MLA JC Prabhakar Reddy
-
టీడీపీ నేతల వర్గపోరు.. తాడిపత్రిలో 144 సెక్షన్
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేతల వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ నేత జగదీశ్వర్‌రెడ్డి వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావారణం నెలకొన్న నేపథ్యంలో ముందస్తుగా తాడిపత్రిలో 144 సెక్షన్ విధించినట్లు డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. జనవరి 23వ తేదీ వరకూ ఈ 144 సెక్షన్ కొనసాగుతుందని డీఎస్పీ వివరించారు. -
తాడిపత్రి టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
-
తాడిపత్రి టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
అనంతపురం : తాడిపత్రి టీడీపీలో మరోసారి విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని టీడీపీ నేత జగదీశ్వర్‌రెడ్డి సోదరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు రవీంద్రారెడ్డి అవినీతిపై జగదీశ్వర్ రెడ్డి వర్గీయులు పట్టణంలో కరపత్రాలు విడుదల చేశారు. దీంతో ఇరువర్గాలు మంగళవారం బహిరంగ చర్చకు సిద్ధంకావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాడిపత్రిలో భారీగా పోలీస్ బలగాలను మెహరించారు. ముందస్తుగా రవీంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, జయచంద్రారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని జగదీశ్వర్‌రెడ్డి వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. -
క్రీడల్లో రాణిస్తేనే గుర్తింపు
= ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి = కరణం మల్లీశ్వరీ జో¯న్–2 క్రీడా పోటీలు ప్రారంభం తాడిపత్రి : క్రీడల్లో రాణిస్తేనే విద్యార్థులకు మంచి గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం కరణం మల్లేశ్వరీ జో¯న్–2 క్రీడా పోటీలను డీఈఓ శ్యామ్యూల్‌తో కలసి లాంఛనంగా ఆయన ప్రారంభించారు. గుత్తి, పామిడి, పుట్లూరు, యల్లనూరు, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, యాడికి, తాడిపత్రి మండలాలకు చెందిన మొత్తం 90 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. గురువారం అథ్లెటిక్స్, కబడ్డి, ఖోఖో, హ్యాండ్ బాల్, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులకు దేశంలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలు పోటీలు నిర్వహించాలని, విద్యతోపాటు క్రీడలపై కూడా విద్యార్థులకు అసక్తి కనబరిచేలా చేయాలని అన్నారు. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చదివించాలని అన్నారు. క్రీడల కోసం ఎంతైనా ఖర్చుచేస్తానని, పోటీల తర్వాత కూడా తన వద్దకు వస్తే ఎలాంటి సౌకర్యాలైనా కల్పిస్తానని తెలిపారు. ఈ నెల 16వ తేదీ వరకు జరిగే జో¯న్–2 పోటీల్లో విద్యార్థులకు భోజనం, అల్పాహారం ఏర్పాటు చేస్తున్న ఎమ్మెల్సే జేసీ ప్రభాకర్‌రెడ్డిని డీఈఓ శామ్యూల్ బాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్స¯Œన్ వెంకటలక్ష్మి, జిల్లా పీఈటీ అసోసియేష¯Œన్ అధ్యక్షులు లింగమయ్య, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రఘురామిరెడ్డి, మండల విద్యాధికారి కాశెప్ప, కౌన్సిలర్లు, పీఈటీలు పాల్గొన్నారు. -
అజ్ఞాతంలో ఎమ్మెల్యే జేసీ..!
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన అనుచరులకు గన్మెన్లను కేటాయించాలని ఇటీవల ఆయన లేఖలు రాయడంతో, రాష్ట్ర ప్రభుత్వం పెయిడ్ గన్మెన్లను కేటాయించింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన తన గన్మెన్లతోపాటు అనుచరులకు కేటాయించిన గన్మెన్లను సైతం ఐదు రోజుల కిందట వెనక్కి పంపేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన చెప్పాపెట్టకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశారు. పోలీసులు తాను చెప్పినట్లు వినడం లేదని, కనీసం తాను సూచించిన వారిని కూడా ఎస్పీ నియమించడం లేదనే అక్కసుతోనే గన్మెన్ల ఉదంతాన్ని ఆయన తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అనంతపురం పాత ఊరు రోడ్డు విస్తరణ అంశం అక్కడి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మధ్య మనస్పర్ధలు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎంపీ సోదరుడు ఇలా అజ్ఞాతంలోకి వెళ్లడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు జేసీ సోదరులిద్దరూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.