సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. హస్తం పార్టీ పాలనతో మహా నగరమైన హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పలికే ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కూడా “ఈ నగరానికి ఏమైంది?" అని ఫ్రంట్ పేజిలో వార్తలు రాస్తోంది అంటే హైదరాబాద్ పరిస్ధితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంటే.. కేవలం రాజధాని కాదని.. తెలంగాణ ఎకనమిక్ ఇంజన్ అని తెలిపారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే.. మన హైదరాబాద్ దెబ్బతినే పరిస్థితి ఉందన్నారు. దీని వల్ల రాష్ట్రానికి కష్టమే కాదు.. యావత్ దేశానికి కూడా నష్టం.. అంటూ కేటీఆర్ ట్విట్ చేశారు.
"ఈ మహా నగరానికి ఏమైంది..?"
ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ పత్రికలు కూడా “ఈ నగరానికి ఏమైంది?" అని ఫ్రంట్ పేజిలో వార్తలు రాస్తోంది అంటే నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అర్థం!
పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాదు నుండి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా… pic.twitter.com/RF7aVlR7x6— KTR (@KTRBRS) July 11, 2024
Comments
Please login to add a commentAdd a comment