
రూ.17,900 కోట్లతోనే
రూ.2 లక్షల రుణమాఫీ ఎలా సాధ్యం?
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వివరించాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పాలనలో రూ.లక్ష రుణమాఫీకే రూ.17 వేల కోట్లు ఖర్చు అయితే, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రూ.17,900 కోట్లతోనే రూ.2 లక్షల రుణమాఫీ ఎలా సాధ్యం అయ్యిందో ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి వివరించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీ మొత్తం రెట్టింపు అయినప్పుడు లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సిందిపోయి తగ్గడం కాంగ్రెస్ మోసపూరిత విధానానికి నిలువెత్తు నిదర్శనమని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది ముమ్మాటికీ రైతులకు ద్రోహం చేయడమేనన్నారు. వరికి బోనస్ పథకంలా.. రుణమాఫీ కూడా బోగస్ అని విమర్శించారు. చారాణా రుణమాఫీకి బారాణా ప్రచారం అని ఎద్దేవా చేశారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారును రైతన్నలతో కలిసి ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment