
సాక్షి, అమరావతి: పంట నష్టంపై చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2020 ఖరీఫ్ పంట నష్టం కింద వైఎస్ఆర్ పంటల బీమా ద్వారా రైతులకు రూ.1820 కోట్లు చెల్లిస్తే టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు అడ్రస్ గల్లంతైందన్నారు. అబద్దాన్ని పదేపదే చెబితే నిజం అవుతుందని టీడీపీ నేతల నమ్మకం అని కన్నబాబు దుయ్యబట్టారు.
‘‘రెండేళ్లలో రైతుల కోసం రూ.83 వేల కోట్ల సాయాన్ని ప్రభుత్వం అందించింది. పంట నష్టం జరిగితే పరిహారం ఎప్పుడో వస్తుందో తెలియని పరిస్థితి చంద్రబాబు హయాంలో ఉండేది. ఐదేళ్ల టీడీపీ హయాంలో రూ.2200 కోట్లు మాత్రమే.. పంట నష్టపోయిన రైతులకు పరిహారంగా చెల్లించారు. పంట నష్ట పరిహారంపై టీడీపీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారు గతంలో కంటే వ్యవసాయ వృద్ధి 122 శాతం పెరిగింది. రైతులకు మంచి చేస్తే టీడీపీకి 22 సీట్లే ఎందుకు వచ్చాయి? పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇచ్చిందే వైఎస్ఆర్ పంటల బీమా’’ అని కన్నబాబు వివరించారు.
చదవండి: చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు: పేర్ని నాని
ఆనందయ్య మందు: నివేదిక సమర్పించిన టీటీడీ
Comments
Please login to add a commentAdd a comment