
సాక్షి, నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం పడిపోవడానికి టీడీపీ నేతలే కారణమని వైఎస్సార్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. క్యూలో ఓటర్లను కూడా టీడీపీ నేతలు భయబ్రాంతులకు గురిచేశారని అన్నారు. దొంగ ఓట్లంటూ టీడీపీ, బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ వద్ద ఎప్పుడూ మూడు స్క్రిప్ట్‌లు రెడీగా ఉంటాయన్నారు. పరిస్థితిని బట్టి వాటిని ప్రజలపై రుద్దడం వాళ్లకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో మత్స్యకారులకు రూ.43 కోట్ల ప్యాకేజీ ఇచ్చామని లోకేష్ చెప్పారు. అదంతా నిజం కాదు.. ఒక వేళ ఈ విషయాన్ని నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తానని కాకాణి.. లోకేష్‌కు సవాల్ విసిరారు.
( చదవండి: రాళ్లదాడి పేరుతో చంద్రబాబు సానుభూతి డ్రామా )
Comments
Please login to add a commentAdd a comment