సీఎం రేవంత్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు
తెలంగాణలో ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు
అమృత్ టెండర్ల అవినీతిపై ఆధారాలున్నాయి
అర్హత లేకున్నా శోధా కంపెనీకి టెండర్లు
సుజన్‌రెడ్డికి ఉన్న అర్హత కేవలం సీఎం బావమర్దిగానే!
కేంద్రం స్కీంలో అవినీతి జరుగుతుంటే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారు?
సాక్షి, ఢిల్లీ: అమృత్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని.. అర్హత లేకపోయిన సీఎం బావమరిది సృజన్‌రెడ్డి కంపెనీకి రూ.1,137 కోట్ల పనులు కేటాయించారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
అమృత్ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. నేను ఢిల్లీలో ఏ బాంబులు పేల్చడం లేదు. దీపావళి ఎప్పుడో అయిపోయింది. తెలంగాణలో బాంబు అన్నారు. ఏం జరగలేదు. తెలంగాణ కేటాయించిన రూ. 8,888 కోట్ల పనులపై విచారణ జరిపించాలి. అమృత్ టెండర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అవినీతికి పాల్పడ్డారని కేంద్రానికి ఫిర్యాదు చేశాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘‘ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని స్వయంగా ఆరోపించారు. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రేవంత్‌రెడ్డి తన బావమరిదికి అమృతం పంచి.. కొండగల్ ఫార్మాతో ప్రజలకు విషం ఇస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మేం ఢిల్లీకి వస్తాం.. దేశ ప్రజల దృష్టికి మీ మోసాలను తీసుకొస్తాం. మీ ఆరోపణల మీద మీకు నమ్మకం ఉంటే విచారణ జరిపించండి. తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై ఎప్పటికప్పుడు ఢిల్లీకి వచ్చి ఎండగతా. తెలంగాణలో ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఆర్‌ఆర్ అంటే రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్’’ అంటే కేటీఆర్ చురకలు అంటించారు.
Comments
Please login to add a commentAdd a comment