మాదాసు గంగాధరం(ఫైల్)
సాక్షి, అమరావతి : మాజీ ఎమ్మెల్సీ, జనసేన పార్టీ సీనియర్ నేత మాదాసు గంగధరం ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనసేన పార్టీలో సీనియర్లకు గౌరవం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖలో.. ‘‘ పవన్ నిర్ణయాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని పవన్ ఎప్పుడూ ఖండించలేదు. మౌనం అర్ధాంగీకారం అనే భావన అందరిలో నెలకొంది. వివేకా హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని విమర్శలు చేశారు. కేంద్రం పరిధిలో పనిచేసే సీబీఐ దర్యాప్తును ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుంది?.
పవన్ పోటీ చేసిన గాజువాకలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు పవన్ అండగా నిలవలేకపోతున్నారు. సినిమా ప్రపంచం వేరు.. రాజకీయం ప్రపంచం వేరు. రెండింటికీ తేడా తెలియని మీతో పని చేయలేను. పార్టీ నిర్మాణంపై జనసేన దృష్టి పెట్టడం లేదు. ప్రజలు కోరుకున్నట్లు జనసేన పనిచేయడం లేద’’ని పేర్కొన్నారు. మాదాసు గంగాధరం జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం జనసేన ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment