
తాడిపత్రి టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
అనంతపురం : తాడిపత్రి టీడీపీలో మరోసారి విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని టీడీపీ నేత జగదీశ్వర్‌రెడ్డి సోదరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు రవీంద్రారెడ్డి అవినీతిపై జగదీశ్వర్ రెడ్డి వర్గీయులు పట్టణంలో కరపత్రాలు విడుదల చేశారు.
దీంతో ఇరువర్గాలు మంగళవారం బహిరంగ చర్చకు సిద్ధంకావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాడిపత్రిలో భారీగా పోలీస్ బలగాలను మెహరించారు. ముందస్తుగా రవీంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, జయచంద్రారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని జగదీశ్వర్‌రెడ్డి వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.