Conflicts in TDP
-
హతవిధీ.. ఎంతటి అవమానం ఇది!
సాక్షి, అమరావతి:నామినేటెడ్ పదవుల పంపకంపై టీడీపీలో అసంతృప్తి జ్వాలలు తీవ్ర స్థాయిలో రగులుతున్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారిని, సీనియర్లను కాదని ముఖ్య నేతల కోటరీకి దగ్గరగా ఉండే వారికి పదవులు కట్టబెట్టారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. తొలి దశలో భర్తీ చేసిన 21 కార్పొరేషన్లు, అందులోని ఏడు కార్పొరేషన్లలోని డైరెక్టర్ పదవుల భర్తీకి హేతుబద్ధత లేదని వాపోతున్నారు. హవ్వ.. డైరెక్టర్ పదవులిస్తారా!పలువురు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కోసం పోటీపడ్డ వారిని కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమించి పార్టీ పెద్దలు చేతులు దులిపేసుకున్నారు. ఇది వారిని అవమానించడమేనని పార్టీలో చర్చ జరుగుతోంది. రంపచోడవరం ఎమ్మెల్యేగా పనిచేసిన వంతల రాజేశ్వరిని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించారు. ఎంపీ సీటు కోసం పోటీ పడిన గుడివాడకు చెందిన శిష్ట్లా లోహిత్కూ అదే కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి ఇచ్చారు. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావును అందులోనే డైరెక్టర్‌గా నియమించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ఒకసారి మంత్రిగా పనిచేసిన సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన పరసా వెంకటరత్నానికి ఒక కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి ఇవ్వడం అవమానించడం కాకపోతే ఏమిటనే ప్రశ్నలు టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. సీట్లు వదులుకున్న వారికి మొండిచేయి గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు, ఇతర సమీకరణల వల్ల 36 మంది నేతలు సీట్లు వదులుకున్నారు. వారిలో మంతెన రామరాజు, పీలా గోవింద సత్యనారాయణకే ఈసారి అవకాశం కల్పించారు. వీరు కాకుండా సీట్లు ఆశించి భంగపడిన నేతలు మరో 50 మంది వరకూ ఉన్నారు. వారందరికీ పదవుల పంపకంలో మొండిచేయి ఎదురైంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం సీటు వదులుకున్నా.. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఆయనకే ఇస్తారని ప్రచారం జరిగినా.. చివరికి జాబితాలో ఆయన పేరు లేదు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో కాకినాడ జిల్లా పిఠాపురం సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మను పట్టించుకోలేదు. వాస్తవానికి ఆయనకు తొలి విడతలోనే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాల్సి ఉన్నా పక్కనపెట్టారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లోనూ ఆయనకు అవకాశం కల్పించలేదు.సీనియర్ల ఆశలు నెరవేరలేదుమరోవైపు కచ్చితంగా తొలి దశలోనే తమకు పదవులు వస్తాయని భావించిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆనం వెంకటరమణారెడ్డి, అశోక్‌బాబు, మాల్యాద్రి, నీలాయపాలెం విజయ్‌కుమార్, బుద్దా వెంకన్న వంటి నేతలను తొలి దశలో పరిగణనలోకి తీసుకోలేదు. కొమ్మారెడ్డి పట్టాభికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా.. అది ఆయనకు దక్కలేదు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని తొలి దశలోనే తనకు అవకాశం దక్కుతుందని చెప్పుకున్న ఆనం వెంకటరమణారెడ్డిఇ మొండిచేయే ఎదురైంది. ఇంకా వివిధ జిల్లాల్లో అనేక మంది నేతల ఆశలు నెరవేరలేదు. దీంతో వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన నామినేటెడ్ పదవులను భర్తీ చేశారో చెప్పాలని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం తనయుడు లోకేశ్ కోటరీ సూచనల ప్రకారమే పదవులు కట్టబెట్టారని, ఆయన దృష్టిలో ఉన్న వారికి తప్ప మిగిలిన వారిని పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
బెజవాడ టీడీపీలో మంటలు.. కొత్త చిచ్చు రగులుకుంది..
సాక్షి, విజయవాడ: ఆ జిల్లా ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోట. క్రమంగా అక్కడి కోటలన్నీ బీటలు వారాయి. పైకి వీర విధేయులమనే చెప్పుకుంటున్నారు కానీ ఏమాత్రం తేడా కొట్టినా ఝలక్ ఇస్తుంటారు. ఇదీ బెజవాడలో సైకిల్ పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం మీరంటే.. మీరంటూ పచ్చ పార్టీ నాయకుల మధ్య కొట్లాట మొదలైంది. ఈ తగాదాలతో నేతల మధ్య మొదలైన గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఫలితంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వర్సెస్ బుద్ధా వెంకన్న, బోండా ఉమా, నాగుల్ మీరా అనేలా పరిస్థితులు మారాయి. కొంతకాలం క్రితం తనకు సరైన గౌరవం దక్కడం లేదని కేశినేని నాని అలకబూనారు. చదవండి: అచ్చెన్నకు లోకేష్‌తో చెడిందా?.. చినబాబుకు కళా అందుకే దగ్గరవుతున్నారా? దీంతో చంద్రబాబే ఒక మెట్టు దిగి వచ్చి కేశినేని నానిని బుజ్జగించడంతో పాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలను కూడా అప్పగిస్తూ ఆ నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించారు. ఐతే ఈ నిర్ణయాన్ని అప్పట్లో బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక అప్పట్నుంచి కేశినేని నాని, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారాయి పరిస్థితులు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో కేశినేని నాని తమ్ముడు కేశినేని శివనాధ్ ఆలియాస్ చిన్ని బెజవాడ పాలిటిక్స్‌లో చురుగ్గా ఉండటంతో పార్టీలో కొత్త చిచ్చు రగులుకుంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండటం కేశినేని నానికి ఇబ్బందిగా మారింది. ఇదంతా తనను పార్టీలోంచి పొమ్మనలేక పొగబెట్టడానికే అని కేశినేని నాని బలంగా నమ్మడంతో చంద్రబాబుతో టచ్ మీ నాట్ అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు సైతం కేశినేని నాని దూరంగా ఉన్నారు. అలాగే పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనడం లేదు. ఇక తన అసహనాన్ని, అసంతృప్తినంతా సోషల్ మీడియా వేదికగా పంచుకుని పార్టీలో తీవ్ర చర్చకు తెర తీశారు కేశినేని నాని. ఇలా వరుస పరిణామాలతో పార్టీ అధినేతకే తలబొప్పి కట్టేట్లు చేశారు నాని. చంద్రబాబుకు ఇటీవల ఢిల్లీ వెళ్ళినపుడు అక్కడే ఉన్న కేశినేని నాని బొకే ఇవ్వడానికి కూడా నిరాకరించి అటు అధినేతను.. ఇటు పార్టీ శ్రేణులను నివ్వెరపోయేలా చేశారు. ఇలా తరచూ అలిగే నానితోనే వేగలేకపోతున్న చంద్రబాబుకు తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశాలు మరో తలనొప్పి తెచ్చిపెట్టాయట. ఈ సారి విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచి తీరుతామని పదే పదే చెప్పే కేశినేని నాని ఈ సమావేశాలకు హాజరు కాలేదు. ఇక హాజరైన నేతల్లో కొందరికి సరైన గౌరవం దక్కక పోవడం కూడా ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీసింది. విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన బుద్ధా వెంకన్న స్టేజ్ మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో లేకపోవడం చూసి షాక్ తిన్నారు. తన ఫోటో పెట్టకపోవడంతో స్టేజ్ మీదకు పిలిచినా వెళ్లలేదు. కొల్లు రవీంద్ర స్వయంగా వచ్చి ఆహ్వానించినా బుద్ధా వెంకన్న ససేమిరా కుదరదని తేల్చేశాడు. తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుని ఇక అక్కడ ఉండలేక వైజాగ్ లో పనుందంటూ సమావేశం నుంచి బయటికి వచ్చేశాడు బుద్ధా. అక్కడి పరిస్థితులు చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని.. చంద్రబాబు కోసం ప్రాణం ఇచ్చే నాలాంటి వారికే ఇలా జరిగితే ఎలా అనుకుంటూ నాగుల్ మీరాతో కలిసి సమావేశాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయాడు బుద్ధా వెంకన్న. ఈ పరిణామాలను ఊహించని నేతలంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. బుద్ధా వెంకన్నకు జరిగిన అవమానంతో పశ్చిమ నియోజవర్గ టీడీపీ శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నారట. నాగుల్ మీరా సైతం ఈసారి తనకు టిక్కెట్ ఇస్తే సరేసరి లేకపోతే పార్టీ మారిపోవడానికైనా నేను సిద్ధం అంటూ తెగేసి చెప్పేశారట. -
టీడీపీలో కలవరపెడుతున్న ఫ్లెక్సీలు
-
విజయనగరం టీడీపీలో ఫ్లెక్సీ వార్.. అశోక్ గజపతి రాజుపై ధిక్కార స్వరం
సాక్షి, విజయనగరం: విజయనగరం టీడీపీలో విభేదాలు మదిరిపాకాన పడ్డాయి. మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై బీసీ మహిళా, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గత కొద్ది రోజుల క్రితం ధిక్కార స్వరం వినిపించారు. బీసీలు ఎక్కువగా ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకే టికెట్ ఇవ్వాలన్నది ఆమె డిమాండ్. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆమె డుమ్మా కొడుతున్నారు. నేరుగా చంద్రబాబుతోనే అమె టచ్‌లో ఉంటున్నారు. చదవండి: ‘చంద్ర’గ్రహణం వీడుతున్న కుప్పం మరోపక్క నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజును వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో బీసీలు లక్షా అరవైవేల మంది ఉన్నారంటూ, రాజ్యాధికారం బీసీలకే ఇవ్వండంటూ బీసీ ఐక్యవేదిక పేరుతో ఫ్లెక్సీలు విజయనగరం పట్టణంలో కీలక ప్రాంతాల్లో వెలిశాయి. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇది మీసాల గీత వర్గీయుల పనే అంటూ అశోక్ గజపతి వర్గం కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది. -
సై‘కిల్’: టీడీపీ నేతల పోరు.. తముళ్ల బేజారు
సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): ఎవరికి టికెట్టు దక్కుతుందో తెలియదు కానీ, మాకంటే మాకేనంటూ టీడీపీ నేతాగణం అప్పుడే ప్రచారం మొదలుపెట్టింది. అడ్డొస్తే సహించేది లేదంటూ పార్టీలోని తమ ప్రత్యర్థి వర్గంపై అడ్డంగా విరుచుకుపడుతున్నారు. రెండుగా విడిపోయి ఎవరికి వారు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందర్నీ ఒకచోటకు తెచ్చి సయోధ్య కుదర్చాల్సిన పార్టీ జిల్లా అధినేత తనకే టికెట్టు దక్కుతుందో లేదో తెలియక బయటకు రావడమే మానేశారు. ఎన్నికలకు రెండేళ్లుండగానే నేతలు కుమ్ములాటల్లో తేలియాడుతుండడంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. జిల్లాలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల తీరుతో కేడర్ విసిగిపోతోంది. కొంత మంది ఆ పార్టీ కీలక నాయకులు బహిరంగంగానే అసమ్మతి గళం వినిపిస్తున్నారు. చదవండి: ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది? ‘పల్లె’.. మూటాముల్లె సర్దుకోవాల్సిందే! తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై తిరుగుబాటు చేస్తున్న నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించి అగ్గిరాజేశారు. ఈసారి సైకం శ్రీనివాస రెడ్డికే టికెట్ అని బాంబు పేల్చారు. ఇదే క్రమంలో పుట్టపర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న కూడా ‘పల్లె’పై తిరుగుబావుటా ఎగరేశారు. నాలుగు రోజుల క్రితం బుక్కపట్నం మాజీ ఎంపీపీ పెదరాసు సుబ్రమణ్యం మీడియా ముందుకు వచ్చి.. ‘పల్లె’కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పనిచేయబోనని స్పష్టం చేశారు. ఓబుళదేవరచెరువు మండలానికి చెందిన మాజీ ఎంపీపీ ఇస్మాయిల్, కొత్తచెరువులో రఘుపతి (మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్), పెద్దన్న (లోచెర్ల), నిషార్ అహ్మద్ (మాజీ డీలర్), మండల మాజీ కన్వీనర్ శ్రీనాథ్ తదితరులు పల్లె రఘునాథ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. ఇంత జరుగుతున్నా ఆయన పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో కిందిస్థాయిలోని కార్యకర్తలు నిరుత్సాహంలో కూరుకుపోయారు. ‘పల్లె’ వెంట వెళ్లాలా? వద్దా? అనే సంశయంలో పడ్డారు. ధర్మవరంలో పరిటాల వర్సెస్ వరదా ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి బీజేపీలో చేరిన వరదాపురం సూరిని మళ్లీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని పరిటాల శ్రీరామ్ చెబుతున్నారు. ఒకవేళ ఆయన చేరాల్సి వస్తే తానే కండువా వేసి ఆహ్వానిస్తానని.. పార్టీ కోసం కష్టపడ్డాక పదవుల కోసం రెకమెండ్ చేస్తానని గతంలో పేర్కొన్నారు. సూరికి ధర్మవరం టికెట్ ఇస్తే మాత్రం తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలపై వరదాపురం సూరి వర్గీయులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. సూరి టీడీపీలో చేరడం ఖాయమని, పరిటాల శ్రీరామ్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. కదిరిలో అత్తార్ వర్సెస్ కందికుంట కదిరిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాట తారాస్థాయికి చేరింది. అత్తార్ చాంద్‌బాషా, కందికుంట వెంకటప్రసాద్ మధ్య కోల్డ్‌వార్ కొన్నిరోజులుగా హీట్ పుట్టిస్తోంది. టికెట్ తమకంటే తమకేనంటూ ఎవరికి వారు సొంత కేడర్ ఏర్పాటు చేసుకుని వేరు కుంపట్లు పెట్టుకున్నారు. అన్ని మండలాల్లో వర్గాలను ప్రోత్సహిస్తున్నారు. కందికుంట అనుచరులు ఇటీవల అత్తార్ అనుచరుడిపై దాడికి దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది. పెనుకొండలో తెరచుకోని టీడీపీ కార్యాలయం పెనుకొండ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిది విచిత్ర పరిస్థితి. ఈ సారి నియోజకవర్గ పార్టీ టికెట్ యూత్‌కేనంటూ అధిష్టానం తేల్చేయడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడిపోయారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడైన తనకే అధిష్టానం చెక్ పెట్టేలా వ్యవహరిస్తుండడంతో నెల రోజులుగా పట్టణంలోని టీడీపీ కార్యాలయాన్ని కూడా ఎక్కువగా తెరవడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ రేసులో అదే సామాజిక వర్గానికి చెందిన ఎస్.సవితమ్మతో పాటు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా ఉన్నారు. బీకే నాయకత్వంపై సోమందేపల్లి, పరిగి, పెనుకొండ మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటరమణ, బోయ సూరి, నాగలూరు నారాయణస్వామి తదితరులు అసంతృప్తితో ఉన్నారు. మడకశిరలో ఈరన్న వర్సెస్ తిప్పేస్వామి మాజీ ఎమ్మెల్యే ఈరన్న.. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య సమన్వయం లోపించింది. గత కొన్ని రోజులుగా ఇద్దరూ ఒకే కార్యక్రమంలో కనిపించడంలేదు. ఈరన్న ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. కాగా గుండుమల తిప్పేస్వామి తనకు అనుకూలంగా ఉన్న మరొకరిని ఎమ్మెల్యే రేసులోకి తెచ్చే ప్లాన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. బాలయ్యో.. ఇటు చూడయ్యో.. హిందూపురంలో అయితే తెలుగు తమ్ముళ్లది కక్కలేని మింగలేని పరిస్థితి. ఎంతో నమ్మకంతో గెలిపించిన నందమూరి బాలకృష్ణ ఈ మధ్య ఇటు చూడడమే మానేశారు. సినిమా షూటింగుల్లో బిజీబిజీగా ఉంటున్నారు. చుట్టుపు చూపుగా అప్పుడప్పుడు వస్తున్నా.. గృహ ప్రవేశాలు, వివాహాల ఫంక్షన్లకే పరిమితమవుతున్నారు. తను నమ్మి ఇక్కడ ఉంచిన పీఏనేమో అసాంఘిక కార్యకలాపాల్లో తలమునకలైన పరిస్థితి. దీంతో ఆ పార్టీ కేడర్ నైరాశ్యంలో మునిగిపోయింది. -
తిట్టుకున్న టీడీపీ మహిళా నేతలు.. గొడవ ఎందుకంటే?
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ జిల్లా మహిళా నేతల మధ్య రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సాక్షిగా విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. మద్యపాన నిషేధంపై శనివారం ఉదయం పార్టీ కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత.. విశాఖ పార్లమెంట్ అధ్యక్షురాలు అనంతలక్ష్మి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ర్యాలీలో తనకు చోటు కల్పించకుండా ఎందుకు పక్కకు నెడుతున్నారంటూ అనంతక్ష్మిని నిలదీశారు. దీంతో వివాదం మొదలైంది. చదవండి: బాబూ.. తిట్టేశాం! చంద్రబాబుకు చెప్పుకున్న తిరుపతి టీడీపీ నేతలు కార్యక్రమాలు మేం నిర్వహిస్తున్నామంటూ అనంతలక్ష్మి బదులియ్యడంతో.. పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో ఏం చేస్తున్నారో అందరికీ తెలుసనీ.. పదవి వచ్చిన తర్వాత.. ఇష్టం వచ్చినట్లు ఎవరుపడితే వాళ్ల దగ్గర నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని సుజాత అన్నారు. ఎవరికి పదవి ఎలా వచ్చిందో తమకు తెలుసనీ.. సభ్యతగా మాట్లాడాలని అనంతలక్ష్మికి ఆమె సూచించారు. సామాజిక వర్గాన్ని తక్కువ చేసి నోరుజారి మాట్లాడితే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని సుజాత హెచ్చరించారు. ఇరువురి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుతుండటంతో అనిత కలుగజేసుకుని మీడియా ఉన్న దగ్గర గొడవలు వద్దని సర్ది చెప్పారు. ఇలా తెలుగు మహిళల మధ్య మొదలైన ప్రోటోకాల్ వివాదం.. వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది. అనంతలక్ష్మి వ్యవహారంపై టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు సుజాత ఫిర్యాదు చేశారు. -
Anantapur: చంద్రబాబు సభలో ‘పరిటాల’ అనుచరులు రచ్చరచ్చ..
అనంతపురం శ్రీకంఠంసర్కిల్/కనగానపల్లి/రాప్తాడు: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలో ఆ పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు సభలో మరో నేతకు మాట్లాడేందుకు అవకాశమివ్వలేదు. పార్టీలో క్రమశిక్షణ తప్పిందని అంగీకరిస్తూనే.. సరిదిద్దేందుకు కఠినంగా వ్యవహరిస్తానని అన్నారు. తనను కలిసేందుకు ఎవరు వచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండబోదని తేల్చి చెప్పారు. సభ మధ్యలో కార్యకర్తలు చీటీలు రాసి నేతలపై ఫిర్యాదులు పంపారు. వాటిని చూసిన చంద్రబాబు తనకు అన్నీ తెలుసునన్నారు. చదవండి: చీప్ పాలి‘ట్రిక్స్’కు తెరలేపిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాగా, సభావేదిక ఏర్పాటు సక్రమంగా లేకపోవడంతో చంద్రబాబు ప్రసంగాన్ని కవర్ చేసేందుకు మీడియా ఇబ్బంది పడింది. ఈ క్రమంలోనే తమ అధినేత కనిపించడం లేదంటూ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళా కార్యకర్త ఏకంగా దూషణలకు దిగింది. కాగా, చంద్రబాబు పర్యటనను స్వాగతిస్తూ నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కొందరి నేతల ఫొటోలను ఆ పార్టీకి చెందిన ప్రత్యర్థి వర్గాలు తొలగించడం వివాదాస్పదమైంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ఫ్లెక్సీని సగానికి పైగా కత్తిరించేశారు. మీ జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయి.. జాగ్రత్త! ‘ఏయ్.. ఏం కావాలి. ఎందుకు గొడవ చేస్తున్నారు.. మాట్లాడొద్దు.. మీ జాతకలన్నీ నా దగ్గరున్నాయి. జాగ్రత్త’ అంటూ పరిటాల శ్రీరామ్ అనుచరులను చంద్రబాబు హెచ్చరించారు. రాప్తాడులో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగాన్ని పలువురు అడ్డుకుని పరిటాల శ్రీరామ్‌కు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని నినాదాలు చేశారు. మాజీ మంత్రి పరిటాల సునీతను వేదికపైకి పిలవకపోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు వారిపై ఆగ్రహం చేస్తూ.. తీవ్రంగా మాట్లాడారు. చెన్నేకొత్తపల్లిలోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దివిసీమ టీడీపీలో ఉప్పెన
మోపిదేవి (అవనిగడ్డ): కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మోపిదేవి మండల టీడీపీ నాయకుల మూకుమ్మడి రాజీనామాలు దివిసీమలో తీవ్ర చర్చలకు దారితీశాయి. మాజీమంత్రి కొల్లు రవీంద్ర కుటుంబం నుంచే ఈ ముసలం పుట్టడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రులు నడకుదటి నరసింహారావు సోదరుడు, కొల్లు రవీంద్ర మేనమామ అయిన జనార్దనరావు అధిష్టానంపై రాజీనామా అస్త్రాన్ని సంధించారు. ఈయన మూడు దశాబ్దాలుగా టీడీపీ నేతగా, రెండు పర్యాయాలు మండల పార్టీ అధ్యక్షుడిగా, గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. శనివారం ఉత్తర చిరువోలులంకలోని ఆయన ఇంటివద్ద టీడీపీకి, అవసరమైతే ఎంపీటీసీ పదవికి సైతం తాను, తన కుటుంబం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కమ్యూనిస్టు పార్టీలో కొనసాగామని, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావు పిలుపు మేరకు ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. అప్పటి నుంచి టీడీపీకి మండలంలో కంచుకోటగా గ్రామాన్ని బలోపేతం చేశానని చెప్పారు. సర్పంచ్‌గా తాను, తన భార్య జననీకుమారి బాధ్యతలు నిర్వహించామని గుర్తు చేశారు. 2014 ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంపీపీని చేస్తామని చెప్పడంతో ఆర్థిక స్థోమత లేకపోయినా పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని తెలిపారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్లీ పోటీచేయాలని, గెలిస్తే ఎంపీపీ స్థానంలో కూర్చోబెడతామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో తన భార్య జననీకుమారిని కార్యకర్తలు గెలిపించారని పేర్కొన్నారు. అయితే ఎంపీపీ పదవి ఇవ్వకుండా.. హామీని మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను గడ్డిపరకలకన్నా హీనంగా చూస్తున్నారని అన్నారు. అవసరానికి మాత్రమే వాడుకుంటూ అవకాశం ఉన్నా.. తమకు పదవి ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తన భార్య జననీకుమారి ఎంపీటీసీ పదవిని కూడా వదులు కోవడానికి సిద్ధంగా ఉందని జనార్దనరావు వివరించారు. కాగా, ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
టీడీపీలో ముసలం: తారస్థాయికి వర్గ విభేదాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. అనంతపురం కమ్మ భవన్లో శనివారం జరిగిన ‘రాయలసీమ నీటి ప్రాజెక్టుల సదస్సు’ ఆ పార్టీ నేతల్లో చిచ్చు రేపింది. సదస్సు నేపథ్యంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలతో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సొంత పార్టీ నేతలే ఆయనపై మండిపడుతున్నారు. జేసీ సోదరుల పెత్తనాన్ని ఇక సహించబోమని స్పష్టం చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. వాస్తవానికి జిల్లా టీడీపీ నేతల మధ్య మొదట్నుంచీ సఖ్యత లేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో ఆధిపత్య పోరు కూడా అధికమైంది. జేసీ బ్రదర్స్ పార్టీలో చేరిన తరువాత అంతర్గత కుమ్ములాటలు మరింత ఎక్కువయ్యాయని ఆ పార్టీ సీనియర్ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. (చదవండి: గోబెల్స్‌కు తమ్ముళ్లు.. టీడీపీ అబద్ధపు ప్రచారాలు) జేసీ బ్రదర్స్‌పై ముప్పేట దాడి.. జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరు టీడీపీని మరింత అంధకారంలోకి నెట్టేలా ఉందని, నియంతృత్వ వైఖరి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఆదివారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ హెచ్చరించారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి జేసీ సోదరులంటే మొదట్నుంచీ పడదు. వారితో విభేదించే ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లారు. ఆ తరువాత జేసీ సోదరులకు వ్యతిరేకంగా ప్రతి సందర్భంలోనూ గళం విని్పంచారు. తాజాగానూ జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘జేసీ గూండాగిరికి భయపడం. వారి తప్పుడు పనులను సమరి్థంచాలా? వారు టీడీపీలోకి వచ్చాకే గ్రూపు రాజకీయాలు పెరిగాయి. పార్టీని సర్వనాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. నియోజకవర్గాల వారీగా చిచ్చు పెడుతున్నారు. మా నియోజకవర్గాల్లో మీ జోక్యం ఏంటి? మీ పెత్తనాన్ని ఇక సహించం. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుని మీకు వ్యతిరేకంగా పోరాడతాం’ అని హెచ్చరించారు. మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి తనపై చేసిన అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పందించారు. జేసీ ఆరోపణలు అర్థరహితమని, వాటిని రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. మాజీ మంత్రి పరిటాల సునీత సైతం జేసీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. పారీ్టలో ఏవైనా సమస్యలు ఉంటే.. అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ బహిరంగంగా ఒక సభలో ప్రస్తావించడం సరైంది కాదని అన్నారు. చర్చను తప్పుదోవ పట్టించేలా ఆయన మధ్యలో కలి్పంచుకుని మాట్లాడినట్లు ఉందన్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే కేశవ్ సైతం సదస్సులో జేసీ వ్యాఖ్యలను ఖండించారు. అలా చేయకుండా ఉండాల్సిందన్నారు. అనంత టీడీపీలో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. కాలవ శ్రీనివాస్‌పై అభ్యంతరాలు ఉంటే చంద్రబాబుతో మాట్లాడాలని జేసీ ప్రభాకర్‌రెడ్డికి సూచించారు. ఉనికి కోసం పాట్లు.. జిల్లా టీడీపీ నేతలు ఉనికి కోసం పాట్లు పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనంతో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటికీ ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో అడపాదడపా ఉనికి చాటుకునేందుకు ‘తమ్ముళ్లు’ ప్రయతి్నస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుల సందర్శన, సదస్సులంటూ హడావుడి చేస్తున్నారు. మొదటి సదస్సులోనే వర్గ విభేదాలు బహిర్గతం కావడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. చదవండి: కుసంస్కారం: టీడీపీ పిచ్చి పరాకాష్టకు.. -
రచ్చకెక్కిన విభేదాలు: కాల్వ శ్రీనివాస్‌పై జేసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, కాల్వ శ్రీనివాస్‌ల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఓడిపోవడం ఖాయమంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి జోస్యం చెప్పుకొచ్చారు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని సూచించారు. కార్యకర్తలను టీడీపీ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఓటమి భయంతో జేసీ కంటతడి..!) తనకు, కార్యకర్తలకు ఏ మాత్రం సమాచారం లేకుండానే మీటింగ్‌లు నిర్వహిస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ వైఖరిని తప్పుపట్టారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ కనుసన్నల్లోనే ఇలా జరుగుతుందన్నారు. కాల్వ శ్రీనివాస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇలానే జరిగితే త్వరలోనే కార్యకర్తలు తామే స్వయంగా మీటింగ్ పెట్టుకుంటారని జేసీ హెచ్చరించారు. పెద్దవాళ్లను దృష్టిలో పెట్టుకుని తాను ఇలా మాట్లాడటం లేదని.. తమను పలకరించిన వారే లేరని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను సరిగా చూసుకోవడం లేదు.. టీడీపీ నేతలను కార్యకర్తలు నమ్మటంలేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. చదవండి: కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన జేసీ -
విజయవాడ టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, విజయవాడ: విజయవాడలో టీడీపీలో ఇంటిపోరు ముదిరింది. గురువారం మరోసారి టీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ కేశినేని నానికి బెజవాడలో చేదు అనుభవం ఎదురైంది. డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన కేశినేని నానితో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయులు వాగ్వాదానికి దిగారు. పార్టీ మారిన వారిని ఎలా ప్రోత్సహిస్తారంటూ బుద్దా వర్గీయులు నిలదీయడంతో పాటు బూతులు తిట్టారు. దీంతో తీవ్ర అవమానంతో ఆయన వెనుదిరిగారు. తాను తప్పు చేస్తే పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని కేశినేని నాని అన్నారు. మనం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచాం.. చంద్రబాబు చేసింది తప్పు కాదా అని కేశినేని ప్రశ్నించారు. పార్టీలో ఎవరు తప్పు చేసినా వారిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయొచ్చు.. నడిరోడ్డుపై అడ్డుకుని వాగ్వాదం చేస్తే పార్టీకే నష్టమంటూ ఎంపీ కేశినేని వ్యాఖ్యానించారు. కాగా, విజయవాడ పార్లమెంటు పరిధిలో టీడీపీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎంపీ కేశినేని నానిని రాజకీయంగా ఏకాకిని చేయడానికి పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గాలు పావులు కదుపుతున్నాయి. విజయవాడ నగరం కేంద్రంగా ఎత్తులకు పైఎత్తులు కొనసాగుతున్నాయి. చదవండి: కొడాలి నానిపై ఎస్ఈసీ ఆదేశాలను తోసిపుచ్చిన హైకోర్టు ఏం చేస్తావో తేల్చుకో బాబు..! -
ఎంపీ కేశినేని నానికి చేదు అనుభవం
-
విజయవాడ టీడీపీలో తారస్థాయికి విభేదాలు..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ పార్లమెంటు పరిధిలో టీడీపీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ను రాజకీయంగా ఏకాకిని చేయడానికి పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గాలు పావులు కదుపుతున్నాయి. విజయవాడ నగరం కేంద్రంగా ఎత్తులకు పైఎత్తులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కేశినేని నాని కుమార్తె శ్వేత స్థానంలో నగర కార్పొరేషన్ మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ భార్య రమాదేవిని రంగంలోకి దించాలని వ్యూహం రచించాయి. అయితే పాత పద్ధతిలోనే మున్సిపోల్స్‌ను పునఃప్రారంభించాలని ఎస్ఈసీ ఆదేశించిన నేపథ్యంలో రమాదేవి పేరు ప్రస్తావనకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. పార్టీ అధిష్టానం అండతోనే.. కేశినేనికి వ్యతిరేక వర్గంగా గుర్తింపున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా, వర్ల రామయ్య, తాజాగా వివాదాస్పదునిగా గుర్తింపు పొందిన కొమ్మారెడ్డి పట్టాభిరాం తదితరులకు అధిష్టానం నుంచే ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. కేశినేనిని విభేదిస్తూ ఆయనకు వ్యతిరేకంగా తాజాగా చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే... ♦విజయవాడ పార్లమెంటు జిల్లా పార్టీ కార్యదర్శి నియామకం విషయంలో నాయకుల మధ్య బేధాభిప్రాయాలు తీవ్రమయ్యాయి. కేశినేని మైనార్టీ వర్గానికి చెందిన ఫతావుల్లా పేరును ప్రతిపాదించారు. కానిపక్షంలో బీసీ వర్గానికి చెందిన గోగుల వెంకటరమణను సూచించారు. తనకు తెలియకుండా పశ్చిమ నియోజకవర్గం నుంచి మరో మైనార్టీ నాయకుడిని ఎలా సిఫార్సు చేస్తారంటూ నాగుల్‌మీరా అభ్యంతరం వ్యక్తంచేయడంతో పాటు బుద్దా వెంకన్న సహకారం పొందారు. వీరివురూ బొండా ఉమాతో మంతనాలు చేసి సెంట్రల్‌కు చెందిన ఎరుబోతు రమణ పేరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తను పొలిట్‌బ్యూరో సభ్యుడినని, తన లెటర్‌హెడ్‌తో పంపుతున్న ప్రతిపాదనకు ప్రాధాన్యం ఉంటుందని ఎరుబోతు రమణకే పదవి దక్కుతుందని బొండా భరోసా ఇచ్చారంటున్నారు. ♦పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీది మూడుముక్కలాట అయ్యింది. బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా, జలీల్‌ఖాన్‌లు ఒక్కటయ్యారు. పార్టీ అవసరాల దృష్ట్యా 8 నెలల కిందట ఆ నియోజకవర్గాన్ని చూడాలని కేశినేని నానికి చంద్రబాబు బాధ్యత అప్పగించారు. దీంతో కార్పొరేట్ అభ్యర్థులను కూడా ఎంపీనే ఎంపికచేశారు. తమ నియోజకవర్గంలో ఆయన పెత్తనమేంటంటూ బుద్దా, మీరాలు ఒక్కటై మనలో ఎవరో ఒకరం ఇన్చార్జులుగా ఉండాలే తప్ప మరొకరి జోక్యాన్ని అంగీకరిచకూడదనే అవగాహనకు వచ్చారు. నగరంలో ఎంపీ వ్యతిరేకవర్గీయులను ఏకతాటిపైకి తీసుకురావడంలోనూ వారివురూ పావులు కదుపుతున్నారు. అంతకుముందు బుద్దా, కేశినేనిల మధ్య సోషల్‌మీడియాలో వార్ జరిగిన సంగతి తెలిసిందే. ♦ఎంపీ కార్యాలయంలో బాధ్యతలు నిర్వర్తించిన కొమ్మారెడ్డి పట్టాభిరాం అక్కడ విభేదించి క్రమంగా పార్టీ కేంద్ర కార్యాలయంలోకి చేరుకున్నారు. తనదైన శైలిలో లోకేష్‌కు సన్నిహితంగా మెలుగుతూ కేశినేనికి నగరంలోని నాయకులు దూరమయ్యారనే వ్యతిరేక ప్రచారంతో అనునిత్యం పావులు కదుపుతూ పట్టాభి తీరికలేకున్నారని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ♦లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నందిగామ పార్టీ ఇన్చార్జి తంగిరాల సౌమ్య రాజకీయ అవసరాల రీత్యా ఉమాతో మైత్రి కొనసాగించక తప్పదు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, తిరువూరు నాయకులు స్వామిదాసు తదితరులు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు అధ్యక్షుడు నెట్టెం రఘురాం మాత్రం కేశినేనితో సాన్నిహిత్యం కలిగి ఉన్నారని పారీ్టవర్గాలు అంటున్నాయి. పలకరింపూ లేదాయె... తూర్పు నియోజకవర్గంతో పాటు నగరంలో ఏ ముఖ్య కార్యక్రమానికైనా, సంఘటన జరిగినా కేశినేని శ్వేత తప్పకుండా వెళ్లేవారు. తూర్పు పరిధిలో ఉన్న పట్టాభిపై దాడి జరిగినా ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత అటువైపు కన్నెత్తి చూడలేదు. పట్టాభితో సరిపడకపోయినా తాజా పరిణామాల నేపథ్యంలో బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా వర్గం తీరిగ్గా పరామర్శకు ఇంటికి వెళ్లడం పరిశీలనాంశం. మూడు ముక్కలైన ‘టీం విజయవాడ’! విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నాయకులతో ‘టీం విజయవాడ’ పేరిట ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు నిన్న మొన్నటివరకు కేశినేని భవన్‌పై ఉండేవి. తాజాగా నగర పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తదితరుల ఫొటోలు ఆ టీంలో లేకపోవడం కొసమెరుపు. (చదవండి: మరింత వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..) టీడీపీ కార్యకర్తల అరాచకం -
అనిత వద్దు టీడీపీ ముద్దు అంటూ..
సాక్షి, విశాఖపట్నం: అసమ్మతి నేతలు గళం విప్పారు.అవినీతి ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తే చిత్తుచిత్తుగా ఓడిపోతామని అధినేత వద్ద కుండబద్ధలుకొట్టారు. పార్టీనే నమ్ముకున్న సీనియర్లకు ఈసారి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ టికెట్ల పంచాయతీ గురువారం అమరావతిలో వాడీవేడిగా జరిగినట్టు తెలిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీ సమావేశాలు జరిగాయి. రాత్రి విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని సమన్వయ కమిటీల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా సిటింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులతో విడివిడిగా మాట్లాడారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కనీసం వివాదాలకు తావులేని నియోజకవర్గాల వరకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. విశాఖ తూర్పునకు వెలగపూడి రామకృష్ణ, విశాఖ పశ్చిమకు పీజేవీఆర్ నాయుడు (గణబాబు), విశాఖ దక్షిణానికి వాసుపల్లి గణేష్‌కుమార్, పెందుర్తికి బండారు సత్యనారాయణమూర్తి, గాజువాకకు పల్లా శ్రీనివాసరావు, నర్సీపట్నానికి అయ్యన్నపాత్రుడు, అరకుకు కిడారి శ్రావణ్‌కుమార్, పాడేరుకు గిడ్డి ఈశ్వరి తొలివిడతలో టికెట్లు ఖరారయ్యాయని చెబుతున్నారు. పార్లమెంట్ అభ్యర్థుల విషయానికి వస్తే అరకుకు కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ పేరు ఖరారయ్యే అవకాశాలున్నాయి. అనకాపల్లి ఎంపీ కోసం మంత్రి అయ్యన్నపాత్రుడు తన కుమారుడు విజయ్ కోసం పట్టుబట్టినట్టు తెలిసింది. విశాఖకు గంటా శ్రీనివాసరావు, ఎం.శ్రీభరత్ కుమార్ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమన్వయ కమిటీ నేతలు చెబుతున్నారు. అనితపై ఎగసిన అసమ్మతి : పాయరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితపై అసమ్మతి సెగ అమరావతికి తగిలింది. సమన్వయ కమిటీ భేటీలోనే అనిత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలంతా గళం విప్పారు. ఎమ్మెల్యే అనినీతి తారస్థాయికి చేరుకుందని, మళ్లీ ఆమెకు టికెట్ ఇస్తే ఘోరంగా ఓటమి పాలవడం ఖాయమని సమన్వయ కమిటీ భేటీలో నేతలు పార్టీ పెద్దలకు తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అనిత– అసమ్మతి నేతల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుందని తెలిసింది. ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, నాయకులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదంటూ అసమ్మతి నేతలు ఫిర్యాదుచేశారు. వారు చెప్పేవన్ని అబద్ధాలేనని, తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఈసారి మళ్లీ గెలుస్తానంటూ అనిత చెప్పుకొచ్చారు. కాపులకు ఇవ్వండి : చోడవరం నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లు కాపులేనని, ఈసారైనా అసెంబ్లీ సీటును కాపులకు ఇవ్వాలని చోడవరం కాపు నేతలు డిమాండ్ చేశారు. చోడవరం సమన్వయ కమిటీ భేటీలో ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు ఈసారి టికెట్ ఇవ్వొద్దని, పార్టీలో సీనియర్లు చాలా మంది ఉన్నారని, ఈసారి కాపులకు ఇచ్చి తీరాలని వారు పట్టుబట్టారు. మాడుగులలో కూడా ఇదే రీతిలో పార్టీ ఇన్చార్జి గవిరెడ్డి రామా నాయుడుకు వ్యతిరేకంగా పలువురు గళమెత్తినట్టు తెలిసింది. భరత్‌కు ఎంపీ టికెట్ ఇవ్వండి విశాఖ ఎంపీ టికెట్ భరత్‌కుమార్‌కు ఇవ్వాలని మెజార్టీ ఎమ్మెల్యేలు అధినేతకు సూచించినట్టు తెలిసింది. తన పేరు గట్టిగా చెప్పాలని కోరుతూ బుధవారం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.40 లక్షలు ఎర చూపిన భరత్ ఒకరిద్దరికి ఇప్పటికే ఇవ్వగా.. మిగిలిన వారికి గురువారం ఉదయం సమావేశం ప్రారంభానికి ముందే అందజేసినట్టు తెలిసింది. దీంతో మెజార్టీ ఎమ్మెల్యేలు భరత్‌కుమార్ పేరునే ప్రతిపాదించినట్టు చెబుతున్నారు. అయితే మంత్రి గంటా పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. -
వెంకటపాలెంలో తమ్ముళ్ల బాహాబాహీ
వెంకటపాలెం(తుళ్లూరురూరల్): రాజధాని ప్రాంతం తాడికొండ నియోజకవర్గంలో టీడీపీలో విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మంగళవారం తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామం నుంచి మళ్లీ నువ్వే రావాలి బాబు అంటూ జెడ్పీ వైస్‌చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు పూర్ణచంద్రరావు తన అనుచరులతో గ్రామంలోకి ప్రవేశిస్తుండగా ఒక్కసారిగా ‘పూర్ణచంద్రరావు డౌన్ డౌన్’ అంటూ మరో వర్గం సభ్యులు దూసుకువచ్చారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా ఇష్టారీతిన కార్యక్రమాలు ఎలా చేస్తారంటూ పూర్ణచంద్రరావు వ్యతిరేక వర్గం నిలదీసింది. వెంకటపాలెం మాజీ సర్పంచ్ సోదరునిపై అసమ్మతి వర్గం నాయకులు దాడి చేయడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తుళ్లూరు ట్రాఫిక్ సీఐ ఆనంద్, సివిల్ ఎస్ఐ కే శ్రీనివాసరావు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన గడ్డం మార్టిన్ మాట్లాడుతూ కేవలం దళిత ఎమ్మెల్యే కావడంతోనే అగ్ర వర్ణాల వారు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికార పార్టీ కార్యక్రమాలకు30 యాక్ట్ అమలు కాదా? రాజధాని ప్రాంతంలో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తే వెంటనే పోలీసులు వాళ్ల ఇంటి ముందు వాలిపోతారు. అదే ప్రతిపక్ష, వామపక్ష పార్టీల నాయకులను అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుంటారు. కానీ తెలుగు దేశం పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు నిర్వహించే కార్యక్రమాలకు చట్టాలతో పని లేదు. నాయకులకు యాక్ట్‌లు వర్తించవు. వారం రోజులుగా రాజధాని భూములిచ్చిన నాలుగు గ్రామాల రైతులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే సెక్షన్ల పేరుతో దీక్షను భగ్నం చేశారు. కాని మంగళవారం విజయవాడ నుంచి సచివాలయానికి మార్గం అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలతో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు మాత్రం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
వైఎస్సార్ జిల్లాలో టీడీపీలో వర్గ విభేదాలు
-
టీడీపీ వర్గీయుల ఘర్షణ
కడప అర్బన్: ఇటీవల టీడీపీలో చేరిన మాజీ మంత్రి అహ్మదుల్లా, అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు లక్ష్మిరెడ్డి వర్గాల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. ఇద్దరు తెలుగు తమ్ముళ్ల మధ్య వాగ్వాదం ప్రారంభమై.. వారు తలలు పగులగొట్టుకునేంత వరకు దారి తీసింది. తీవ్రంగా గాయపడిన వారు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ♦ టీడీపీ నేత లక్ష్మిరెడ్డి వర్గానికి చెందిన మజ్జారి వెంకటసుబ్బయ్య తీవ్రంగా గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 28న టీడీపీ నేతలు అహ్మదుల్లా, అతని కుమారుడు అష్రఫ్తో పాటు, తమ గ్రామానికి చెందిన రాజుల వెంకట సుబ్బారెడ్డి, రవీంద్రారెడ్డి, ఇంకా కొంతమంది కలిసి గ్రామంలో ర్యాలీ, సమావేశం నిర్వహించారన్నారు. ఆ కార్యక్రమానికి అహ్మదుల్లా, అతని కుమారుడు వచ్చి తనను పిలిచినా తాను వెళ్లలేదన్నాడు. అంతకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలోని రామాలయం గోడలపై పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను సుబ్బారెడ్డితో పాటు, కొంతమంది వారి అనుచరులు ఏర్పాటు చేస్తుంటే తాము అభ్యంతరం తెలిపామన్నారు. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని తమపై దాడికి పాల్పడ్డారని తెలిపాడు. దాడి చేసిన వారిలో రాజుల వెంకటసుబ్బారెడ్డి, ఆర్. రవీంద్రారెడ్డి, పోతుల భాస్కర్‌రెడ్డి, రాంగంగిరెడ్డి, చంద్రబాబుతో పాటు మరికొందరు ఉన్నారని పేర్కొన్నాడు. తనపై సుత్తి, ఇంకా కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నాడు. ♦ ఈ సంఘటనలో గాయపడిన మాజీ మంత్రి అహ్మదుల్లా, అష్రఫ్ వర్గానికి చెందిన, ఆనగొంది చంద్రబాబు పాలెంపల్లెకు చెందిన వ్యక్తి, రూకవారిపల్లెకు చెందిన రాం గంగిరెడ్డిల ఫిర్యాదు మేరకు తమ గ్రామానికి రాజుల వెంకట సుబ్బారెడ్డి, ఇంకా కొందరు నేతలు కలిసి మాజీమంత్రి అహ్మదుల్లాను, ఆయన కుమారుడు అష్రఫ్‌లను ఈనెల 28న గ్రామానికి పిలిపించి భారీగా, ర్యాలీ బహిరంగసభ నిర్వహించామన్నారు. ఆ కార్యక్రమం చూసి ఓర్వలేని వెంకటసుబ్బయ్య, అతని కుమారుడు వెంకటరమణలు తమపై దాడి చేశారని తెలిపారు. మేము.. మేం.. ఒక్కటే మేమే చూసుకుంటాం– మాజీ మంత్రి అహ్మదుల్లా ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వారు రిమ్స్‌లో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించేందుకు టీడీపీ నేత, మాజీ మంత్రి అహ్మదుల్లా వచ్చారు. వెంకట సుబ్బయ్యను, చంద్రబాబు, రాం గంగిరెడ్డిలను పరామర్శించారు. అనంతరం మీడియాతో విషయం చెప్పేందుకు నిరాకరిస్తూనే... మేము మేమంతా ఒక్కటే... మేమే చూసుకుంటాం అంటూ వ్యాఖ్యానించారు. ఈ సంఘటనపై ఇరువర్గాలకు చెందిన 11 మందిపై కేసు నమోదు చేసినట్లు కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా తెలిపారు. -
సిటింగులకు ఫిటింగ్!
టీడీపీ ఎమ్మెల్యేల సిట్టింగ్ స్థానాల్లో భారీ మార్పులకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని తన సర్వేలో తేలిందని లీకులు ఇచ్చారు. దీంతో జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు అధినేత తనయుడు లోకేష్ బాబును, మరి కొందరు టీడీపీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వారు చెప్పిందల్లా చేస్తూ అక్రమంగా సంపాదించిన డబ్బులను ఖర్చు చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. సాక్షి, తిరుపతి: ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు సమన్వయ కమిటీ, మంత్రివర్గ సభ్యులతో తరచూ సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఐవీఆర్ఎస్ (ఇంట్రాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) పేరుతో సర్వే చేపట్టారు. ఇంకో వైపు ఎప్పటికప్పుడు అనుచరుల ద్వారా ఎమ్మెల్యేలపై నివేదికలు తెప్పించుకునే పనిలో పడ్డారు. మంత్రి అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సత్యప్రభ, సుగుణమ్మ, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తలారి ఆదిత్య, శంకర్‌యాదవ్‌పై ప్రధానంగా దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. ఏయే నియోజక వర్గాల్లో ఎవరికి తిరిగి టికెట్ ఇవ్వాలో తెలుసని, తనపై ఎవ్వరూ ఒత్తిడి చెయ్యవద్దని ఆయన తేల్చిచెప్పినట్లు ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. పలమనేరుపై మల్లగుల్లాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి స్వప్రయోజనాల కోసం టీడీపీ కండువా కప్పుకున్న అమర్నాథ్రెడ్డికి పలమనేరు కేటాయించాలా? వద్దా? అని చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. నియోజక వర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని చెప్పుకుని పచ్చకండువా కప్పుకున్న అమర్నాథ్రెడ్డి మంత్రి పదవి దక్కించుకున్నా పలమనేరుకు చేసిందేమీ లేదని తేలిపోయింది. నియోజక వర్గ ప్రజలు మంత్రిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఐవీఆర్ఎస్, తన సొంత సర్వేలోనూ ఇదే విషయం బయటపడడంతో చంద్రబాబు సందిగ్ధంలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. పలమనేరులో స్థానిక సహకారం లేనందున పుంగనూరులో పోటీకి దింపాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ♦ చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ స్థానికులకు అందుబాటులో ఉండడం లేదని సర్వేలో బయటపడింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి చిత్తూరుకు చేసిందేమీ లేదని జనం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. ♦ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్య కారణంతో ఈసారిటికెట్ ఇవ్వటం లేదని తేలిపోయింది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భార్య బృందమ్మ, కుమారుడు సుధీర్‌రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిపైనా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మంచి అభిప్రాయం లేదని తేలటంతో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు వైపు చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ♦ తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌పైనా నియోజకవర్గంలో మంచి అభిప్రాయం లేకపోవటంతో ఇక్కడ వేరొకరిని బరిలోకి దించాలని భావిస్తున్నట్లు అమరావతి సమాచారం. ♦ సత్యవేడు ఎమెల్యే తలారి ఆదిత్య విషయానికి వస్తే అవినీతి అక్రమాల్లో పూర్తిగా కూరుకుపోవటంతో ఇక్కడ కూడా వేరొకరికి టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ♦ తిరుపతిలో ఈసారి సిటింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మకు కాకుండా వేరొకరికి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలపై అధినేత తీవ్ర అసంతృప్తి ఉండటంతో సర్వేలో బాగోలేదని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అమరావతి చుట్టూ ప్రదక్షిణలు అభ్యర్థులను మార్చుతున్నారని తెలియటంతో కొందరు అనుచరులతో అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పనులన్నీ పక్కనపెట్టి అమరావతిలో కూర్చొని టికెట్ ఖరారు చేసుకునేందుకు చెయ్యని ప్రయత్నమంటూ లేదు. మంత్రి లోకేష్, మంత్రులు, టీడీపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు అమరావతిలో హోటళ్లో గదులను అద్దెకు తీసుకున్నారు. అత్యవసరమైతే విమానంలో రేణిగుంటకు వచ్చి పనులను చక్కబెట్టుకుని తిరిగి ఫ్లైట్‌లో అమరావతికి ఎగిరిపోతున్నారు. లోకేష్, మంత్రులు, టీడీపీ పెద్దలు ఏది చెబితే అది చేస్తూ అక్రమంగా సంపాదించిన డబ్బును టికెట్ తెప్పించుకునేందుకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజూ ఉదయం ఉండవల్లిలో సీఎం నివాసం వద్ద, మధ్యాహ్నం సచివాలయం, సాయంత్రం హోటళ్లలో మద్యస్థాలు నెరుపుతున్నారు. టికెట్ ఇస్తారో లేదో తెలియదు కానీ... ఎమ్మెల్యేలకు మాత్రం ఆర్మీ సెలెక్షన్ కంటే అభ్యర్థిత్వం ఎంపికే కష్టంగా ఉందని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
టీడీపీలో అసమ్మతి సెగలు..!
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు రోజురోజుకూ అన్ని నియోజకవర్గాలకూ పాకుతున్నాయి. రెండేళ్లుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఆపార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నా అధికారపార్టీ కావడంతో బయటపడలేక మదనపడిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీ ముఖ్యనేతల నుంచి సామాన్య కార్యకర్తల వరకూ బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. నిన్నమొన్నటి వరకూ ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు ఉన్న నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్న వినుకొండలో సైతం అసమ్మతి సెగ రాజుకుంది. మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు పార్టీని వీడి జనసేనలో చేరడంతో నియోజకవర్గానికి సంబంధం లేని ఐదుగురు నేతలను మండల ఇన్ఛార్జిలుగా నియమించడంతో ద్వితీయ శ్రేణి నేతలు మండిపడుతున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జిలకు టికెట్లు ఇవ్వ వద్దంటూ నేరుగా అధిష్టానం వద్దే పంచాయితీలు పెడుతుండటంతో టీడీపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే... టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుకు వ్యతిరేకంగా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎం.ఎస్. ప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు సోమవారం లోకేష్‌ను కలిసి ఎమ్మెల్యే జీవీపై ఫిర్యాదు చేయడం జిల్లాలో మాట్ టాపిక్‌గా మారింది. జిల్లాలో అసంతృప్తి నేతలను బుజ్జగించాల్సిన జిల్లా అధ్యక్షుడే గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీకి నష్టం చేకూరుస్తున్నారంటూ ఫిర్యాదు చేయడం టీడీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. జిల్లాలో రాజధాని నిర్మాణం జరుగుతున్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో టీడీపీ అసమ్మతి నేతలు బాహాబాహీకి దిగుతూ తన్నులాడుకుంటున్నారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా జెడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు వర్గీయులు సమావేశాలు పెట్టి ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో వర్గం మంగళవారం టీడీపీ కార్యాలయానికి వచ్చి బాలరాజుకు తాడికొండ టికెట్ కేటాయించాలని వినతిపత్రం ఇవ్వడంతో నియోజకవర్గ టీడీపీలోని విభేదాలు మరోసారి బయటపడినట్లైంది. బాలరాజు ఎక్సైజ్ సీఐగా పనిచేస్తూ దీర్ఘకాలిక సెలవు పెట్టి టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మాజీమంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు నియోజకవర్గంలో అధికారపార్టీ సామాజిక వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నేతల దాష్టికాలను తట్టుకోలేక పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ మారిన తరువాత ప్రత్తిపాడు నియోజకవర్గంతో సంబంధం లేని దాసరి రాజామాస్టారు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాయపాటి రంగారావు, గుంటుపల్లి నాగేశ్వరరావు, ఇక్కుర్తి సాంబశివరావులకు మండలి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంపై టీడీపీ స్థానిక నేతలు భగ్గుమంటున్నారు. సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసిన ప్రతిసారీ ఒకరిపై ఒకరు ధూషణలకు దిగుతూనే ఉన్నారు. మంగళగిరిలో సైతం ఇన్చార్జిగా ఉన్న గంజి చిరంజీవిపై అసమ్మతి పెరిగింది. మాచర్ల, పెదకూరపాడు, నర్సరావుపేట, బాపట్ల వంటి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు గ్రూపులుగా విడిపోయి తన్నుకుంటున్నారు. గుంటూరు నగరంలోని గుంటూరు వెస్ట్, ఈస్ట్ నియోజకవర్గాల్లో టీడీపీలో ఒకరంటే ఒకరికి పడక ద్వితీయశ్రేణి నేతలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల గ్రూపులుగా విడిపోయి బాహాబాహీకి దిగుతున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రితోపాటు స్థానిక మంత్రులు, ఎంపీలు, ముఖ్యనేతలు సైతం గ్రూపులను ప్రోత్సహిస్తూ తమ ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నగర టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. -
రాజంపేట టీడీపీలో రభస!
వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట : రాజంపేట టీడీపీలో రాజకీయ ప్రకంపనలు పుట్టుకొచ్చాయి. టీడీపీ శ్రేణులు రెండువర్గాలుగా విడిపోయాయి. ఆర్అండ్బీ బంగ్లా వేదికగా సమావేశం రచ్చరచ్చగా మారింది. ఆదివారం రాజంపేటలో ప్రెస్‌మీట్ పెట్టేందుకు మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్రాయుడు, సీనియర్ నేత జీఎన్‌నాయుడు, రెడ్యంతోపాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఆది, వాసు ఆర్అండ్బీ అతిథిగృహం వద్దకు చేరుకోగానే ఎమ్మెల్యే వర్గీయులు వారిని అడ్డుకున్నారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు తెలియకుండానే ఎలా వచ్చారని అంటూ పెదవి విరిచారు. పోలీసు బందోబస్తు మధ్య వారు ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు సన్నద్ధమైన తరుణంలో ఎమ్మెల్యే వర్గీయులు వేదిక వద్ద కు దూసుకొచ్చారు. డీఎస్పీ రాఘవేంద్ర, సీఐలు నరసింహులు, సూర్యనారాయణ సిబ్బందితోఎమ్మెల్యే వర్గీయులను అదుపుచేశారు. తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు మల్లెల వాణి, ఎమ్మెల్యే వర్గానికి చెందిన నాయకులు ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులరెడ్డి ఎదుట వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యేకు తెలియకుండా సమావేశం పెట్టడంలో ఆంతర్యం ఏమిటని ఆగ్రహించారు. ఇది ఇలావుండగా ప్రెస్మీట్లో రాజంపేట టీడీపీకి ఇన్చార్జిని ప్రకటిస్తారని, ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తారని ఊహాగానాలు ఎమ్మెల్యే వర్గీయులను ఆందోళనకు గురిచేయడమే ఈ రచ్చకు కారణమని తెలుస్తోంది. మేడా కంటే బలమైన అభ్యర్ధిని పోటీకి దించుతాం.. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి పార్టీలో సుమచితస్ధానం కల్పించామని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. విలేకర్లతో వారు మాట్లాడుతూ నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు విడుదలచేస్తామన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేశామన్నారు. పార్టీ మారితే హుందాగా బయటకి వెళ్లిపోవాలి తప్ప ఇలా నైతిక లేకుండా చేసి వెళ్లడం తగదన్నారు. ఒకరిద్దరు వెళ్లిపోయినంత మాత్రన పార్టీకి వచ్చిన నష్టం ఏమీలేదన్నారు. రాజంపేట నియోజకవర్గంలో మేడా కంటే బలమైన అభ్యర్ధిని రానున్న ఎన్నికల్లో పోటీకి దింపుతామన్నారు. ఎమ్మెల్యే బెదిరింపులకు, బ్లాక్‌మెయిలింగ్ టీడీపీ లొంగదన్నారు. ఈనెల 22న కార్యకర్తలతో సీఎం సమావేశం ఉంటుందన్నారు. అక్కడ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేని కూడా ఆహ్వానం ఉందన్నారు. తనపై అబద్ధాలు చెప్పిన జిల్లా టీడీపీ నేతలు సీఎంతో మాట్లాడిన తర్వాతే భవిష్యత్తు కార్యచరణ ఉంటుందని, మంత్రి ఆది, జిల్లా అధ్యక్షుడు వాసు ప్రెస్‌మీట్ పెట్టి తనపై పచ్చి అబద్ధాలు చెప్పారని ఎమ్మెలే, ప్రభుత్వవిప్ మేడా మల్లికార్జునరెడ్డి పేర్గొన్నారు. మేడా భవన్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మీడియా సమావేశంపై తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా పని చేసిన వారితో కలిసి సమావేశం నిర్వహించారన్నారు. తనపై పార్టీలో కొందరు కుట్ర చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజాసేవకు కట్టుబడి పనిచేశానన్నారు. ఈనెల 17న సీఎంను కలిసేందుకు విమానం టికెట్‌బుక్ చేసుకున్నానని, అయి తే తమ దగ్గరవారికి అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోయానన్నారు. పార్టీ సభ్యత్వాలు చేయడానికి కార్యకర్తలు ఆర్ధికంగా బాగాలేకపోవడమే కారణమన్నారు. జమ్మలమడుగులో మంత్రి ఆదికంటే తానే అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు చేయించానన్నారు. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి సీఎంతో భేటి అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటానన్నారు. జిల్లా నేతల ఉడత బెదిరింపులకు బెదిరేదిలేదని ఎమ్మెల్యే తేల్చిచెప్పారు. -
టీడీపీలో ‘అష్రఫ్’ ఎఫెక్ట్..!
కడప రూరల్: నందమూరి తారకరామరావు జయంతి..వర్ధంతి, కార్యక్రమం ఏదైనా సరే తమ్ముళ్ల మధ్య ఉన్న విభేదాలు ప్రతిసారీ బహిర్దతం కావడం సర్వ సాధారణంగా మారింది. ఇప్పుడు కడప టీడీపీలో గురువారం కొత్తగా పార్టీలో చేరి, కడప నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు అష్రఫ్ ఎఫెక్ట్ ఆ పార్టీ తమ్ముళ్లపై పడింది. ఏకపక్షంగా సాగుతున్న ఈ పరిణామాలను ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో శుక్రవారం ఐక్యమత్యంగా నిర్వహించుకోవాల్సిన ఎన్టీఆర్ 23వ వర్ధంతి కార్యక్రమానికి పలువురు నేతలు గైర్హాజరయ్యారు. అనుకున్న విధంగానే వర్ధంతినిబహిష్కరించిన తమ్ముళ్లు... విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు కడప నియోజక ఇన్చార్జిగా అష్రఫ్‌ను ప్రకటించగానే, కడపలో ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ మైనార్టీ సెల్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు అమీర్‌బాబు ఇంట్లో పలువురు నేతలు సమావేశమై, తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిరసనగా ఎన్టీఆర్ వర్ధంతిని బహిష్కరిస్తామని ప్రకటించారు. ఆ మేరకు స్ధానిక ఎన్టీఆర్ కూడలి వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు అమీర్‌బాబు, దుర్గాప్రసాద్, ఆరీఫుల్లా, బాలక్రిష్ణయాదవ్ తదితరులు హజరు కాలేదు. పార్టీ జిల్లా అధ్యక్షునిపై తమ్ముళ్ల ఫైర్.. వర్ధంతి కార్యక్రమం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిపై పలువురు నాయకులు బహిరంగంగానే అసంతృత్తిని వెళ్లగక్కారు. పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు సుభాన్‌బాషా మాట్లాడుతూ శ్రీనివాసులురెడ్డిని జిల్లా అధ్యక్షులుగా తొలగించిన తరువాతనే ఎన్నికలకు పోవాలన్నారు. ఆయన వల్ల కార్యకర్తలకు ఏమాత్రం న్యాయం జరుగడం లేదన్నారు. హరిప్రసాద్ మాట్లాడుతూ కొత్త వారు రావడంతో ఎన్నో ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. మొత్తం మీద అహ్మదుల్లా, అష్రఫ్ చేరికతో విభేదాలు భగ్గుమన్నాయి. స్థానిక ఎన్టీఆర్ కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహనికి అహ్మదుల్లా, అష్రఫ్‌లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమకు అప్పగించిన బాధ్యతల పట్ల కృతజ్ఙతలు వ్యక్తం చేశారు. తరువాత రక్తదానం శిబిరంలో పాల్గొన్నారు. కడపలో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హజరైన మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఎన్టీఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రజల మనిషి అన్నారు. తాను ఆయన కుమార్తెగా జన్మించడం తన అధృష్టమని తెలిపారు. -
టీడీపీపై కాపుల్లో కోపం!
బందరు నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గంలో అధికార పార్టీపై విశ్వాసం సన్నగిల్లిందా? ఇక తాము పార్టీలో ఇమడలేమని నిర్ణయించుకున్నారా? త్వరలో పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.. మచిలీపట్నం కాపు నేతల నుంచి. నాలుగేళ్ల పాలనలో తమకు తగిన ప్రాధాన్యత కల్పించలేదని.. ఏ ప్రధాన పదవీ తమకు ఇవ్వలేదని.. టీడీపీపై వారంతా అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. సాక్షి,కృష్ణాజిల్లా, మచిలీపట్నం: సార్వత్రిక ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న తరుణంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తమకు ఎక్కడ ప్రాధాన్యత ఇస్తారో అక్కడికి వెళ్లేందుకు నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే బందరు కాపు సామాజిక వర్గ నేతల నుంచి టీడీపీపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటుతున్నా తమను పట్టించుకున్న దాఖలాలు లేవన్న భావన వ్యక్తమవుతోంది. బందరు నియోజకవర్గ వ్యాప్తంగా 1.60 లక్షల మంది ఓటర్లుండగా.. అందులో దాదాపు 50,000లకు పైగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో ఎస్సీ, ముస్లిం, గౌడ, కమ్మ, యాదవుల ఓట్లున్నాయి. బందరు పట్టణంలో సైతం వారి హవా ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో వీళ్లే ప్రధాన భూమిక పోషించే అవకాశం సైతం లేకపోలేదు. అన్నింటా మొండిచేయి.. అంతటి ప్రాధాన్యత కలిగిన సామాజిక వర్గానికి చెందిన నాయకులకు టీడీపీ ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. ప్రధాన పదవుల్లో సైతం మొండిచేయి ఎదురవుతోంది. కేవలం ఎన్నికల సమయంలో ఓటు బ్యాంక్ కోసం మాత్రమే వినియోగించుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం పట్టణంలో కౌన్సిలర్, వార్డు మెంబర్ల స్థాయి పదవులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈ పరిణామాలు కాపు సామాజిక వర్గంలో అసహనానికి కారణమవుతున్నాయి. ♦ కాపు భవన్ నిర్మాణం ఏళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. ఎప్పటికి మొదలవుతుందోనన్న మీమాంస నెలకొంది. భవన నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఓ వ్యక్తి 50 సెంట్ల స్థలాన్ని సైతం ఉచితంగా ఇచ్చారు. అయినా పనులు ప్రారంభించేందుకు స్థానిక పాలకులు నిర్లక్ష్యం వీడటం లేదు. ♦ జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో ఒక్కో యూనిట్‌కు రూ.2 లక్షల మేర కాపు రుణాలు అందించారు. ఒక్క బందరు నియోజకవర్గంలో మాత్రం కేవలం రూ.లక్ష మాత్రమే కేటాయించారు. దీనిపై సైతం గుర్రుగా ఉన్నారు. కోనేరు సెంటర్లో బ్రిటీష్ పాలకులను జెండాను తొలగించి భారత జెండా ఆవిష్కరించడంతో కీలకంగా వ్యవహరించిన తోట నరసింహనాయుడుని సైతం విస్మరించారన్న విమర్శలున్నాయి. ♦ టీడీపీ రాష్ట్రస్థాయి పదవి మంత్రి కొల్లు రవీంద్ర వర్గమైన గోపీచంద్‌కు కట్టబెట్టడంపై సైతం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ♦ ఇండియా క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ సీకే నాయుడు విగ్రహ ఏర్పాటు కాపుల్లో మరింత అగ్గిని రాజేసింది. పైకి చెప్పకపోయినా లోలోపల ఆగ్రహంతో ఉన్నారు. అంతటి ఘన కీర్తిని చాటిన వ్యక్తి విగ్రహం జెడ్పీ కేంద్రంలోని మురుగు కాలువకు పక్కన ఏర్పాటు చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఆర్‌అండ్‌బీలో రహస్య సమావేశం? తమకు ప్రాధాన్యత ఇవ్వని పార్టీలో తామెందుకు ఉండాలన్న యోచనలో కాపులు ఉన్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఇటీవల స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో పట్టణంలోని 20 మందికి పైగా కాపు నాయకులు సమావేశమైనట్లు సమాచారం. తమ డిమాండ్లను అంగీకరించని పక్షంలో మూకుమ్మడిగా పార్టీ నుంచి వైదొలగేందుకు సిద్ధంగా ఉన్నామని తీర్మానించినట్లు వినికిడి. త్వరలో మరోసారి సమావేశమై చర్చించిన అనంతరం తమ డిమాండ్లను పాలకుల దృష్టికి తీసుకెళ్లాలని, తమకు సానుకూల పవనాలు వీయని పక్షంలో గుడ్‌బై చెప్పాలని తీర్మానించినట్లు విశ్వసనీయవర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. మంత్రి వద్దకు పంచాయితీ? కాపులు సమావేశమైన విషయం కాస్తా మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి వెళ్లింది. అయినా తనకేమీ తెలియనట్లు వ్యవహరించినట్లు తెలిసింది. పైకి అలా ఉన్నా.. లోలోపల మాత్రం సమావేశానికి ఆద్యులు ఎవరు? ఎవరిపై చర్యలు తీసుకోవాలి? వాళ్లకు కేసులేమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారణ మొదలు పెట్టినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మంత్రి సునీత సమక్షంలోనే కొట్టుకున్న తమ్ముళ్లు
కనగానపల్లి: ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం టీడీపీ చేపట్టిన గ్రామదర్శిని – గ్రామ వికాసం కార్యక్రమం మంత్రి పరిటాల సునీతకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు బయటపడుతుండడంతో పాటు సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారంటూ స్థానికులు నిలదీస్తుండడంతో సమాధానాలు చెప్పుకోలేక మంత్రి సతమతమవుతున్నారు. బుధవారం కనగానపల్లి మండలం చంద్రశ్చర్లలో మంత్రి సమక్షంలోనే తమ్ముళ్లు ఘర్షణ పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం సాయంత్రం చంద్రశ్చర్ల గ్రామానికి చేరుకున్న మంత్రి సునీతకు స్థానిక ఆ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. టీడీపీకి పట్టు ఉన్న ఈ గ్రామంలో మంత్రి ఏకపక్షంగా ఓ వర్గానికే మద్దతు తెలుపుతుండడంతో విభేదాల కుంపటి రాజుకుంది. ఇంతకాలం అవకాశం కోసం కాచుకుని ఉన్న అసమ్మతి వాదులకు మంత్రి రాక ఓ వరంలా మారింది. గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ద్వారా రూ. 5తో నీటిని అమ్ముకుంటున్నారంటూ సర్పంచ్ రామసుబ్బయ్యకు వ్యతిరేకంగా పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామ సర్పంచ్ వర్గీయులు ఫిర్యాదు చేసిన రామకృష్ణ, సాయిరాం వర్గీయులపై దాడికి దిగారు. మంత్రి వారిస్తున్న వినకుండా ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అర్ధంతరంగా కార్యక్రమాన్ని ముగించుకుని మంత్రి వెనుదిరిగిపోయారు. -
మినీ మహానాడు రసాభాస
సాక్షి, నిజామాబాద్ : అగ్రనాయకుల వలసలతో కుదేలైన తెలంగాణ టీడీపీలో వర్గపోరు తలనొప్పిగా తయారైంది. సీనియర్ నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోవడంతో సగం ఖాళీ అయిన తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా నిజామాబాద్‌లో సోమవారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు రసాభాసగా మారింది. టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలుగు తమ్ముళ్లు వీరంగమాడారు. ఆర్మూరుకు చెందిన సీనియర్ నాయకుడు యాదయ్యకు నియోజకవర్గ ఇంచార్జీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు గొడవకు దిగారు. నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అక్కడితో ఆగకుండా కుర్చీలను విరగొట్టారు. పార్టీ మారే వారికి పట్టం కట్టి సీనియర్లకు అన్యాయం చేస్తారా అని నిలదీశారు. ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ సమక్షంలోనే ఈ ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లా కొత్త అద్యక్షుని నియామకంపై కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇది పార్టీ నిర్ణయమని అన్నపూర్ణమ్మ చెప్పారు. గందరగోళం నడుమ చివరికి యాదయ్యకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి కార్యకర్తలను నాయకులు సముదాయించారు. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, కర్నూలు : తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన మినీ మహానాడు సభలో తెలుగుతమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. మహానాడు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఘర్షణ మొదలైంది. సభ జరుగుతుండగా ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వీరభద్రగౌడ్, నియోజకవర్గ టీడీపీ మాజీ ఇంచార్జ్ వైకుంఠం మల్లికార్జున చౌదరి వర్గీయుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అంతటితో ఆగకుండా ఒకరిపై మరొకవర్గం దూషణకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆవేశానికి లోనైన వైకుంఠం వర్గీయులు దాడికి దిగడంతో పోలీసులు అప్రమత్తమై వెంటనే వారిని సభా ప్రాంగణం నుంచి బయటకు పంపించడంతో, సభకు హజరైన టీడీపీ మహిళా కార్యకర్తలు, ప్రజలు ఇంటిదారి పట్టారు. సభ నుంచి ఎవరూ బయటకు వెళ్లిపోవద్దని మహిళా కార్యకర్తలు, టీడీపీ శ్రేణులను జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆలూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు జక్కిఉల్లా కోరినా ప్రయోజనం లేకపోయింది.