క్రీడల్లో రాణిస్తేనే గుర్తింపు | karanam malliswari zone2 games start | Sakshi
Sakshi News home page

క్రీడల్లో రాణిస్తేనే గుర్తింపు

Published Fri, Nov 11 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

క్రీడల్లో రాణిస్తేనే గుర్తింపు

క్రీడల్లో రాణిస్తేనే గుర్తింపు

= ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి
= కరణం మల్లీశ్వరీ జో¯న్–2 క్రీడా పోటీలు ప్రారంభం

తాడిపత్రి : క్రీడల్లో రాణిస్తేనే విద్యార్థులకు మంచి గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తాడిపత్రి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో గురువారం కరణం మల్లేశ్వరీ జో¯న్–2 క్రీడా పోటీలను డీఈఓ శ్యామ్యూల్‌తో కలసి లాంఛనంగా ఆయన ప్రారంభించారు. గుత్తి, పామిడి, పుట్లూరు, యల్లనూరు, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, యాడికి, తాడిపత్రి మండలాలకు చెందిన మొత్తం 90 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. గురువారం అథ్లెటిక్స్, కబడ్డి, ఖోఖో, హ్యాండ్‌ బాల్, వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ  క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులకు దేశంలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలు పోటీలు నిర్వహించాలని,  విద్యతోపాటు క్రీడలపై కూడా విద్యార్థులకు అసక్తి కనబరిచేలా చేయాలని అన్నారు. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చదివించాలని అన్నారు. క్రీడల కోసం ఎంతైనా ఖర్చుచేస్తానని, పోటీల తర్వాత కూడా తన వద్దకు వస్తే ఎలాంటి సౌకర్యాలైనా  కల్పిస్తానని తెలిపారు. ఈ నెల 16వ తేదీ వరకు జరిగే జో¯న్–2 పోటీల్లో విద్యార్థులకు భోజనం, అల్పాహారం ఏర్పాటు చేస్తున్న ఎమ్మెల్సే జేసీ ప్రభాకర్‌రెడ్డిని  డీఈఓ శామ్యూల్‌ బాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్స¯Œన్ వెంకటలక్ష్మి, జిల్లా పీఈటీ  అసోసియేష¯Œన్ అధ్యక్షులు లింగమయ్య, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు రఘురామిరెడ్డి, మండల విద్యాధికారి కాశెప్ప, కౌన్సిలర్‌లు, పీఈటీలు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement