
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని పేద మహిళలకు చంద్రబాబు నాయడు క్షమాపణ చెప్పాలని మంత్రి ఉషాశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. మహిళా ద్రోహి చంద్రబాబు ఇళ్ల స్థలాల్లో సమాధులు కట్టాలంటున్నాడని, ఓటమి భయతో చంద్రబాబు మహిళలను అవమానపరస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబుకి రాష్ట్రలో మహిళలంతా బుద్ధి చెప్పడం ఖాయమన్నారు మంత్రి ఉషా శ్రీ చరణ్.
మురికి ఆలోచనలతో ఉన్న చంద్రబాబు.. ఇళ్ల కాలనీలను మురికివాడలు అంటున్నాడని, సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబుకి ఫ్రస్టేషన్ ఎక్కువైందన్నారు. లోకేష్ సభ్యత మరిచి మాట్లాడుతున్నాడని, పవన్ కల్యాణ్ గుర్తు, గుర్తింపు లేని పార్టీ నాయకుడని మంత్రి విమర్శించారు.