
మినీ మహానాడులో టీడీపీ కార్యకర్తల గొడవ
సాక్షి, నిజామాబాద్ : అగ్రనాయకుల వలసలతో కుదేలైన తెలంగాణ టీడీపీలో వర్గపోరు తలనొప్పిగా తయారైంది. సీనియర్ నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోవడంతో సగం ఖాళీ అయిన తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా నిజామాబాద్‌లో సోమవారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు రసాభాసగా మారింది. టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం
చేస్తూ తెలుగు తమ్ముళ్లు వీరంగమాడారు.
ఆర్మూరుకు చెందిన సీనియర్ నాయకుడు యాదయ్యకు నియోజకవర్గ ఇంచార్జీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు గొడవకు దిగారు. నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అక్కడితో ఆగకుండా కుర్చీలను విరగొట్టారు. పార్టీ మారే వారికి పట్టం కట్టి సీనియర్లకు అన్యాయం చేస్తారా అని నిలదీశారు. ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ సమక్షంలోనే ఈ ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లా కొత్త అద్యక్షుని నియామకంపై కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇది పార్టీ నిర్ణయమని అన్నపూర్ణమ్మ చెప్పారు. గందరగోళం నడుమ చివరికి యాదయ్యకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి కార్యకర్తలను నాయకులు సముదాయించారు.
Comments
Please login to add a commentAdd a comment