సాక్షి, హైదరాబాద్: ‘గుజరాత్ చేత.. గుజరాత్ కోసం.. గుజరాత్‌కు’ ఇది ‘మోడెమొక్రసీ (మోదీ ప్రజాస్వామ్యానికి) కొత్త నిర్వచనం అని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధ్యం కాదని చెప్పిన ప్రధాని మోదీ.. గుజరాత్‌కు రూ.21,969 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్ ప్రాజెక్టును ప్రకటించారు.
ఇది గుజరాత్ నమూనా రాజకీయాలు, పరిపాలన’ అంటూ మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ చేసిన ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. వరంగల్‌లో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను పక్కన పెట్టారని కేటీఆర్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment