సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు ధనికుల పక్షపాతి అని సీరియస్ కామెంట్స్ చేశారు కేశినేని నాని. నారా లోకేష్ పనికిమాలిన వ్యక్తి.. అలాంటి వ్యక్తిని మంత్రిని చేశారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకోవటమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నాడని వ్యాఖ్యలు చేశారు.
కాగా, కేశినేని నాని గురువారం నాలుగో విడత వైఎస్సార్ ఆసరా సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షపాతి. సీఎం జగన్ విజయవాడ నగరంలోనే రూ.325కోట్లు రుణమాఫీ చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తి చేసిన చూపించిన నాయకుడు సీఎం జగన్.
అదే చంద్రబాబు.. అంబేద్కర్ విగ్రహం నిర్మాణం అని చెప్పి శంకుస్థాపన కూడా చేయలేదు. రాష్ట్రంలోని పిల్లలందరూ అంబేద్కర్‌లా చదువుకోవాలని కాంక్షించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. కానీ, చంద్రబాబు మాత్రం ధనికుల పక్షపాతి. పనికిమాలిన వ్యక్తిని, తన కొడుకు నారా లోకేష్‌ను మంత్రిని చేశాడు. మీడియా మేనేజ్మెంట్ చేసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నెగిటివ్ ప్రచారం చేశాడు
చంద్రబాబుకు ఇప్పటికీ ఆంధ్రాలో సొంత ఇల్లు లేదు. రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకోవటమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నాడు. 2014, 2019 ఎన్నికల్లో నేను ఉంటేనే తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గెలిచాడు. నేను లేకపోతే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జీరో. 25వేల మెజారిటీతో అవినాష్ గెలవబోతున్నాడు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment