
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో మాట్లాడుతూ, హుజూరాబాద్ ఉప ఎన్నిక నీతికి, అవినీతికి.. ధర్మానికి, అధర్మానికి జరగుతున్న ఎన్నికలుగా బీజేపీ చూస్తోందన్నారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో మాట్లాడుతూ, హుజూరాబాద్ ఉప ఎన్నిక నీతికి, అవినీతికి.. ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఎన్నికలుగా బీజేపీ చూస్తోందన్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ మాదిరిగా హుజూరాబాద్‌లో బీజేపీని గెలిపించాలన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యనికి, నియంతృత్వానికి జరుగుతున్న పోరాటంలో బీజేపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నిన్నటి పార్టీ.. ఆ పార్టీకి రేపనేది లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.