Maharashtra Political Crisis: Supreme Court Asks Rebel MLAs - Sakshi
Sakshi News home page

Maharashtra Poliical Crisis: శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

Published Mon, Jun 27 2022 2:47 PM | Last Updated on Mon, Jun 27 2022 6:14 PM

Maharashtra Crisis: Deputy Speaker Cannot Disqualify Us: Shinde Sena Argues In SC - Sakshi

న్యూఢిల్లీ: మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. శివసేన రెబల్‌ ఎమ్మెల్యే పిటిషన్‌పై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ పర్దివాలా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌ అనర్హత నోటీసులపై స్టే ఇవ్వాలని రెబల్‌ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. తమను తొలగించాలనే తీర్మాణం పెండింగ్‌లో ఉన్నప్పుడు. డిప్యూటీ స్పీకర్‌ అనర్హత వేటు ప్రక్రియను కొనసాగించలేరని వాదించారు. అయితే రెబల్‌ ఎమ్మెల్యేలు హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ముంబైలో అనుకూల వాతావరణ పరిస్థితులు లేనందునే సుప్రీంను ఆశ్రయించామని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గతంలో పలు సందర్భాల్లో సుప్రీం ఇలాంటి పిటిషన్లపై నేరుగా విచారణ చేపట్టిందని పేర్కొన్నారు. నోటీసులు జారీ చేసే అధికారం డిప్యూటీ స్పీకర్‌కు లేదని, ఇప్పటికే ఆయనపై అవిశ్వాస తీర్మాణం ఇచ్చినట్లు తెలిపారు. అసలు డిప్యూటీ స్పీకర్‌ అనర్హత పిటిషన్లను స్వీకరించలేరని పిటిషినర్ల తరపు లాయర్‌ వాదించారు. 
చదవండి: సంజయ్‌ రౌత్‌కు ఈడీ సమన్లు.. షిండే కొడుకు వెటకారం

అసెంబ్లీలో మెజార్టీ కోల్పోయిన ప్రభుత్వం
మహారాష్ట్రలోని అధికార సంకీర్ణ కూటమి మహా వికాస్ అగాడీ అసెంబ్లీలో మెజార్టీ కోల్పోయింది. శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్‌ షిండే తృత్వంలోని 38మంది ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు.సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారు ఏక్‌నాథ్ షిండే. అసెంబ్లీలో మెజార్టీ కోల్పోయినా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోందన్నారు. డిప్యూటీ స్పీకర్ ఆఫీస్‌ను దుర్వినియోగం చేస్తూ.. అధికారంలో కొనసాగేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే మద్దతు ఉపసంహరణకు సంబంధించిన ఇప్పటివరకూ తమకు ఎలాంటి సమాచారం అందలేదని మహారాష్ట్ర గవర్నర్ వెల్లడించారు.

బీజేపీపై శివసేన ఆరోపణలు
మహారాష్ట్రలో తమదే అధికారమంటూ బీజేపీ చెబుతోంది. దీంతో బీజేపీపై శివసేన సంచలన ఆరోపణలు చేసింది. ఒక్కో ఎమ్మెల్యేలను రూ. 50కోట్లకు కొన్నారంటూ శివసేన పత్రిక సామ్నాలో ఆరోపించింది.

ఉద్దవ్‌పై షిండే విమర్శలు
ఉద్దవ్‌-షిండే వర్గం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పాత విషయాలు తవ్వుకుంటున్నాయి. ఉద్దవ్‌పై షిండే వర్గం ఎమ్మెల్యేలు విమర్శల దాడిని పెంచారు. దావుద్‌ ఇబ్రహీంతో సంబంధం ఉన్న వారిని ఉద్దవ్‌ ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దావుద్‌ అనుచరులకు మద్దతివ్వడమంటే బాల్‌ఠాక్రేను అవమానపరచడమేనని  అన్నారు. బాల్‌ఠాక్రేను అరెస్టు చేసిన వారితో కలిసి ఉద్దవ్‌ మంత్రి వర్గంలో కూర్చుకున్నారని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: మహా పాలిటిక్స్‌లో ట్విస్ట్‌.. రాజ్‌ థాక్రేతో టచ్‌లో ఏక్‌నాథ్‌ షిండే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement