జగన్‌ పిలుపు.. మార్మోగుతున్న సోషల్‌ మీడియా | YSRCP Fighting Over CBN Govt For Social Media Purpose Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

జగన్‌ పిలుపు.. మార్మోగుతున్న సోషల్‌ మీడియా

సోషల్ మీడియా యాక్టివిస్టులకి అండగా వైఎస్సార్‌సీపీ

  • సోషల్ మీడియా యాక్టివిస్టులకి మరింత అండగా వైఎస్సార్‌సీపీ.
  • జిల్లాల వారీగా నేతలతో బృందాలను ఏర్పాటు చేసిన వైఎస్‌ జగన్‌ 
     

 

2024-11-15 13:52:21

మాయని మచ్చ-చరిత్ర క్షమించదు: విజయసాయిరెడ్డి

  • నేటి సీఎం చంద్రబాబు ‘వీర విధేయుల్లో’ కొందరు 30 ఏళ్ల నాటి ఎన్టీఆర్‌–లక్ష్మీ పార్వతికి అత్యంత సన్నిహితులనేది వాస్తవం, చారిత్రక పరిణామం.
  • దాచేస్తే దాగని, మార్చలేని సత్యం! వీరు 1994-96 కాలంలో ఫిరాయింపుదారులు.
  • ప్రజలకు మీడియాకు గుర్తుండదనుకోవడం వారి అజ్ఞానం.
  • తాము పుట్టుకతోనే చంద్రబాబుకు విధేయులమని చెప్పుకోవడం సిగ్గుచేటు మరి ప్రజలని వంచించడమే.
  • వీళ్ళలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దాడి వీరభద్రరావు, మాకినేని పెదరత్తయ్య,
  • కె.ప్రతిభా భారతి, కిమిడి కళావెంకటరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు,
  • గాలి ముద్దుకృష్ణమ నాయుడు, చిక్కాల రామచంద్రరావు, పరిటాల రవి,
  • గాదె లింగప్ప, ముక్కు కాశి రెడ్డి, గౌతు శివాజీ, గద్దె బాబు రావు.
  • ఎన్టీఆర్ గారికి వెన్నుపోటుపొడిచి బహిష్కరణకు గురియైన వాళ్లలో చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, అశోకగజపతి రాజు ఉన్నారు.
  • ఈ నేతల్లో 90 శాతానికి పైగా ఎన్టీఆర్‌ మరణించాక 
    1996 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ టీడీపీ (ఎల్‌పీ) ఒక్క సీటూ దక్కించుకోలేదు.
  • వీరంతా గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు పార్టీలో చేరి 1997–2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ మంత్రివర్గం సభ్యులుగా, కొందరు ఎంపీలుగా, మరి కొందరు పార్టీ పదవులు పొందారు. మాయని మచ్చ-చరిత్ర క్షమించదు.
     
2024-11-15 13:05:41

ఏపీలో దోపిడీ రాజ్యం..

  • రాష్ట్రంలో దోపిడీ రాజ్యం నడుస్తోంది.
  • ఇసుక.. పరిశ్రమలు, వ్యాపారాలు అన్నీ టీడీపీ నేతలే కబ్జా చేస్తున్నారు.
  • అంతా రాక్షస నీతి అమలవుతోంది.

 

2024-11-15 12:04:21

పులివెందులలో అనకాపల్లి పోలీసులు

ఏపీలో కొనసాగుతున్న తప్పుడు కేసుల పర్వం 

పులివెందుల పీఎస్‌కు చేరుకున్న అనకాపల్లి పోలీసులు 

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్‌ 

వర్రాని అనకాపల్లి పోలీసులు కస్టడీకి కోరే అవకాశం 

తనను ఎక్కడెక్కడో తిప్పి.. హింసించారని జడ్జి ముందు వాపోయిన రవీంద్రారెడ్డి 

వైద్యపరీక్షల నివేదిక కోరిన జడ్జి

2024-11-15 10:20:30

లోకేష్‌కు అంబటి సవాల్‌..

  • శాసనసభలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే !
  • బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తాను !
  •  
     

2024-11-15 10:17:46

స్పీకర్‌పై కేసులు పెట్టాలి..

అనుచిత వ్యాఖ్యలు చేశారని 
కేసులు పెడితే ముందుగా 
ప్రస్తుత స్పీకర్ పైనా డిప్యూటీ స్పీకర్ పైన 
పెట్టాలి అరెస్టు చేయాలి! 

 

2024-11-15 09:22:24

కార్యకర్తలకు అండగా వైఎస్సార్‌సీపీ

  • సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా వైఎస్సార్‌సీపీ
  • పార్టీలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు
  • జిల్లాకు ఇద్దరు నేతలతో ప్రత్యేక టీమ్‌లు
  • వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీ బృందాల  ఏర్పాటు
  • పార్టీ నేతలు, లీగల్ సెల్‌తో సమన్వయం చేయనున్న టీమ్‌లు
  • బాధితులకు న్యాయ సహాయం కల్పించడం, భరోసా ఇవ్వడం, ఆత్మస్థైర్యాన్ని పెంచేలా పనిచేయనున్న బృందాలు
2024-11-15 09:13:40

వైఎస్‌ జగన్‌ పిలుపుతో ఎక్స్‌లో వైఎస్సార్‌సీపీ నేతల పోస్టుల వెల్లువ..

  • హామీలు ఎగవేసి ప్రశ్నిస్తున్న వారిని వేధిస్తున్న కూటమి ప్రభుత్వం 
  • ఈ ప్రభుత్వం నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేసిన జగన్‌ 
  • ట్విట్టర్‌లో పోస్టులు పెట్టినందుకు ప్రభుత్వం అరెస్ట్‌ చేయదలచుకుంటే ముందు తనతోనే ఆరంభించాలని వైఎస్‌ జగన్‌ సవాల్‌ 
  • జగన్‌ పిలుపుతో హామీలు అమలుచేయని చంద్రబాబును ప్రశ్నిస్తూ పోస్టులు.

 

 

2024-11-15 09:07:18

మహాసేన రాజేష్‌పై కేసు నమోదు

  • మహాసేన రాజేష్‌పై పోలీసు కేసు నమోదు. 
  • సోషల్‌ మీడియాలో మహాసేన రాజేష్‌, ఆయన అనుచరులు వేధిస్తున్నారని మహిళ ఆరోపణలు. 
  • శంకరగుప్తం గ్రామానికి చెందిన శాంతి ఫిర్యాదుతో కేసు నమోదు. 
  • తన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారని బాధితురాలు ఆవేదన 
  • రాజేష్‌తో పాటు నలుగురు అనుచరులపై కేసు నమోదు. 
2024-11-15 09:04:29
Advertisement
 
Advertisement
 
Advertisement