
తాడేపల్లి రూరల్: జనసేన పార్టీ నాయకులు అవకాశాన్ని బట్టి రంగులు మారుస్తూ పూటకో పార్టీ, రోజుకో నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నెల 8న జరుగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో రెండు ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఒక స్థానంలో జనసేన, మరో స్థానంలో టీడీపీ పోటీ చేస్తున్నాయి. ఇక్కడ టీడీపీ, జనసేన పరస్పరం ఇచ్చిపుచ్చుకునే రీతిలో మద్దతు ఇచ్చుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జతకడితే, రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగాటీడీపీతో జత కట్టి ప్రచారం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment