కాంగ్రెస్ సర్కార్‌కు కౌంట్ డౌన్ షురూ.. కేటీఆర్‌ ట్వీట్‌ | Ktr Tweet On Congress Government | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ సర్కార్‌కు కౌంట్ డౌన్ షురూ.. కేటీఆర్‌ ట్వీట్‌

May 21 2024 7:39 AM | Updated on May 21 2024 11:28 AM

Ktr Tweet On Congress Government

ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం.. దగా.. నయవంచన..’’ అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ట్విట్టర్‌ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ విరుచుకుపడ్డారు.

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం.. దగా.. నయవంచన..’’ అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ట్విట్టర్‌ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. గ్యారెంటీ కార్డులో.. “వరిపంటకు” రూ.500 బోనస్ అని ప్రకటించి..  ఇప్పుడు “సన్న వడ్లకు మాత్రమే” అని సన్నాయి నొక్కులు నొక్కుతారా ?? అంటూ మండిపడ్డారు.

‘‘ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి.. ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా??. ఇది ప్రజా పాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు.. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారు’’ అని నిప్పులు చెరిగారు. 

ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు  రూ.15 వేలు రైతుభరోసా అన్నారు .. ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు రూ.12000 వేలు అన్నారు.. వేయలేదు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే.. రెండు లక్షల రుణమాఫీ అన్నారు.. చేయలేదు. నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారు. ఓట్ల నాడు ఒకమాట.. నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం’’ అంటూ దుయ్యబట్టారు.

‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో గారడీ చేసింది.. కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే.. నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.. కాంగ్రెస్ సర్కారు. ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదు.. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన 
కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరు..  పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు..  తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు.. కపట కాంగ్రెస్‌పై సమరశంఖం పూరిస్తారు.. నేటి నుంచి రైతన్నల చేతిలోనే.. కాంగ్రెస్ సర్కార్‌కు కౌంట్ డౌన్ షురూ’’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement