులాల వారికి రొటేషన్ పద్ధతిలో చైర్మన్ పదవి ఇవ్వాలని కార్పొరేటర్లు కోరుతున్నారని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇతర ప్రాంతాలలో ప్రభావం.. విజయవాడ మేయర్‌ను మారిస్తే ఆ ప్రభావం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న అధికార పార్టీ మేయర్లపై పడుతుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల రెండేళ్లకు ఒకరు మేయర్‌గా ఉండాలన్న ఒప్పందాలు అమలుకాక పార్టీలో అంతర్గత కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ శ్రీధర్‌ను మారిస్తే ఒప్పందాన్ని ఉల్లంఘించి కొనసాగుతున్న తమ మేయర్లను కూడా మార్చాలని, ఇతర ప్రాంతాలలోని ఆశావహులు కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుందని భావిస్తుంది. -
‘ఐవైఆర్ తొలగింపు మంచి నిర్ణయం’
విజయవాడ: బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగించి సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టిన మనిషి ఐవైఆర్ కృష్ణారావు అని తూర్పారబట్టారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం నీచమైన చర్య అని అన్నారు. కృష్ణారావు అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐవైఆర్ సీఎం చంద్రబాబుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా సోషల్ మీడియాలో కృష్ణారావు చేసిన పోస్టులను సాకుగా చూపిస్తూ ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించింది. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. టీడీపీ నేతల ఫిర్యాదుతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైర్మన్ కృష్ణారావును ఎలాంటి వివరణ అడగకుండానే ఆయనను పదవి నుంచి తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎమ్మెల్సీ వెంకన్న దిష్టిబొమ్మ దహనం
తిరుపతి కల్చరల్: ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దిష్టిబొమ్మను చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అనుచరులు దహనం చేశారు. ఎంపీకి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. విషయం తెలుసుకున్న ఈస్ట్ పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అరెస్ట్ చేశారు. -
బీజేపీ, టీడీపీ నేతల బాహాబాహీ
విజయవాడలో ఉద్రిక్తత - గోశాలలో ఇరుపార్టీల కార్యకర్తల తోపులాట - బీజేపీ నేతల ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సాక్షి, విజయవాడ : బీజేపీ, టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. ఒక దశలో ఇరువర్గాలు ఒకరిని ఒకరు తోసుకున్నారు. పెద్దపెద్దగా కేకలు వేసుకోసాగారు. పరిస్థితి చెయ్యిదాటిపోతోందని గమనించిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపచేసి అక్కడ్నుంచి పంపివేశారు. మీ సంగతి తేలుస్తాం. ఇక్కడికి రావడానికి మీరెవరంటూ టీడీపీ నేతలు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నడుమ పెద్ద వాగ్వాదమే నడిచింది. ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న గోశాలలో ఆదివారం జరిగిన సంఘటన ఇది. వాగ్వాదం.. తోపులాట.. విజయవాడ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసిన దేవాలయాలను బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు ఆదివారం ఉదయం పరిశీలించారు. చివరగా అర్జున వీధిలోని గోశాల వద్దకు చేరుకుని అక్కడ జరిగిన ధ్వంసాన్ని పరిశీలించి విలేకరులతో మాట్లాడసాగారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడే సమయంలో టీడీపీ నేతలు వచ్చి అడ్డుకున్నారు. గోశాల ఎదురుగానే ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇళ్లు ఉండడంతో ఆయన తన అనుచరులతో అక్కడికి వచ్చి సోము వీర్రాజు నిర్వహిస్తున్న ప్రెస్‌మీట్‌ను అడ్డుకుని తన వాదన వినిపించబోయారు. తమ అభిప్రాయాలు చెప్పేందుకు ప్రెస్‌మీట్ పెట్టుకుంటే దాన్నెలా అడ్డుకుంటారంటూ వీర్రాజు, కన్నా ప్రశ్నించారు. ఈలోగా బీజేపీ నేతల వెనుక ఉన్న కార్యకర్తలను వెంకన్న వెంట వచ్చిన కార్యకర్తలు తోసివేశారు. బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. దీంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రెస్‌మీట్ అక్కడ నిర్వహించకూడదంటూ మైక్‌లు లాగేయబోయారు. ఒక దశలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.. బుద్దా వెంకన్న బంధువు, మాజీ కార్పొరేటర్ సంపర రాంబాబుల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ కార్యకర్తలు నాయకులకు అడ్డుగా నిలబడి ప్రెస్‌మీట్ కొనసాగించాలంటూ పట్టుబట్టారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. బీజేపీ నేతల్ని పంపించి వేసిన పోలీసులు గొడవ గురించి తెలుసుకున్న రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు అక్కడకు రాసాగారు. పరిస్థితి ఉద్రక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్దిచెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ తదితరుల్ని అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ కోరారు. వారిని బలవంతంగా కారు ఎక్కించి పంపించేశారు. బీజేపీ నేతలు వెళ్లిపోగానే అదే ప్రదేశంలో వెంకన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతాం సోము వీర్రాజు మాట్లాడుతూ.. నగరంలో దేవాలయాలు, గోశాలను అడ్డగోలుగా కూల్చివేయడం అమానుషమని, దీన్ని బీజేపీ ఎప్పటికీ సమర్ధించబోదన్నారు. అభివృద్ధికి తాము అడ్డుకాబోమని, అభివృద్ధికి అడ్డువచ్చే దేవాలయాలను వాటి యాజమాన్యాలతో మాట్లాడి ప్రత్యామ్నాయం చూపించిన తరువాత తొలగించాలని సూచించారు. గోశాలకు సంబంధించి 20 రోజులు క్రితం సీఎం సమక్షంలో చేసుకున్న ఒప్పందాన్ని ప్రక్కన పెట్టి రోడ్డుకు విస్తరించారనే విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్లి గోశాలకు, దేవాలయాలకు న్యాయం చేయాలని కోరతామన్నారు. -
సామాజిక మార్పుపైనే దృష్టి
తెనాలి: బుర్రిపాలెం అభివృద్ధితోపాటు అక్కడ సామాజిక మార్పుపై ప్రధానంగా దృష్టిసారిస్తానని ‘వెండితెర శ్రీమంతుడు’ ప్రిన్స్ మహేశ్‌బాబు చెప్పారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామాన్ని దత్తత తీసుకోవడం గొప్ప అవకాశమని చెప్పిన ఆయన.. గ్రామాభివృద్ధిలో తన సాయం, ప్రభుత్వ పథకాలతో సమకూరే నిధులతోపాటు ఇతరులనూ కలుపుకొని ముందుకు వెళతానని చెప్పారు. గుంటూరు జిల్లా బుర్రిపాలేనికి మహేశ్‌బాబు ఆదివారం మధ్యాహ్నం వచ్చారు. తన చిన్నాన్న జి.ఆదిశేషగిరిరావు, బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, విజయవాడ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో కలసి విలేకరులతో మహేశ్ మాట్లాడారు. తన నాయనమ్మ నాగరత్నమ్మ, తాత, తండ్రికి ఈ ఊరంటే ఎంతో ఇష్టమని, వారు ఊరికి చాలా చే శారని చెప్పారు. ఇక్కడకు రావటం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ‘శ్రీమంతుడు’ చేస్తున్న సమయంలో తన బావ జయదేవ్ బుర్రిపాలేన్ని దత్తత తీసుకోమని సూచించారన్నారు. అప్పట్లోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తే సినిమా కోసం చెప్పినట్టుగా ఉంటుందని, ఆ తర్వాతనే వెల్లడించానని చెప్పారు. గ్రామంలో ఆరోగ్యం, విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. విజయవాడ సిద్ధార్థ వైద్యకళాశాలకు చెందిన 200 మంది విద్యార్థులు, ఆంధ్రా హాస్పటల్లచే వైద్యశిబిరాల నిర్వహణ, వైద్యసహాయం వంటివి చేపడతామన్నారు. రోడ్లు, డ్రెయిన్లపై ఇప్పటికే కొంత పని చేశామన్నారు. తన నాయనమ్మ కట్టించిన స్కూలులో సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు. తన ప్రధాన దృష్టి అంతా సామాజిక మార్పుపైనని స్పష్టంచేశారు. తరచూ ఇక్కడకు వస్తుంటానన్నారు. తెలంగాణలో తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని ఇప్పటికే తన భార్య నమ్రత సందర్శించారని, అక్కడ కార్యక్రమాలు ఆరంభిస్తున్నామని చెప్పారు. కాగా మహేశ్‌ను చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. తమ నివాసం నుంచే మహేశ్‌బాబు వారికి పలుసార్లు అభివాదం చేశారు. అనంతరం టాపులేని వాహనంలో గ్రామంలో పర్యటించారు. గ్రామంలో చేపట్టనున్న రూ. 2.16 కోట్ల అభివృద్ధి పనుల పైలాన్‌ను ఎంపీ గల్లా జయదేవ్ ఆవిష్కరించారు. ఉన్నత పాఠశాలలో కొత్తగా నిర్మించిన అదనపు తరగతి గదులను మహేశ్‌బాబు ప్రారంభించారు. వీరితో తెనాలి ఆర్డీవో జి.నర్సింహులు, తహశీల్దారు జీవీ సుబ్బారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు తదితరులున్నారు. -
బుర్రిపాలెంలో బ్రహ్మోత్సవం
► ప్రిన్స్ మహేశ్‌బాబు రాకతో మిన్నంటిన కోలాహలం ► వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, గ్రామస్తులు ► సామాజిక మార్పునకు ప్రయత్నం చేస్తానని మహేశ్ వెల్లడి ► పేద మహిళలకు ఇళ్ల స్థల పట్టాల పంపిణీ తెనాలి : ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన ఘట్టం రానేవచ్చింది. తమ అభిమాన హీరో, ప్రిన్స్ మహేశ్‌బాబు రానున్న సమాచారం తెలిసి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన అభిమానులకు ఆదివారం నిజంగా పండగరోజయింది. ఉదయం నుంచి గ్రామంలో సందడి చేశారు. తెనాలి నుంచి, పరిసర గ్రామాల నుంచి ఏది దొరికితే ఆ వాహనంలో చేరుకున్న అభిమానులు, మహేశ్ పర్యటన మార్గానికి ఇరువైపుల వేచిఉండటమే కాదు, ఆ దారిలో ప్రతి మేడ, గోడ, చెట్టు...అభిమానులతో నిండిపోయింది. ఎండ ఒక పక్క ముచ్చెమటలు పట్టిస్తున్నా, దాహం వేస్తున్నా ఖాతరు చేసినవారు లేరు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత గ్రామానికి చేరుకున్న వెండితెర శ్రీమంతుడిని చూసి అంతా కేరింతలు కొట్టారు. చేతులు ఊపి సంతోషాన్ని తెలియ జేయటమే కాదు..సెల్ఫోన్లతో వీడియోలు, ఫోటోలు తీయటంలో మునిగిపోయారు. నేరుగా తమ ఇంటికి చేరుకున్న మహేశ్‌బాబు, రెండు మూడు పర్యాయాలు బయటకొచ్చి డాబాపైనుంచి చేతులూపుతూ కుర్రకారును మరింత కిర్రెక్కించారు. అదే భవనంలో మరో డాబాపై విలేకరుల సమావేశం, అక్కడే వనరులు, రుణ అర్హత కార్డులు, ఆరోగ్య కార్డులను పంపిణీ చేశాక, టాపులేని వాహనంపై బయలుదేరిన మహేశ్‌ను చూసి అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. మహేశ్ చేతుల మీదుగా.. గ్రామంలో అభివృద్ధి పనులే కాకుండా, సామాజిక మార్పునకు ప్రయత్నం చేస్తామని ప్రిన్స్ మహేశ్ బాబు ఈ సందర్భంగా చెప్పారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, విజయవాడ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తండ్రి సోదరు డు జి.ఆదిశేషగిరిరావుతో కలిసి మహేశ్ బాబు విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో చేపట్టనున్న కార్యక్రమాలతోపాటు అక్కడే ప్రభుత్వానికి చెందిన వివిధ వనరులను లబ్ధిదారులకు అందజేశారు. పేద మహిళలు వెంకటేశ్వరమ్మ, పాపమ్మకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేశారు. కిలారి రాజేష్‌కు కౌలురైతు రుణ అర్హత గుర్తింపు కార్డు అందజేశారు. డ్వాక్రా గ్రూపులకు కోటి రూపాయల చెక్కు అందించారు. మహేశ్‌తో కలిసి బుర్రిపాలెం గ్రామస్తుల ఆరోగ్య సంరక్షణకు ముందుకొచ్చిన ఆంధ్రా హాస్పటల్ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్డులను గ్రామసర్పంచ్ కొండూరి సామ్రాజ్యం, కంచర్ల ఏసుదాసు, పెమ్మసాని సంపతయ్యకు అందజేశారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యకార్డు లు ఇచ్చి, ప్రతి రెం డు నెలలకోసారి వైద్యశిబిరాలను నిర్వహిస్తామని ఆ హాస్పటల్ చైర్మన్ డాక్టర్ రమణ వెల్లడించారు. ఆర్నెల్లకోసారి పిల్లలకు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. గ్రామస్తులకు తమ హాస్పటల్లో స్పెషలిస్టు వైద్యపరీక్షలు ఉచితంగానే చేస్తామని ప్రకటించారు. ఐసీడీఎస్ పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రం నుంచి ఒకటో తరగతిలో చేరనున్న ఇద్దరు బాలికలకు తగిన పత్రాలను ఇచ్చారు. మచిలీపట్నం దగ్గర్లోని ఘంటసాల శివారు దేవరకోటలో ముత్యాలమ్మ తల్లి దేవాలయానికి మహేశ్‌బాబు అందించిన సహకారానికి కృతజ్ఞతగా ఆ గ్రామస్తులు తీసుకొచ్చిన చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఆదర్శగ్రామంగా బుర్రిపాలెం... గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ, చిత్తూరులో తమ తల్లిదండ్రుల ఊర్లను దత్తత తీసుకొని అభివృద్ధి చేశామని చెప్పారు. తన అత్తగారి ఊరయిన బుర్రిపాలెంను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని సంకల్పించినపుడు, ప్రధానమంత్రి గ్రామయోజన పథకంలో నిబంధనతో వీలు కాలేదన్నారు. ఫలితంగానే తన భార్య పద్మావతి, మహేష్‌బాబుకు చెరొక గ్రామం దత్తత తీసుకోవాలని సూచించినట్టు తెలిపారు. రోడ్లు, డ్రెయిన్లు, కమ్యూనిటీ హాలు, పైపులైను, అదనపు తరగతి గదులు నిర్మించి గ్రామాన్ని ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రముఖ నిర్మాత, హీరో కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ, మహేష్, ఎంపీ జయదేవ్‌లు గ్రామాభివృద్ధికి చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్టు చెప్పా రు. గ్రామాన్ని బాగు చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మహేశ్, జయదేవ్‌ల చొరవతో బుర్రిపాలెం రాష్ట్రంలో ఒక ఆదర్శ గ్రామంగా రూపొందగలదన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. మహేశ్‌బాబు చేపట్టిన దత్తత కార్యక్రమం మరెం దరికో స్ఫూర్తి కాగలదన్నారు. తెనాలి ఆర్డీవో జి.నర్సిం హులు, ఎంపీపీ ఎస్.వెంకట్రావు, తహశీల్దారు జీవీ సుబ్బారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు అమిరినేని రాజా, సౌపాటి కిరణ్, బుర్రిపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు.