ముగిసిన లోక్‌సభ ఎ‍న్నికల తొలి విడత పోలింగ్‌.. ఓటింగ్‌ శాతం ఎంతంటే! | Lok Elections 2024 First Phase Polling Live Updates And Top News Headlines In Telugu - Sakshi
Sakshi News home page

Lok Sabha Election Phase 1 Polling Updates: ముగిసిన లోక్‌సభ ఎ‍న్నికల తొలి విడత పోలింగ్‌

Published Fri, Apr 19 2024 6:49 AM | Last Updated on Fri, Apr 19 2024 7:02 PM

Lok Election 2024 First Phase Polling Updates In Telugu - Sakshi

Lok Election 2024 First Phase Polling Updates

  • లోక్‌సభ ఎన్నికల తొలి  విడత  పోలింగ్‌ ముగిసింది
  • లోక్‌సభతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది
  • సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ కేంద్రాల వద్ద లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే చాన్స్‌
  • తొలి విడతలో భాగంగా దేశ వ్యాప్తంగా 102 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది
  • 5 గంటల వరకు అందిన వివరాల ప్రకారం సగటున 60 శాతం పోలింగ్‌ నమోదైంది

సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ శాతాలు

  • అండమాన్ -నికోబార్ -56.87 శాతం
  • అరుణాచల్ ప్రదేశ్ -63.27 శాతం
  • అస్సాం -70.77 శాతం
  • చత్తీస్ ఘడ్ -63.41శాతం
  • జమ్మూ- కాశ్మీర్ -65.08 శాతం
  • లక్షద్వీప్ -59.02 శాతం
  • మధ్యప్రదేశ్ -63.25 శాతం
  • మహారాష్ట్ర -54.85శాతం
  • మణిపూర్ -67.66 శాతం
  • మేఘాలయ -69.91 శాతం
  • మిజోరాం -52.73 శాతం
  • నాగాలాండ్ -55.79 శాతం
  • పుదుచ్ఛేరి -72.84 శాతం
  • రాజస్థాన్ -50.27 శాతం
  • సిక్కిం -68.06శాతం
  • తమిళనాడు -62.02 శాతం
  • త్రిపుర -76.10శాతం
  • ఉత్తరప్రదేశ్ -53.56 శాతం
  • ఉత్తరాఖండ్ - 57.54 శాతం
  • పశ్చిమబెంగాల్ -77.57 శాతం
  • బిహార్ -46.32 శాతం

మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ శాతాలు

  • అండమాన్ -నికోబార్ -45.48శాతం
  • అరుణాచల్ ప్రదేశ్ -55.05 శాతం
  • అస్సాం -60.70 శాతం
  • చత్తీస్ ఘడ్ -58.14శాతం
  • జమ్మూ- కాశ్మీర్ -57.07 శాతం
  • లక్షద్వీప్ -43.98 శాతం
  • మధ్యప్రదేశ్ -53.40 శాతం
  • మహారాష్ట్ర -44.12శాతం
  • మణిపూర్ -63.03 శాతం
  • మేఘాలయ -61.95 శాతం
  • మిజోరాం -49.77 శాతం
  • నాగాలాండ్ -51.73 శాతం
  • పుదుచ్ఛేరి -58.86 శాతం
  • రాజస్థాన్ -41.51 శాతం
  • సిక్కిం -52.72శాతం
  • తమిళనాడు -51.10 శాతం
  • త్రిపుర -68.35శాతం
  • ఉత్తరప్రదేశ్ -47.44 శాతం
  • ఉత్తరాఖండ్ -45.62 శాతం
  • పశ్చిమబెంగాల్ -66.34 శాతం
  • బిహార్ -39.73 శాతం

మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్‌ శాతాలు

  • అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులు- 35. 70 శాతం
  • అరుణాచల్‌ ప్రదేశ్‌- 35.75 శాతం
  • అస్సాం- 45.12 శాతం
  • బిహార్‌- 32.41శాతం
  • చత్తీస్‌ఘడ్‌- 42.41శాతం
  • జమ్ము అండ్‌ కశ్మీర్‌- 43.11 శాతం 
  • లక్ష్యదీప్‌- 29.91 శాతం
  • మధ్యప్రదేశ్‌- 44.43 శాతం
  • మహారాష్ట్ర - 32.36 శాతం 
  • మణిపూర్‌- 46.92శాతం
  • మేఘాలయ-  48.91 శాతం
  • మిజోరం- 37.43 శాతం
  • నాగాలాండ్‌- 39.66 శాతం 
  • పుదుచ్చేరి-  44.95 శాతం
  • రాజస్థాన్‌- 33. 73శాతం 
  • సిక్కిం- 36.82 శాతం
  • తమిళానాడు- 39. 51శాతం
  • త్రిపుర- 53.04 శాతం
  • ఉత్తరప్రదేశ్‌ 36. 96శాతం
  • ఉత్తరఖండ్‌- 37. 33 శాతం 

తమిళనాడు
ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు విజయ్‌

  • తమిళనాడులో లోక్‌సభ తొలి విడత పోలింగ్‌  కొనసాగుతోంది
  • నటుడు, తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ చెన్నైలోని నీలంకరైలోని పోలింగ్ కేం‍ద్రంలో ఓటు వేశారు

మణిపూర్‌లో పోలింగ్‌ కేంద్రం వద్ద కాల్పులు

  • మణిపూర్‌లో లోక్‌సభ ఎన్నికల తొలి విడతలో భాగంగా ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది
  • మణిపూర్‌లోని మొయిరాంగ్ సెగ్మెంట్‌లోని థమన్‌పోక్పిలోని పోలింగ్ స్టేషన్ సమీపంలో పోలింగ్ కేంద్ర వద్ద  గుర్తు తెలియని దుండగులు  కాల్పులు జరిపారు
  • ఎవరికీ ఎటువంటి  ప్రమాదం జరగలేదు
  • ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లలో ఈ కాల్పులు భయాందోళనకు గురి చేశాయి
  •  కాల్పుల శబ్దం మధ్య పోలింగ్ బూత్ నుంచి ప్రజలు బయటకు పరుగులు తీసిన వీడియో వైరల్‌గా మారింది

ఉదయం 11 గంటల వరకు 24 శాతం పోలింగ్‌ 

  • ఉదయం11 గంటల వరకు 102 సీట్లలో 24 శాతం పోలింగ్ నమోదైనట్లు పోలింగ్‌ అధికారులు పేర్కొన్నారు.
  • లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది
  • లోక్‌సభతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది

ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ శాతాలు

  • అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులు- 21.82 శాతం
  • అరుణాచల్‌ ప్రదేశ్‌- 18.26 శాతం
  • అస్సాం- 27. 22 శాతం
  • బిహార్‌- 20. 42 శాతం
  • చత్తీస్‌ఘడ్‌- 28. 12 శాతం
  • జమ్ము అండ్‌ కశ్మీర్‌- 22.60 శాతం 
  • లక్ష్యదీప్‌- 16.33 శాతం
  • మధ్యప్రదేశ్‌ 30.46 శాతం
  • మహారాష్ట్ర 19. 17 శాతం 
  • మణిపూర్‌- 27. 64 శాతం
  • మేఘాలయ- 31.65 శాతం
  • మిజోరం- 26. 23 శాతం
  • నాగాలాండ్‌- 22. 50 శాతం 
  • పుదుచ్చేరి-  27. 63 శాతం
  • రాజస్థాన్‌- 22. 51 శాతం 
  • సిక్కిం- 21.20 శాతం
  • తమిళానాడు- 23. 72 శాతం
  • త్రిపుర- 33.28 శాతం
  • ఉత్తరప్రదేశ్‌ 25.20 శాతం
  • ఉత్తరఖండ్‌- 24.83 శాతం 

ఓటేసిన మేఘాలయ సీఎం

  • మేఘాలయలో పోలింగ్‌ కొనసాగుతోంది
  • ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా పశ్చిమ గారో హిల్స్‌లోని తురాలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు

ఓటు హక్కు వినియోగించుకున్న జ్యోతి అమ్గే

  • ప్రపంచంలోనే  అత్యంత పొట్టి మహిళగా గుర్తింపు
  • నాగ్‌పూర్‌లో ఓటు వేసిన జ్యోతి అమ్గే

ఓటేసిన సిక్కిం సీఎం

  • సిక్కింలో లోక్‌సభ పోలింగ్‌ కొనసాగుతోంది 
  • గ్యాంగ్‌టక్‌ పోలింగ్‌ కేంద్రంలో సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు

తమిళనాడులో మందకోడిగా సాగుతున్న పోలింగ్‌

  • ఉదయం నుంచే ఎండ పెరగటంతో బయటకు రాని జనం
  • ఉదయం 9 గంటలకు వరకు 12. 55 శాతం పోలింగ్‌ నమోదు

ఓటు వేసిన త్రిపుర సీఎం 

  • అగర్తలా పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన సీఎం మాణిక్‌ షాహా
  • కొనసాగుతున్న పోలింగ్‌ 

తమిళనాడు
ఓటు వేసిన కమల్‌ హాసన్‌

  • నటుడు, ఎంఎన్‌ఎం చీఫ్‌ కమల్‌ హాసన్‌ ఓటు హక్కు  వినియోగించుకున్నారు
  • కోయంబేడులో పోలింగ్‌ కొనసాగుతోంది

ఓటు హక్కు వినియోగించుకున్న బాబారాందేవ్‌, బాలకృష్ణ

  • ఉత్తరఖండ్‌ హరిద్వార్‌ పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ కొనసాగుతోంది

ఉదయం 9 గంటల వరకు పోలింగ్‌ శాతాలు

  • తమిళనాడు- 8. 21 శాతం
  • త్రిపుర- 15, 21 శాతం
  • ఉత్తర ప్రదేశ్‌- 12. 66 శాతం
  • ఉత్తరఖండ్‌- 10. 54 శాతం
  • పశ్చిమబెంగాల్‌- 15. 09 శాతం
  • లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది

ఉత్తరఖండ్‌
ఓటు వేసిన ఉత్తరఖండ్‌ సీఎం

  • ఉత్తరఖండ్‌లో పోలింగ్‌ కొనసాగుతోంది
  • ఉత్తరఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి హక్కు వినియోగించుకున్నారు

మిజోరం
ఓటు వేసిన మిజోరం గవర్నర్‌

  • మిజోరం గవర్నర్‌ డా. కంభంపాటి హరిబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
  • ఐజ్వాల్‌ పోలింగ్ కేంద్రంలో పోలింగ్‌ కొనసాగుతోంది

ఓటు వేసిన అన్నామలై

  • కోయంబత్తూర్‌ బీజేపీ అభ్యర్థి అన్నామలై ఓటు హక్కు వినియోగించకున్నారు.
  • తమిళనాడులో పోలింగ్‌ కొనసాగుతోంది
  • తమిళనాడు మొత్తం 39 స్థానాలకు తొలి విడతలోనే  పోలింగ్‌ జరుగుతోంది

కొనసాగుతున్న  లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ 

  •  ఊపందుకున్న పోలింగ్ ప్రక్రియ 
  • ఎండాకాలం కావడంతో ఉదయాన్నే ఓటింగ్ వినియోగించుకునేందుకు బారులు తీరిన  ఓటర్లు 

ఓటు హక్కు వినియోగించుకున్న తమిళనాడు సీఎం

  • తమిళనాడులో పోలింగ్‌ కొనసాగుతోంది
  • చెన్నైలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో సీఎం స్టాలిన్‌ ఓటు వేశారు 

ఓటు వేసిన రాజస్తాన్‌ సీఎం 

  • రాజస్తాన్‌లో పోలింగ్‌ కొనసాగుతోంది
  • ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు క్యూ లైన్లలో నిల్చున్నారు
  • రాజస్తాన్‌ సీఎం భజనలాల్‌ శర్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు

ఓటు వేసిన తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌

  • తమిళనాడులో పోలింగ్‌ కొనసాగుతోంది
  • చెన్నైలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో రజినీకాంత్‌ ఓటు హక్కు​ వినియోగించుకున్నారు

ఓటు వేసిన మాజీ సీఎం కమల్‌ నాథ్‌
మధ్యప్రదేశ్‌:

  • మాజీ సీఎం కమల్‌నాథ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
  • కమల్‌ నాథ్‌ కుమారుడు, కాంగ్రెస్ నేత నకుల్ నాథ్ చింద్వారా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 
  • చింద్వారాలో పోలింగ్‌ కొనాసాగుతోంది

మేఘాలయ

  • వెస్ట్ గారో హిల్స్‌లోని తురాలోని పోలింగ్ స్టేషన్‌లో  ఓటు వేయడానికి  ప్రజలు క్యూలో నిల్చున్నారు
  • మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కూడా ఓటు వేయడానికి  పోలింగ్‌ కేంద్రాని వచ్చారు

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ హీరో అజిత్‌
తమిళనాడు:

  • సినీ హీరో అజిత్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు
  • తిరువాన్మియూర్ పోలింగ్‌ కొనసాగుతోంది

లోక్‌సభ ఎన్నిక  తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది

  • 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలతోపాటు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. 
  • ఓట్లుర్లు భారీగా ఓటు వేయడానికి తరలివస్తున్నారు.
  • ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు  పోలింగ్ జరగనుంది

ఓటు వేసిన తమిళిసై సౌందరరాజన్
తమిళనాడు( చెన్నై):

  • చెన్నై సౌత్‌ బీజేపీ అభ్యర్థి తమిళిసై తన ఓటు హక్కు వినియోగించుకున్నారు
  • చెన్నైలో పోలింగ్‌ కొనసాగుతోంది

ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోదీ

  • 2024 లోక్‌సభ ఎన్నికలు తొలి విడత పోలింగ్‌ ప్రారంభమైంది. 
  • 21 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి
  • ఈ స్థానాల్లో ఓటు హక్కు ఉన్న ఓటర్లు.. రికార్డు స్థాయిలో తమ వినియోగించుకోవాలని కోరుతున్నాను

ఓటు వేసిన పళనిస్వామి

  • మాజీ సీఎం ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి ఓటు వేశారు
  • సేలంలో పోలింగ్‌ కొనసాగుతోంది

ఓటు వేసిన కాంగ్రెస్‌ నేత పి. చిదంబరం
తమిళనాడు:

  • కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి చిదంబరం శివగంగ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.
  • తమిళనాడులో పోలింగ్‌ కొనసాగుతోంది

ఉత్తరఖండ్‌: 

  • ఉత్తరఖండ్‌ చీఫ్‌ ఎన్నికల అధికారి బీవీఆర్‌సీసీ పురుషోత్తం ఓటు హక్కు వినియోగించుకున్నారు 
  • ఉత్తరఖండ్‌లో లోక్‌సభ తొలి దశ పోలింగ్‌  కొనసాగుతోంది

ఓటు హక్కు వేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌
మహారాష్ట్ర( నాగ్‌పూర్‌)

  • ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌  ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు
  • తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది

లోక్‌సభ ఎ‍న్నికల తొలి విడత పోలింగ్‌ ప్రారంభమైంది

  • తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు క్యూలైన్‌లో నిల్చున్నారు
  • పోలీసులు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో భద్రత ఏర్పాటు చేశారు
  • పోలింగ్‌ సిబ్బంది ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు  చేశారు

నేడే లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్

  • పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన కేంద్ర ఎన్నికల సంఘం  
  • తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ 
  • తొలి దశలో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అస్సాం, మహారాష్ట్రల్లో 5, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3,ఉత్తరాఖండ్‌లోని 5, అరుణాచల్‌ప్రదేశ్‌లోని 2, మేఘాలయలో 2, అండమాన్ నికోబార్‌లో 1, మిజోరాంలో 1, పుదుచ్చేరిలో 1, సిక్కింలో1,   లక్షద్వీప్‌లోని 1 సీటు, మణిపూర్‌లో 3, జమ్మూ-కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, త్రిపురలో ఒక్కో సీటుకి  పోలింగ్ 
  • 2019 ఎన్నికల్లో తొలి దశలో పోలింగ్ జరిగిన 102 స్థానాల్లో యూపీఏ 45, ఎన్డీయే 41 స్థానాలు గెలుపు

తొలిదశ బరిలో ప్రముఖులు:

  •  కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, సర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, బిప్లబ్ దేబ్, నబమ్ టుకీ, సంజీవ్ బల్యాన్, డీఎంకే నేత ఎ రాజా, ఎల్ మురుగన్, కార్తీ చిదంబరం.
  • జూన్ 4న ఎన్నికల ఫలితాలు

సాక్షి, న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ అయిన లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోరుకు సర్వం సిద్ధమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. వీటితోపాటే  అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మొత్తం 60, సిక్కింలోని మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

స్థానిక పరిస్థితులను బట్టి పోలింగ్‌ వేళల్లో మార్పులుచేర్చే అవకాశముంది. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్‌కుమార్‌ సుఖ్‌బీర్‌సింగ్‌ సంధూ పోలింగ్‌ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఈసీ రాజీవ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

తొలి దశలో బరిలో నిల్చిన నేతలు..
కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ(నాగ్‌పూర్‌ నియోజకవర్గం), కిరెన్‌ రిజిజు(అరుణాచల్‌ వెస్ట్‌), సంజీవ్‌ భలియా(ముజఫర్‌నగర్‌), జితేంద్ర సింగ్‌(ఉధమ్‌పూర్‌), అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌(బికనీర్‌), ఎల్‌.మురుగన్‌(నీలగిరి), శర్బానంద సోనోవాల్‌(దిబ్రూగఢ్‌), భూపేంద్ర యాదవ్‌(అల్వార్‌) శుక్రవారం నాటి పోరులో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, అరుణాచల్‌ మాజీ సీఎం నబాం టుకీ, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్‌ దేవ్, కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్, డీఎంకే నాయకురాలు కనిమొళి, బీజేపీ తమిళనాడు చీఫ్‌ కె.అన్నామలై, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ తనయుడు నకుల్‌నాథ్, లోక్‌ జనశక్తి పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్, బీజేపీ నేత జితిన్‌ ప్రసాద, నితిన్‌ ప్రామాణిక్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, కాంగ్రెస్‌ నేత కార్తీ చిదంబరం, ఏఎంఎంకే చీఫ్‌ టీటీవీ దినకరన్‌ పోటీచేస్తున్న స్థానాల్లోనూ శుక్రవారమే పోలింగ్‌ జరుగుతోంది.   

భారీగా ఏర్పాట్లు
తొలి దఫా పోలింగ్‌ కోసం 18 లక్షల మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పోలింగ్, భద్రతా సిబ్బందిని తరలించేందుకు 41 హెలికాప్లర్లు, 84 ప్రత్యేక రైళ్లు, లక్ష వాహనాలు సమకూర్చారు.

తప్పకుండా ఓటేయాలి: సీఈసీ రాజీవ్‌
ప్రతి ఓటరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోసందేశం విడుదలచేశారు. ‘‘ భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అనేవి అత్యంత రమణీయమైన భావన. ఇందులో ఓటింగ్‌కు మించింది లేదు. భారతీయ ఓటర్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ ఎండ వేడిమినీ అధిగమిస్తుంది. ఎన్నికలు మీవి. ఎవరిని ఎన్నుకోవాలనేది మీ ఇష్టం. మీ ప్రభుత్వాన్ని మీరే నిర్ణయించుకోండి. మీ కుటుంబం, పిల్లలు, పల్లె, గ్రామం.. అంతెందుకు దేశం కోసం మీరు వేస్తున్న ఓటు ఇది’ అని రాజీవ్‌ వ్యాఖ్యానించారు. 85 ఏళ్లు పైబడినవారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.

నాడు ఈ 102 సీట్లలో 45 చోట్ల యూపీఏ గెలుపు
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 45 చోట్ల యూపీఏ కూటమి విజయం సాధించింది. 41 స్థానాలను ఎన్‌డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఈ 41లో బీజేపీ గెలిచినవే 39 ఉన్నాయి.  

 సమస్యాత్మక బస్తర్‌లోనూ..
మావోల దాడులు, పోలీసు బలగాల ఎదురుకాల్పుల మోతలతో దద్దరిల్లే ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలోనూ శుక్రవారమే పోలింగ్‌ జరుగుతోంది. బస్తర్‌లోని కాంకేర్‌ జిల్లాలో ఈనెల 16న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది నక్సల్స్‌ మరణించిన నేపథ్యంలో ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బస్తర్‌లో 61 పోలింగ్‌బూత్‌లు సున్నితమైన ప్రాంతాల్లో, 196 బూత్‌లను సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు.

బస్తర్‌ నుంచి కాంగ్రెస్‌ ఫైర్‌బ్రాండ్‌ నేత కవాసి లఖ్మా బరిలో నిలిచారు. ఈయనకు పోటీగా మహేశ్‌ కశ్యప్‌ను బీజేపీ నిలిపింది. భద్రతా కారణాల రీత్యా కొన్ని బూత్‌లలో పోలింగ్‌ను మధ్యా హ్నం మూడు గంటలవరకే అనుమతిస్తారు. 191 ‘సంఘ్‌వారీ’ బూత్‌లను మహిళా సిబ్బంది నిర్వహిస్తారు. 42 ‘ఆదర్శ్‌’, 8 ‘దివ్యాంగ్‌జన్‌’, 36 యువ బూత్‌లనూ ఏర్పాటుచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement