ఏపీలో అమలు అవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం గురించి వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా గట్టిగానే ప్రశ్నించారు. ఆయన వేసిన పలు ప్రశ్నలలో ఒక్కదానికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లేదా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లు సమాధానం ఇవ్వలేకపోయారు. పైగా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మహిళలపైన, టీడీపీ, జనసేన ముఖ్యనేతల కుటుంబ సభ్యులపైన అసభ్య పోస్టింగ్ లు పెడుతున్నారని డబాయించే పని చేశారు. ఇది కూడా డైవర్షన్ రాజకీయమే. సూపర్ సిక్స్ హామీలు, ఏపీలో సాగుతున్న అరాచకాన్ని, విధ్వంసకాండనుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి తమకుఉన్న మీడియా మాఫియా బలంతో వికృత ప్రచారం చేస్తున్నారని చెప్పాలి.
నాయకుల కుటుంబాల గురించికాని, సామాన్యుల కుటుంబాల గురించి కాని, ముఖ్యంగా మహిళలకు ప్రతిష్టకు భంగం కలిగేలా ఎవరు ఎలాంటి పోస్ట్ పెట్టినా చర్య తీసుకోవల్సిందే. అందులో సందేహం లేదు. ఇది పార్టీలకు అతీతంగా జరగాలి. కాని దురదృష్టవశాత్తు టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు నీచమైన పోస్టింగ్ లు పెడితే వారిది వీరపోరాటమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ప్రచారం చేశారు. అభ్యంతరకరమైన రీతిలో పోస్ట్ లు పెట్టినవారిపై చర్య తీసుకుంటే ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వాటిని అక్రమ కేసులుగా పోలీసులపై ఆరోపించేవారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మాట్లాడుతున్న తీరు ఆశ్యర్యం కలిగిస్తుంది. మదమెక్కి మాట్లాడేవారిని వదలి పెట్టాలా అని ఆయన అన్నారని ఈనాడు పెద్ద హెడింగ్ తో వార్త ఇచ్చింది. తప్పు లేదు. నిజంగానే మదమెక్కి మాట్లాడేవారిపై చర్య తీసుకోవలసిందే.
కాని అలా మదమెక్కినవారు టీడీపీ, జనసేనలో ఉంటేమాత్రం ఫర్వాలేదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలోనే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కాని, పార్టీ నేఏపీలో అమలు అవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం గురించి వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా గట్టిగానే ప్రశ్నించారు. ఆయన వేసిన పలు ప్రశ్నలలో ఒక్కదానికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లేదా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లు సమాధానం ఇవ్వలేకపోయారు. పైగా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మహిళలపైన, టీడీపీ, జనసేన ముఖ్యనేతల కుటుంబ సభ్యులపైన అసభ్య పోస్టింగ్ లు పెడుతున్నారని డబాయించే పని చేశారు.
ఇది కూడా డైవర్షన్ రాజకీయమే.సూపర్ సిక్స్ హామీలు, ఏపీలో సాగుతున్న అరాచకాన్ని, విధ్వంసకాండనుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి తమకుఉన్న మీడియా మాఫియా బలంతో వికృత ప్రచారం చేస్తున్నారని చెప్పాలి. నాయకుల కుటుంబాల గురించికాని, సామాన్యుల కుటుంబాల గురించి కాని, ముఖ్యంగా మహిళలకు ప్రతిష్టకు భంగం కలిగేలా ఎవరు ఎలాంటి పోస్ట్ పెట్టినా చర్య తీసుకోవల్సిందే. అందులో సందేహం లేదు. ఇది పార్టీలకు అతీతంగా జరగాలి. కాని దురదృష్టవశాత్తు టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు నీచమైన పోస్టింగ్ లు పెడితే వారిది వీరపోరాటమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ప్రచారం చేశారు. అభ్యంతరకరమైన రీతిలో పోస్ట్ లు పెట్టినవారిపై చర్య తీసుకుంటే ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వాటిని అక్రమ కేసులుగా పోలీసులపై ఆరోపించేవారు.
అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మాట్లాడుతున్న తీరు ఆశ్యర్యం కలిగిస్తుంది. మదమెక్కి మాట్లాడేవారిని వదలి పెట్టాలా అని ఆయన అన్నారని ఈనాడు పెద్ద హెడింగ్ తో వార్త ఇచ్చింది. తప్పు లేదు. నిజంగానే మదమెక్కి మాట్లాడేవారిపై చర్య తీసుకోవలసిందే.కాని అలా మదమెక్కినవారు టీడీపీ, జనసేనలో ఉంటేమాత్రం ఫర్వాలేదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలోనే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కాని, పార్టీ నేతలు కాని కొందరు ఇష్టారీతిన మహిళలను కించపరుస్తూ మాట్లాడారే, పోస్టులు పెట్టారే. వారికి మదం ఎక్కి నట్లా?కాదా? అప్పుడు ఇదే చంద్రబాబు వారికి మద్దతుగా ఎందుకు ఉన్నారు? ఉదాహరణకు అందరికి తెలిసిన ప్రముఖ మహిళా నేత రోజా ను ఉద్దేశించి టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఎంత అసభ్యకరంగా మాట్లాడారు.
దానికి ఆమె ఎంతగానో రోదించారే. అప్పుడు బండారును పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేస్తే టీడీపీ యంత్రాంగం అంతా ఆయనకు అండగా ఉందే తప్ప రోజాపై ఎందుకు సానుభూతి చూపలేదు? చంద్రబాబు ఆయనకు ఏకంగా మళ్లీ టీడీపీ టిక్కెట్ ఇస్తే ఎమ్మెల్యే కూడా అయ్యారు కదా! దానిని ఏ రకంగా చంద్రబాబు చూస్తారు? నర్సీపట్నంలో మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఎన్నిసార్లు మహిళా అధికారుల పట్ల దారుణంగా మాట్లాడారన్న అభియోగాలు వచ్చాయి కదా!ఆయనను ఎప్పుడైనా మందలించారా? అలా చేయకపోగా ఆయనను స్పీకర్ సీటులో కూర్చో పెట్టారు కదా! అప్పటి ముఖ్యమంత్రి జగన్ పైన, ఆయన సతీమణి భారతిపైన, అలాగే ఇతర కుటుంబ సభ్యులపైన టీడీపీవారు ఎంత ఘోరంగా పోస్టులు పెట్టారో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లకు తెలియదా? అలాంటి వారిపై కేసులు వస్తే అప్పుడు వారికి మద్దతు ఇచ్చింది ఇదే టీడీపీ, జనసేనలు కాదా? ఆ మాటకు వస్తే అప్పటి ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు పదే,పదే సైకో అని దుర్మార్గంగా విమర్శలు చేశారే. అది అభ్యంతరకర భాష కాదా? ఇప్పుడు అదే తరహా వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే చంద్రబాబు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కేసులు పెడుతున్నారెందుకు?
అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయవచ్చన్న ధీమాతోనా? మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ సోషల్ మీడియా వారు కొంతమంది పెట్టిన దారుణమైన వికృత పోస్టింగుల గురించి సోదాహరణంగా వివరించారు.వాటిని డిజిపి పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మరెవరి కుటుంబ సభ్యులపైన ఎవరైనా అభ్యంతర పోస్టింగ్ లు పెడితే ఎవరూ ఒప్పుకోరు. అదే రూల్ జగన్ కుటుంబానికికాని,వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లలోని మహిళలకు వర్తించదని వీరు చెప్పదలిచారా? అసలు ఇప్పుడు సమస్య ఏమిటి? చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలు లో వైఫల్యం చెందుతోంది.వాటి గురించి సోషల్ మీడియాలో పలువురు నిలదీస్తున్నారు.ఆ విషయం చెప్పకుండా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
వాటిపై జగన్ అనేక ప్రశ్నలు సంధించారు.తన అమ్మ విజయమ్మ ను చంపడానికి ప్రయత్నించానంటూ టీడీపీ అధికార వెబ్ సైట్ లో తప్పుడు పోస్టు పెట్టారని, దీనికి గాను చంద్రబాబును, లోకేష్ ను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తన భార్య కడప ఎస్పికి ఫోన్ చేశారంటూ ఆంధ్రజ్యోతి తప్పుడు వార్త రాసిందని, దానిపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను ఎందుకు లోపల వేయలేదు? విజయవాడ వరద బాధితులకు సహాయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, కేవలం అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు కొనుగోలుకే 23 కోట్లు ఖర్చు చేసినట్లు చూపారని, దీనిపై ప్రశ్నిస్తే సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు ఎలా పెడతారని ఆయన అడిగారు.
మహిళలు, చిన్నారులులపై లైంగిక వేధింపులు, దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు రౌడియిజం చేస్తుండడంపై ప్రశ్నిస్తే అక్రమంగా నిర్భంధం చేస్తున్నారని ఆయన అన్నారు. వందకు పైగా ఎఫ్ ఐ ఆర్ లు పోలీసులు నమోదు చేశారు. వాటిలో ఒకటి, రెండు తప్ప మిగిలినవన్ని ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించినవారిపై పెట్టిన కేసులే కావడం గమనార్హం. ఈ పరిస్థితి కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుండడంతో ,దానిని డైవర్ట్ చేయడానికి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కూటమి పెద్దలు ప్రచారం చేస్తున్నారు. అందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి బాకా ఊదుతున్నాయి.విద్య వద్దు - మద్యం ముద్దు అన్నట్లుగా ఏపీలో పరిస్థితి ఉందని, ఒక కార్యకర్త పోస్టింగ్ పెడితే కేసు పెట్టారట.అమ్మ ఒడి ఇవ్వడం లేదు.
విద్యాదీవెన ఇవ్వడం లేదని.. నాన్నకు ఫుల్-అమ్మకు నిల్ అని మరో కార్యకర్త పోస్ట్ పెడితే కేసు నమోదు చేశారు.ఇందులో చంద్రబాబు మనోభావాలు దెబ్బతిన్నదేమిటి? అని జగన్ ప్రశ్నించారు. విశేషం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడే అమ్మ ఒడి.. నాన్న బుడ్డి అంటూ విమర్శలు చేసేవారు. అవి తప్పు కానప్పుడు ఇప్పుడు అదే మాట ఎవరైనా అంటే నేరం ఎలా అవుతుందన్నది చర్చ అవుతోంది.జనసేన నేతలతో టీడీపీ నేతలు కాళ్లు పట్టించుకుంటున్నారని ఒక వార్త అన్ని టీవీలలో వచ్చింది. దానికి సంబంధించిన పోస్టును ఫార్వర్డ్ చేస్తే కేసు పెట్టారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలు దేవుడికి నచ్చడం లేదని మరో కార్యకర్త పోస్టు పెడితే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.నందిగామ నియోజకవర్గంలో ఒక గ్రామంలో వాట్సప్ లో ఒక గ్రూపు ఉన్నవాందరికి నోటీసులు ఇచ్చారు. ఇలా అనేక అంశాలను జగన్ ప్రస్తావించి ప్రశ్నిస్తే వాటికి మాత్రం సమాధానం ఇవ్వకుండా ఏవేవో ఆరోపణలు చేసే పనిలో ప్రభుత్వ నేతలు ఉండడం శోచనీయమని చెప్పాలి.
ఈ సందర్భంలోనే డిజిపి ద్వారకా తిరుమలరావును, ఇతర పోలీసు అధికారులపై జగన్ విమర్శలు చేశారు. టీడీపీ కార్యకర్తల్లా మారవద్దని, ధర్మంగా ,న్యాయంగా ఉండాలని ఆయన కోరారు. అలాకాని పక్షంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, అప్పుడు అలాంటివారిపై చర్య తీసుకుంటామని జగన్ హెచ్చరించారు. జగన్ ఇలా సోదాహరణంగా ఆయా ఘటనలను ప్రస్తావిస్తే, వాటిపై చంద్రబాబు సమాధానం చెప్పలేకపోయారు. అందుకే డబాయింపు అలవాటుతో ఉండే చంద్రబాబు దీనికి అసభ్యకర పోస్టులు అంటూ డైవర్షన్ రాజకీయం చేశారు. దీని అంతటికి ఒకటే కారణం కనిపిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకుండా ఉండాలన్నదే వారి ఉద్దేశం. ఇందుకోసం పోలీసుల ద్వారా వైఎస్సార్‌సీపీ వారిని, ప్రభుత్వ వ్యతిరేక స్వరాన్ని అణచివేస్తూ, భయభ్రాంతులను చేస్తూ, అరాచకం సృష్టించాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ ఘాతుకాలకు ఎల్లో మీడియా మద్దతు ఇవ్వడం మరీ నీచంగా ఉంది. జర్నలిజం ప్రాధమిక సూత్రాలకు తిలోదకాలు ఇచ్చి ఒక మాఫియాగా మారడం దురదృష్టకరం. ఏది ఏమైనా చంద్రబాబు ప్రభుత్వం అరాచకానికి ఎప్పటికి ముగింపు వస్తుందో!
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment