
సాక్షి, విశాఖపట్నం: సినిమాలు వేరు, రాజకీయాలు వేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తించాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచించారు. సీఎం పవన్ కల్యాణ్ అని సినిమా తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. అవసరమైతే నేనే ఆ సినిమాను తానే నిర్మిస్తానని తెలిపారు. ఆయన ఎలాగూ సీఎం కాలేరు.. సినిమా తీస్తే అభిమానులైనా సంతోషిస్తారని మంత్రి ఎద్దేవా చేశారు.
ఈ మేరకు మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఎప్పుడూ కూడా పక్కవారి కోసమే తన పార్టీని ప్రయోగిస్తారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలుపు కోసం పవన్ పోటీ చేయలేదు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల కోసం పోటీ చేసి ఓడిపోయారు. 2024లో అయినా 175 సీట్లలో పోటీ చేస్తానని పవన్ చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు.
'బాబు హయాంలో పెన్షన్ రావాలంటే మరొకరు చనిపోవాలి. ఇప్పుడు కొత్తవారికి కూడా పెన్షన్లు ఇస్తుంటే ఎల్లోమీడియా చూడలేకపోతోంది అని మండిపడ్డారు. ఇదిలా ఉంటే, అనకాపల్లి కొప్పాక వద్ద ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు టెండర్లకు పిలిచాం. ఈ పార్క్ ఏర్పాటు ద్వారా రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment