ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల మధ్య సీఎం ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన శనివారం శివసేన జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ఈ భేటీలో శివసేన జాతీయ కార్యవర్గం మొత్తం 6 తీర్మానాలను ఆమోదించింది.
►బాల్‌థాక్రే పేరును షిండే వర్గం వాడకుండా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన జాతీయ కార్యవర్గం.
►దీనిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న శివసేన
►బాల్‌థాక్రే పేరు వాడుకునే అర్హత శివసేనకు మాత్రమే ఉందన్న ఉద్ధవ్
►శివ సైనికుల నిరసన కారణంగా ముంబైలో వచ్చే నెల 10వరకు 144 సెక్షన్ అమలు
►16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు పంపిన శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు.
►సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు
►సోమవారం 5:30కి డిప్యూటీ స్పీకర్‌కార్యాలయం ముందు హాజరుకావాలని ఆదేశాలు
►నోటీసులపై షిండే స్పందించకపోతే చట్టం ప్రకారం ముందుకెళ్తామని డిప్యూటీ స్పీకర్ ఆఫీస్ తెలిపింది.
అవిశ్వాస తీర్మానం తిరస్కరణ
ఏక్‌నాథ్ షిండే వర్గం ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసును డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు. రెబల్ ఎమ్మెల్యేలు పంపిన లేఖపై ఒరిజినల్ సంతకాలు లేకపోవడంతోనే తిరస్కరించినట్లు డిప్యూటీ స్పీకర్ తెలిపారు.
భవిష్యత్ కార్యాచరణపై చర్చ
ఇదిలా ఉంటే, మరోవైపు తన వర్గ ఎమ్మెల్యేలతో గౌహతిలోని ఓ హోటల్‌లో శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తమ మద్దతు షిండేకు ఉంటుందని కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో శివసేన భవన్ ముందు రెబల్ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలపైన కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు.
చదవండి: (తెర మీదకు శివసేన కొత్త పార్టీ!.. అగ్గి రాజుకుంటుందని హెచ్చరికలు)
Comments
Please login to add a commentAdd a comment