Mamata blocks Bengal governor on Twitter: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌ను ట్విటర్‌లో బ్లాక్ చేశారు. సోమవారం విలేకరుల సమావేశంలోమాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్ ట్వీట్‌ల వల్ల నేను చిరాకు చెందాను. అందుకే మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్‌లో అతన్ని బ్లాక్ చేశాను’ అని ముఖ్యమంత్రి అన్నారు. గవర్నర్ ఎవరిని లెక్క చేయడం లేదని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
అలాగే, గవర్నర్ ధన్‌ఖర్ తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని కూడా సీఎం ఆరోపించారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని తన కింద కార్మికులుగా చూస్తూ ప్రతిరోజూ గవర్నర్ ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుని బెదిరించే ట్వీట్లు పెడుతున్నాడని మండిపడ్డారు. ఆయనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పలుమార్లు లేఖలు రాసినట్టు, అయినా గవర్నర్‌ను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు.
చదవండి: ములాయం సింగ్‌కు స్మృతి ఇరానీ పాదాభివందనం, వీడియో వైరల్
తాను స్వయంగా వెళ్లి కూడా గవర్నర్‌తో మాట్లాడానని పేర్కొన్నారు. అయినా ఆయన వినడం లేదని అందరినీ బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. గవర్నర్ తీరుతో గత ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. పంపిన ప్రతి ఫైలు పెండింగులో పెడుతున్నారని, విధాన నిర్ణయాలపై ఆయనెలా మాట్లాడతారని మండిపడ్డారు. ఇదే విషయమై ప్రధాని మోదీకి నాలుగు ఉత్తరాలు కూడా రాసినట్టు తెలిపారు.
చదవండి: అఖిలేష్‌కు పోటీగా బలమైన అభ్యర్థి! బీజేపీ ఎత్తుగడ ఫలించేనా?
"I have been forced to block Governor Jagdeep Dhankhar on Twitter. Everyday he was issuing tweets targeting and threatening govt officials as if we're his bonded labourers," says West Bengal Chief Minister Mamata Banerjee
— ANI (@ANI) January 31, 2022
(File pic) pic.twitter.com/gwTTY2nBzc
Comments
Please login to add a commentAdd a comment