వినాయక్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని కార్యకర్తలు, నాయకుల సహకారంతో అధిగమిస్తామని, నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు పోల సుధాకర్, తారచంద్‌నాయక్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడా రు. అరికెల నర్సారెడ్డి పార్టీని వీడటం బాధగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డికి పార్టీ అనతికాలంలో నే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చిందని, ఇంతచేసినా రేవంత్‌రెడ్డి పార్టీని వీడడం ఆయన విజ్ఞత అన్నారు.
కాగా పార్టీ పటిష్టతకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. పార్టీని క్షేత్రస్థాయి లో బలోపేతం చేయడానికి ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. నేడు హైదరాబాద్‌లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నిర్వహించే విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటామని, చంద్రబాబునాయుడు తెలంగాణ టీడీపీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. పార్టీ నగర అధ్యక్షుడు .బాల్‌కిషన్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజమల్లు, ప్రధాన కార్యదర్శి యాదాగౌడ్, గోపాల్‌నగేష్, వినోద్‌కుమార్, రవి, కే.నర్సింలు, మన్నన్ పాల్గొన్నారు.
నేడు టీడీపీ కార్యకర్తల సమావేశం..
ఆర్మూర్: టీడీపీలోకి మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోయారని టీడీపీ రాష్ట్ర కార్యద ర్శి సుధాకర్ అన్నారు. ఆర్మూర్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ భవన్‌లో గురువారం టీడీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేగాం యాదగౌడ్, పట్టణ అధ్యక్షుడు జీవీ నర్సింహారెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు హాజరై విజయంతం చేయాలని కోరారు. లింగారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment