usha sri charan
-
గుర్తుపెట్టుకో.. వడ్డీతో సహా ఇచ్చేస్తాం.. సవితమ్మకు ఉషశ్రీ చరణ్ మాస్ వార్నింగ్
-
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. మంత్రి సవిత కనుసన్నల్లో పోలీసులు.. ఉషశ్రీ చరణ్ ఫైర్
-
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి: ఉషశ్రీచరణ్
-
విద్యుత్ ఛార్జీలు పెంచడంపై చంద్రబాబుకు ఉషశ్రీ చరణ్ దిమ్మతిరిగే కౌంటర్
-
మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి భయపడే ప్రసక్తే లేదు..
-
YSRCP కార్యకర్తలపై కక్ష సాధింపు... పోలీసులను రఫ్ఫాడించిన ఉషశ్రీ చరణ్
-
బాలకృష్ణ నిద్ర పోతున్నావా... దసరా రోజున ఇలాంటి ఘటన దారుణం
-
టీడీపీ కాలకేయుల నుంచి మహిళలను రక్షించాలి
సాక్షి, అమరావతి/హిందూపురం: రాష్ట్రంలోని మహిళలకు టీడీపీ కాలకేయుల నుంచి రక్షణ కల్పించాలని మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీ చరణ్ డిమాండ్ చేశారు. ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ అత్యంత దుర్మార్గమని, విజయదశమి రోజు స్త్రీని పరాశక్తిగా కొలిచే ఈ దేశంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ఆదివారం హిందూపురం డీఎస్పీ మహేష్‌ను ఆయన కార్యాలయంలో కలసి బాధితుల పరామర్శకు అనుమతించాలని కోరారు.ఇందుకు ఆయన ససేమిరా అన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఇప్పుడు ‘తెలుగు దండుపాళ్యం పార్టీ’గా తయారైందన్న ఆమె.. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అమానుషం జరిగి రెండు రోజులైనా స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం బాధితులకు బాసటగా నిలవలేక పోయారని, నియోజకవర్గాన్ని గాలికి వదిలి సినిమాలకు పరిమితం కావడం బాధాకరమని నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక అన్నారు. -
బాలకృష్ణపై ఉషశ్రీ చరణ్ ఫైర్
-
బాబుకు బిగ్ షాక్... బాబు నీచ పాలనకు వీళ్ళే నిదర్శనం
-
బాబూ.. ఉచిత గ్యాస్, బస్సు ఎప్పుడు?: ఉషాశ్రీ చరణ్
సాక్షి, సత్యసాయి: ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తే పరిస్థితి లేదన్నారు మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్. చంద్రబాబు పాలనలో వంద రోజుల్లో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది కాబట్టే తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ సోమవారం సత్యసాయి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఒక పెన్షన్ తప్ప.. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే పరిస్థితుల్లో లేదు. రాష్ట్రంలో వంద రోజుల్లో ఏమీ చేయలేకపోయారు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్‌లో తిరుపతి లడ్డుపై దుష్ప్రచారం చేశారు. సనాతన ధర్మం గురించి చంద్రబాబు మాట్లాడటం మంచిది కాదని కోర్టు మొట్టికాయలు వేసింది.విశాఖ ఉక్కు, పెనుగొండలో గవర్నమెంట్ ఆసుపత్రుల ప్రైవేటీకరణను ఆపాలి. మహిళలకు ఉచిత బస్సు, ఫ్రీ గ్యాస్, 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 రూపాయలు ఖాతాలో జమ అంటూ ఏ ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. మన జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సవితమ్మ 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ ఇస్తామంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పటివరకు అమలు చేయలేక మంత్రి విఫలమయ్యారు. వైఎస్ జగనన్నను మళ్లీ సీఎం చేసుకునే వరకు, ప్రజలకు మంచి జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: భారీ దోపిడీకి టీడీపీ ప్లాన్!: వైఎస్సార్సీపీ -
హిందూపురంలో టీడీపీ నేతల అరాచకాలపై ఉషశ్రీ చరణ్ ఆగ్రహం
-
మోపిదేవి గురించి ఒక్కటే చెప్తున్నా.. ఉషశ్రీ చరణ్ అదిరిపోయే కౌంటర్
-
‘విశాఖలో చంద్రబాబు కుట్ర రాజకీయం.. ప్రజాస్వామ్యం అపహాస్యం’
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: విశాఖలో చంద్రబాబు కుట్ర రాజకీయం చేస్తున్నాడంటూ మండిపడ్డారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సంఖ్యా బలం లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారంటే చంద్రబాబు కార్యాచరణ ప్రణాళిక ఏవిధంగా ఉంటుందో అర్ధం అవుతోందని దుయ్యబట్టారు.కుట్ర, బెదిరింపు, ప్రలోభాలకు చంద్రబాబు పూనుకున్నాడు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడంటూ ఉషశ్రీచరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, మహా విశాఖ నగర పాలక సంస్థలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీడీపీ కూటమి కుట్ర రాజకీయాలకు తెరతీసింది. కూటమి కార్పొరేటర్లకు జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ మద్దతు పలుకుతూ.. చెల్లని ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుని.. 10కి 10 స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించినట్లు ప్రకటించారు.కుట్రలు చేసైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో.. కార్పొరేటర్లకు రూ.5 లక్షల వరకూ డబ్బులిచ్చి మరీ ఓట్లు బహిరంగంగానే కొనుగోలు చేశారు. తమకు మద్దతిస్తున్న కార్పొరేటర్లను భీమిలిలోని రిసార్టులో మంగళవారం రాత్రి మొత్తం అక్కడే బస చేయించి.. ఉ.11 గంటల సమయంలో ఓటింగ్‌కు బస్సులో తీసుకొచ్చారు. మరోవైపు.. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు నేరుగా ఫోన్లుచేసి డబ్బులు పంపిస్తున్నట్లు చెప్పి ఓట్లు కొనుగోలు చేశారు.ఇది చదవండి: విశాఖలో కూటమి ‘మహా’ కుట్ర -
చంద్రబాబుకు ఉష శ్రీ చరణ్ అదిరిపోయే కౌంటర్
-
మంత్రి సవితమ్మ అండతో రెచ్చిపోతున్న కలప దొంగలు..
-
టీడీపీ నేతల అరాచకాలపై ఉష శ్రీ చరణ్ ఫైర్
-
మహిళలపై టీడీపీ దాడులు.. ఉష శ్రీ చరణ్ స్ట్రాంగ్ వార్నింగ్
-
ఈవీఎంలపై అనుమానాలు నివృత్తి చేయాలి: ఉషశ్రీ చరణ్
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: దేశ వ్యాప్తంగా ఈవీఎం పై చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మంగళవారం ఆమె పెనుకొండలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈవీఎంల పనితీరుపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. పచ్చబిళ్ళ వేసుకుని ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్ళండి, పని చేయని అధికారుల భరతం పడతామంటూ అచ్చెన్నాయుడు వాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. అన్ని పార్టీల వారికి సమానంగా సంక్షేమ పథకాలు అందించిన మహోన్నత వ్యక్తి వైఎస్ జగన్ అని ఉషశ్రీ చరణ్ అన్నారు.వైఎస్ జగన్‌కు జెడ్‌ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి: రవిచంద్రారెడ్డివిజయవాడ: ఎన్డీఏ ప్రభుత్వంలో అధికార వివక్ష స్టార్ట్ అయ్యిందని వైఎస్సార్సీపీ నేత రవిచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది అధికారులను టార్గెట్ చేసి వేధిస్తున్నారన్నారు. డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులను కక్ష కట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. అధికారం మారగానే అధికారులను వేధించడం సరికాదు. వైఎస్ జగన్‌కు సెక్యూరిటీ తగ్గించడమేంటి?. వీఐపీలు ఉన్న మార్గాల్లో చెక్‌పోస్టులు పెట్టడం సహజమే. జగన్‌కు చెడు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం చూస్తోంది. వైఎస్ జగన్‌కు జెడ్‌ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి’’ అని రవిచంద్రారెడ్డి అన్నారు. -
ఎన్నికల ఫలితాలపై ఉష శ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు
-
చంద్రబాబుపై ఫైర్
-
కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..
-
కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు
-
‘సిద్ధం’ సముద్రం.. ‘రా కదలిరా’ పిల్ల కాలువ’: మంత్రి ఉషశ్రీ
సాక్షి, శ్రీసత్య సాయి జిల్లా: ‘రా కదలిరా సభ’ టీడీపీకి ఇదే ఆఖరి సభ అని.. టీడీపీ సభలకు జనం రావడం లేదంటూ ఎద్దేవా చేశారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్. పరిగి మండలంలో టీడీపీ నుంచి 430 కుటుంబాలు మంత్రి ఉషశ్రీ చరణ్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రెండు రోజుల ముందు వరకు వాలంటీర్లను కించపరిచిన చంద్రబాబు.. పెనుగొండ సభలో వాలంటీర్లను కొనసాగిస్తాం.. టీడీపీకి పని చేయడంటూ అడుక్కోవడం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. అనంతపురం వద్ద జరిగిన సిద్ధం సభలో పార్కింగ్ స్థలంలో సగం కూడా లేదు చంద్రబాబు రా కదలిరా సభ అంటూ మంత్రి చురకలు అంటించారు. సిద్ధం సభ సముద్రమైతే రా కదలిరా సభ పిల్ల కాలువగా ఆమె అభివర్ణించారు. చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని మంత్రి ఉషశ్రీ చరణ్ దుయ్యబట్టారు. -
చంద్రబాబు ప్రజలకు ఏం చేస్తాడో చెప్పడం లేదు: మంత్రి ఉషశ్రీ
-
2024లో భారీ మెజార్టీతో గెలుస్తాం: ఉషాశ్రీ చరణ్
-
అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లు పరిష్కరిస్తాం: మంత్రి ఉషశ్రీ చరణ్
-
రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశాడు
-
చంద్రబాబు నిప్పు-పప్పు అన్నాడు..371 కోట్లు దొబ్బేసి ఏం చేశాడంటే..
-
టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి ఉషశ్రీ బహిరంగ సవాల్
-
టీడీపీది బస్సు యాత్ర కాదు.. బోగస్ యాత్ర: మంత్రి ఉషశ్రీ చరణ్
సాక్షి, విజయవాడ: టీడీపీది బస్సు యాత్ర కాదు.. బోగస్ యాత్ర అంటూ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తలే వాళ్ల బస్ యాత్రపై రాళ్లేసే దుస్థితిలో ఆ పార్టీ ఉందన్న మంత్రి.. కల్యాణ దుర్గంలో ఉన్నం హనుమంత చౌదరి రౌడీయిజం మరోసారి బయటపడిందన్నారు. ఏ మొహం పెట్టుకొని టీడీపీ నేతలు బస్ యాత్ర చేస్తారంటూ ఆమె దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఎగ్గొట్టాడు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానంటే ప్రజలు నమ్ముతారా..?. బస్ యాత్ర, తుస్ యాత్ర, బోగస్ యాత్రలకు ప్రజలు మోసపోరు. పవన్ కళ్యాణ్ సభల్లో ఎక్కడ మహిళలు కనిపించడం లేదు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కళ్యాణ్‌కు మా సీఎం జగనన్నని ఓడించేంత సీన్ లేదు. చంద్రబాబు, దత్తపుత్రుడు ఎన్ని అబద్దాలు చెప్పిన మళ్లీ సీఎం జగనే’’ అని ఉషశ్రీచరణ్ స్పష్టం చేశారు. చదవండి: ఆ ప్యాకేజీ స్టార్ వారాహి అనే ఓ లారీ ఎక్కి ఊగిపోతూ.. : సీఎం జగన్ -
‘చంద్రబాబు రాష్ట్రంలో పేద మహిళలకు క్షమాపణ చెప్పాలి’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని పేద మహిళలకు చంద్రబాబు నాయడు క్షమాపణ చెప్పాలని మంత్రి ఉషాశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. మహిళా ద్రోహి చంద్రబాబు ఇళ్ల స్థలాల్లో సమాధులు కట్టాలంటున్నాడని, ఓటమి భయతో చంద్రబాబు మహిళలను అవమానపరస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబుకి రాష్ట్రలో మహిళలంతా బుద్ధి చెప్పడం ఖాయమన్నారు మంత్రి ఉషా శ్రీ చరణ్. మురికి ఆలోచనలతో ఉన్న చంద్రబాబు.. ఇళ్ల కాలనీలను మురికివాడలు అంటున్నాడని, సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబుకి ఫ్రస్టేషన్ ఎక్కువైందన్నారు. లోకేష్ సభ్యత మరిచి మాట్లాడుతున్నాడని, పవన్ కల్యాణ్ గుర్తు, గుర్తింపు లేని పార్టీ నాయకుడని మంత్రి విమర్శించారు. -
మహిళా శిశు సంక్షేమ శాఖలో 12,128 పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ చెప్పారు. మహిళలు, శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే సీఎం జగన్ ధ్యేయమని తెలిపారు. శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ.. టీడీపీ హయాంలో మహిళా శిశు సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక మహిళా శిశు సంక్షేమ శాఖలోని వివిధ విభాగాల్లో 12,128 పోస్టులను భర్తీ చేసినట్లు వివరించారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 4,018 పోస్టులనే భర్తీ చేసిందన్నారు. ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని మహిళలు, పిల్లలకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం లభించేలా వైఎస్సార్ సంపూర్ణ పోషన్ ప్లస్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. జూన్ నాటికి ఉద్ధానం ప్రాజెక్టు పూర్తి: మంత్రి రజిని ఉద్ధానం ప్రాంతంలోని దాదాపు 8 లక్షల మందికి ప్రాణాధారమైన ఉద్ధానం మంచి నీటి ప్రాజెక్టు జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి రానుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు సమయంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. టీడీపీ హయాంలో ఉద్ధానం ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధలు పడినా పట్టించుకోలేదని విమర్శించారు. ఆ ప్రాంత ప్రజల కష్టాలను కళ్లారా చూసిన సీఎం జగన్ దానిపై బాగా ఆలోచించి మూల కారణమైన మంచి నీటి సమస్యను పరిష్కరిస్తున్నారని చెప్పారు. 100 కి.మీ.దూరం నుంచి మంచి నీటిని తరలించేందుకు రూ.750కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తున్నారని తెలిపారు. అక్కడ కిడ్నీ రోగుల వైద్యం కోసం 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ వ్యాధులపై పరిశోధనకు రీసెర్చి సెంటర్‌ను నిరి్మస్తున్నారని చెప్పారు. జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు: మంత్రి జోగి రమేష్ నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఏర్పాటు చేస్తున్న జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. అసెంబ్లీలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 21,25,778 ఇళ్లలో 4,40,756 ఇళ్లు పూర్తయి లబ్దిదారులు ఆనందంగా గృహప్రవేశాలు కూడా చేశారన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే రూ.42,973 కోట్లు ఖర్చు చేశామన్నారు. సీఎం వైఎస్ జగన్ నియోజకవర్గ స్థాయిలో సమీక్షిస్తూ పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణం జరిగేలా మార్గదర్శనం చేస్తున్నారన్నారు. ఓటీఎస్ కింద డబ్బులు కట్టిన వారికి వెంటనే ఇళ్ల పత్రాలు అందిస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ఆటంకంగా ఉన్న కోర్టు కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో మిగిలి ఉన్న పేదలకు ఇళ్ల కోసం త్వరితంగా భూసేకరణ చేస్తామన్నారు. -
ఆడియో మార్చి అభాండాలా..?
అనంతపురం: ‘ఒక బీసీ మహిళ మంత్రిగా ఎదగడం ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదు. నేనంటే ఓర్వలేని వారు ఆడియో (వాయిస్) మార్చి అభాండాలు వేస్తున్నారు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో టీడీపీ ఉండటం సిగ్గుచేటు’ అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. సోమవారం ఆమె కళ్యాణదుర్గంలో మీడియాతో మాట్లాడారు. గతంలో రాష్ట్ర మంత్రి హోదాలో మొట్టమొదటిసారి జిల్లాకు వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షాలు వివాదం సృష్టించాయని గుర్తు చేశారు. తన కాన్వాయ్ ట్రాఫిక్ వల్ల ఓ చిన్నారి మృతి చెందిందని డ్రామాలకు తెరలేపారన్నారు. అయితే వాస్తవాలు తెలుసుకున్నాక ముక్కున వేలేసుకుని మిన్నకుండిపోయారన్నారు. నియోజకవర్గంలో ఇటీవల ప్రభుత్వ నిబంధనల మేరకు తన సొంత ఖర్చుతో కొనుగోలు చేసిన భూమిని కూడా కబ్జా అంటూ ఆరోపణలు చేశారన్నారు. తనపై దుష్ప్రచారం చేయడంలో భాగంగానే ప్రస్తుతం కూడా వివాదానికి తెర లేపారన్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా, మెజార్టీపై పార్టీ నాయకులతో చర్చిస్తుండగా వీడియో తీసి.. డబ్బుతో ప్రలోభాలకు తెర లేపారంటూ తన వాయిస్‌ను వక్రీకరించారని మండిపడ్డారు. టీడీపీ వారు ఇంతటి నీచానికి దిగజారడం సిగ్గుచేటన్నారు. గతంలో ఇదే నియోజకవర్గంలో వాల్మీకి నేత గోళ్ల బాదన్న తన వాదనను వినిపిస్తే అదే టీడీపీ వారు అతన్ని ఏం చేశారో, ఏం జరిగిందో ప్రజలంతా గమనించారన్నారు. ప్రస్తుతం కురుబ సామాజిక వర్గానికి చెందిన తనపై తప్పుడు ప్రచారం చేస్తూ టీడీపీ పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు. వెనుకబడిన వారు పదవుల్లో ఉండి ఏదైనా మాట్లాడితే అది నచ్చని కొన్ని చానళ్లు, కొన్ని పత్రికలు బురదజల్లడం పనిగా పెట్టుకున్నాయన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారంలో రామోజీరావుపై కేసులు కూడా నమోదయ్యాయని, దీని గురించి ఎవరైనా, ఎక్కడైనా మాట్లాడుతున్నారా అంటూ మంత్రి ఘాటుగా ప్రశ్నించారు. వైఎస్సార్సీపీకి నష్టం చేకూర్చడమే టీడీపీ, కొన్ని పత్రికల పని అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల నివారణకు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ప్రధాన భూమిక పోషిస్తాయని ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. భారత ఉన్నత న్యాయస్థానం మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు ఉత్తర్వుల ప్రకారం అన్ని శాఖాధిపతుల, ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ కమిటీలను తప్పని సరిగా ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు. గురువారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘‘పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం-2013" అమలు తీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ సీఎం జగన్ మహిళల భద్రతకు, సంక్షేమానికి, సాధికారతకు అధిక ప్రాధాన్యతనిస్తూ పలు వినూత్న పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మహిళా సాధికారతకు బడ్జెట్లో కూడా భారీ మొత్తంలో నిధులను మహిళల సంక్షేమం, అభివృద్దికే కేటాయిస్తున్నారన్నారు. ఫలితంగా రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఆరోగ్య పరంగా అభివృద్ది పథంలో ముందుకు వెళ్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఫిర్యాదులు చాలా తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నాయని, ఇందుకు జగనన్న ప్రభుత్వం తీసుకుంటున్న పలు రకాల చర్యలే కారణమని ఆమె పేర్కొన్నారు. అయితే పని చేసే ప్రదేశంలో మహిళా ఉద్యోగినులపై ఎటు వంటి లైంగిక వేధింపులకు ఆస్కారం లేకుండా ఉండేందుకు, మహిళలు వారి సమస్యలను నిర్బయంగా వెల్లడించడానికి ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలు ప్రధాన వేదికలుగా పని చేస్తాయన్నారు. ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలను ఇంత వరకు ఏర్పాటు చేయని శాఖాధిపతులు వెంటనే తమ కార్యాలయాల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకూ పనిచేసే మహిళా ఉద్యోగినుల్లో ఈ కమిటీలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా మహిళలకు ప్రత్యేక టాయిలెట్స్, శిశువులకు పాలిచ్చే ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. మహిళా సాధికారత సాధనలో దేశానికే ఏపీ ఆదర్శం: వాసిరెడ్డి పద్మ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళల భద్రత, సాధికారత సాధనలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి చూపుతున్న ప్రత్యేక శ్రద్దే ఇందుకు ప్రధాన కారణమని ఆమె తెలిపారు. మహిళా సమస్యల పరిష్కారానికి, మహిళల భద్రతకు, రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాలపై మహిళల్లో అవగాహన కల్పించేందుకు గత ఏడాది మార్చి 8న సీఎం జగన్ “సబల” కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ గత ఏడాది నుండి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున అమలు చేస్తూ గుంటూరు, ఏలూరు, కర్నూలు, విశాఖపట్నం జోన్లలో పలు అవగాహనా సదస్సులను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సదస్సుల్లో గుర్తించిన మహిళల సమస్యలను పెద్ద ఎత్తున పరిష్కరించడం కూడా జరిగిందన్నారు. కుటుంబ సలహాలు ఇచ్చేందుకు ప్రతి నెలా ప్రత్యేక డ్రైవ్‌లను కూడా మహిళా కమిషన్ నిర్వహిస్తున్నదని ఆమె తెలిపారు. అయితే ఉద్యోగినులు వారు పనిచేసే ప్రదేశంలో భద్రత కల్పించేందుకు ఇప్పటికే పలు శాఖాధిపతుల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. చదవండి: సీఎం జగన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు: సజ్జల -
బీసీలకు గౌరవం పెంచిన గొప్ప ముఖ్యమంత్రి జగన్: మంత్రి ఉష శ్రీ చరణ్
-
టీడీపీ, ఎల్లో మీడియా దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలి..
-
సంక్రాంతి ముగ్గులు వేసిన మంత్రి ఉష శ్రీ చరణ్
-
సీఎం జగన్ ప్రాణాలు పోస్తాడు.. చంద్రబాబు ప్రాణాలు తీస్తాడు: మంత్రి ఉషశ్రీ చరణ్
-
మంత్రి ఉషశ్రీ చరణ్ పై టీడీపీ కుట్రలు బట్టబయలు
-
టీడీపీ కుట్ర బట్టబయలు.. మంత్రికి క్షమాపణ చెప్పిన మహిళ
సాక్షి, అనంతపురం: మంత్రి ఉషాశ్రీచరణ్‌పై టీడీపీ కుట్ర రాజకీయాలు బట్టబయలయ్యాయి. మంత్రి ఉషాశ్రీచరణ్‌పై మహిళతో టీడీపీ నేతలు అవినీతి ఆరోపణలు చేయించారు. మహిళ వ్యాఖ్యలను విస్తృతంగా ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేశాయి. ఆ మహిళ.. మంత్రి ఉషశ్రీచరణ్‌ను కలిసి క్షమాపణ కోరింది. టీడీపీ ఒత్తిడి వల్లే ఆరోపణలు చేశానని ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. మంత్రి ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ, టీడీపీ నేతల ట్రాప్‌లో పడొద్దని సూచించారు. అభివృద్ధి ఓర్వలేకే టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు. చదవండి: ‘మీరు ఇక్కడే ఉండండి.. నేను వెళ్లొచ్చి సభలో మాట్లాడతా’.. ఇదేం తీరు బాబూ.. -
ప్రభుత్వ పథకాలపై టీడీపీ తప్పుడు ప్రచారం: మంత్రి ఉషాశ్రీచరణ్
సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రభుత్వ పథకాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ అన్నారు. గురువారం ఆమె తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో ఒక్క మంచి పథకమైన అమలు చేశారా అని ప్రశ్నించారు. రుణ మాఫీ పేరుతో మహిళలను చంద్రబాబు మోసం చేశారు. ఏ ఒక్క వర్గానికి కూడా చంద్రబాబు న్యాయం చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా బాబు అమలు చేయలేదని మంత్రి మండిపడ్డారు. ‘‘మహిళలపై చంద్రబాబు హయాంలో ఎన్ని దాడులు జరిగాయో చూశాం. రిషితేశ్వరి, వనజాక్షిలాంటి వారిపై అకృత్యాలు చంద్రబాబు హయాంలో ఎన్నో జరిగాయి. సీఎం జగన్ హయాంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 30 లక్షల మంది మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు ఇచ్చాం. మహిళలకు నిజమైన స్వావలంబన జగన్ పాలనలోనే దక్కింది. మహిళలకు రాజకీయంగా కూడా అనేక పదవులు దక్కాయి. ఎన్నికలు దగ్గర పడటంతో ఎల్లో మీడియా ఈ 16 నెలలూ ఇంకా అధికంగా విషం చిమ్మేలా వార్తలు రాస్తారు. కానీ జనం నమ్మే పరిస్థితి లేదు’’ అని మంత్రి ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. చదవండి: అందుకే ధైర్యంగా చెప్పగలుగుతున్నాం: సీఎం జగన్ -
నాణ్యతలో రాజీ పడొద్దు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: మహిళా శిశు సంక్షేమ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని సీఎం అధికారులు వివరించారు. అంగన్వాడీలలో ఖాళీగా ఉన్న సీడీపీఓ పోస్టుల వివరాలను సీఎంకు అందించారు. ఖాళీగా ఉన్న సీడీపీఓ పోస్టుల భర్తీకీ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 61 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. వాటి నియామకాలు ఎపీపీఎస్సీ ద్వారా చేపట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. సీడీపీఓ పోస్టుల భర్తీని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. వాటితో పాటు ఇంకా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. అంగన్వాడీలలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలన్నారు. నాడు–నేడు కింద చేపడుతున్న పనులను వేగవంతం చేయాలన్న సీఎం.. సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అంగన్వాడీలలో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు, పిల్లలు వికాసం చెందేలా మంచి వాతావరణాన్ని కల్పించడం ముఖ్యమని సీఎం పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..: ♦అంగన్వాడీలలో సార్టెక్స్ రైస్ సరఫరా చేయాలి ♦న్యూట్రిషన్ కిట్ సరఫరాలో నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడొద్దు ♦పిల్లలకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్ నాణ్యత కచ్చితంగా అత్యున్నత ప్రమాణాలతో ఉండాలి ♦అంగన్వాడీలలో పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలలో అన్నింటా క్వాలిటీ పెరగాలి. ఆ ఫలితాలు కనబడాలి. గతంలో కన్నా పిల్లలకు మంచి చేస్తున్నామన్న సంతృప్తి కలగాలి ♦అందుకోసం కావాల్సిన వసతులు, సదుపాయాలు పూర్తిగా కల్పించాలి ♦అంగన్వాడీల్లో కరికులమ్ (బోధనాంశం) కూడా మారాలి. ఎందుకంటే పిల్లలకు చిన్న వయసులోనే మెదడు తొందరగా పరిణతి చెందుతుంది. ఏ విషయాన్ని అయినా త్వరగా గ్రహించగలుగుతారు. ఇంకా వారికి మంచి అవగాహన కూడా ఏర్పడుతుంది ♦కరికులమ్ మార్పు కోసం అవసరం అయితే ప్రత్యేక అధికారిని నియమించాలి ♦కొత్తగా అందుబాటులోకి వచ్చిన సూపర్వైజర్ల సహాయంతో అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలన్న సీఎం ♦తనిఖీలు, నాణ్యత, నాడు–నేడు ఈ మూడు అంశాలకు సంబంధించి కచ్చితమైన మార్పు కనిపించాలన్న సీఎం ♦అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్, మహిళా శిశు సంక్షేమ శాఖలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ♦వీటిలో మార్పుల కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి ♦సిబ్బంది నియామకాలు సహా... ఏ రకమైన అవసరం ఉన్నా ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉంది ♦అయితే ఆ మేరకు కచ్చితమైన ఫలితాలు కూడా రావాల్సి ఉందన్న సీఎం ♦సూపర్వైజర్స్ సక్రమంగా పని చేయాలి. వీరి పనితీరుపైనా పర్యవేక్షణ ఉండాలన్న సీఎం ♦సూపర్వైజర్స్ వ్యవస్ధ ద్వారా అంగన్వాడీలలో పనితీరు మెరుగవడంతో పాటు నాణ్యత కూడా పెరుగుతుందన్న సీఎం ♦అంగన్వాడీల నుంచే పిల్లలకు భాషపై గట్టి పునాది అందించాలన్న సీఎం ♦పిల్లలకు ఉత్తమ అభ్యాసాలు ఉండాలన్న ముఖ్యమంత్రి మహిళ శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, సీఎస్ కెఎస్ జవహర్‌రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పాఠశాల విద్యాశాఖ (మౌలిక సదుపాయాలు) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరి, పౌర సరఫరాల శాఖ ఎండీ జి.వీరపాండ్యన్, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే ఇతర ఉన్నతాధికారులు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. -
బీసీల పల్లకీ మోస్తున్న మహానేత సీఎం జగన్ : ఉష శ్రీ చరణ్
-
'చంద్రబాబువి పచ్చి అబద్దాలు.. అవి టీడీపీ పుట్టక ముందునుంచే ఉన్నాయి'
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అబద్ధాలు తప్ప మరేం మాట్లాడటం లేదని మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. టీడీపీ పుట్టక ముందే డ్వాక్రా గ్రూపులు ఉన్నాయని అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం తన వల్లే డ్వాక్రా గ్రూపులు వచ్చినట్టు పచ్చి అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. 2014-19 మధ్యలో డ్వాక్రా మహిళలకు 14 వేల కోట్లు మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని తెలిపారు. ఎల్లోమీడియాతో కలిసి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలకు మాటిచ్చి నిలబెట్టుకున్నది సీఎం జగన్ మాత్రమేనని చెప్పారు. నాలుగు విడతల్లో 25వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ఆనాడు జగన్ మాట ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పటివరకూ రూ.12,750 కోట్లు డ్వాక్రా మహిళలకు ఇచ్చామని తెలిపారు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలను ఇచ్చామని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం దిశయాప్ తీసుకొచ్చారన్నారు. టీడీపీ, జనసేన రాజకీయాలే ముఖ్యం. ఇళ్ల నిర్మాణం విషయంలో జనసేన నేతలను లబ్దిదారులే తరిమికొట్టారని గుర్తుచేశారు. మహిళలను రాజకీయంగా మోసం చేయాలనుకుంటే కుదరదన్నారు. జగన్ మాత్రమే మహిళలకు అండగా నిలిచారన్నారు. మహిళలకు యాభై శాతం పైగా పదవులు కూడా ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. తొలి డిప్యూటీ సీఎం, తొలి ఎస్సీ హోంమంత్రి, తొలి సీఎస్ పదవి.. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించి, అభినవ అంబేద్కర్గా నిలిచారని సీఎం జగన్‌ను ప్రశంసించారు. మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ మాత్రమేనని మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. చదవండి: (రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాను.. బట్టలిప్పించికొట్టిస్తా: చంద్రబాబు) -
మహిళా, శిశు సంక్షేమశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని అధికారులు వివరించారు. రూ.3,364 కోట్లతో హాస్టళ్లలో నాడు – నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మొదటి విడతలో భాగంగా హాస్టళ్ల కోసం రూ.1500 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి జనవరిలో పనులు ప్రారంభానికి కసరత్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పిల్లలకు మంచి మౌలిక సదుపాయాలతో పాటు కిచెన్ల ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. సమీక్షలోని ముఖ్యాంశాలు.. ►అంగన్వాడీలలో సూపర్ వైజర్ల పోస్టులను భర్తీచేశామని తెలియజేసిన అధికారులు. ►అంగన్వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ, వాటి ఫలితాలను వివరించిన అధికారులు. ►అక్టోబరు నెలలో నూటికి నూటికి నూరుశాతం పంపిణీ జరిగిందన్న అధికారులు. ►డిసెంబర్1 నుంచి ఫ్లేవర్డ్ మిల్క్‌ను అంగన్వాడీల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ►పైలెట్ ప్రాజెక్టు కింద ముందుగా కొన్ని అంగన్వాడీల్లో అమలు చేస్తామన్న అధికారులు. ►మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలలో సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం. అంగన్వాడీలలో నాడు – నేడు కార్యక్రమంపైనా సీఎం సమీక్ష ►అంగన్వాడీల నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలని సీఎం ఆదేశం. ►మన పిల్లలే అక్కడకి వెళ్తారనుకుంటే ఎలాంటి వాతావరణం ఉండాలని కోరుకుంటామో అవన్నీ కూడా అంగన్వాడీలలో ఉండాలన్న సీఎం. ►అంగన్వాడీలలో టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్న సీఎం. ►ఈ మేరకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశం. గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో నాడు – నేడుపై సీఎం సమీక్ష ►మొత్తం మూడు దశల్లో నాడు – నేడు కార్యక్రమం. ►హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలి. ►పిల్లలకు మంచి వాతావరణం అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ►హాస్టళ్లలో వెళ్లేసరికి జైల్లోకి వెళ్లిన భావం పిల్లలకు ఉండకూడదు. ►చదువులు కొనలేని కుటుంబాలు తమ పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారు. ►వారు బాగా చదువుకోవడానికి, వారు బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలి. ►సమాజంలో అట్టడుగున ఉన్నవారు తాము చదువుకోవడానికి తగిన పరిస్థితులు లేవన్న భావన ఉండకూడదు. ►హాస్టళ్లలో ఉంచాల్సిన బంకర్ బెడ్స్.. తదితర సౌకర్యాలన్నీ కూడా నాణ్యతతో ఉండాలి. ►భవనాలను పరిగణలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలి. ►గురుకుల పాఠశాలలు– హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3013 చోట్ల నాడు–నేడు పనులు చేపట్టాలని నిర్ణయం. ►మొదటి ఫేజ్‌లో మొత్తం సుమారు 1366 చోట్ల నాడు – నేడు పనులు చేపట్టాలని నిర్ణయం. ►దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ కూడా మొదట విడతలోనే బాగుచేయాలని సీఎం ఆదేశం. ►మొదట విడతకు దాదాపుగా రూ.1500 కోట్లు, మొత్తంగా సుమారు రూ.3364కోట్ల వరకూ హాస్టళ్లలో నాడు – నేడు కోసం ఖర్చు అవుతుందని అంచనా. ►తొలివిడత పనులు వచ్చే జనవరి నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. ఏడాదిలోగా ఆ పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశం ►హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధిచేయడంతో పాటు, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలని సీఎం ఆదేశం. ►కిచెన్‌కు అవసరమైన దాదాపు 10 రకాల వస్తువులను ప్రతి హాస్టల్ కిచెన్ కోసం కొనుగోలు చేయాలని నిర్ణయం. ►హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయంగా మార్పులు కనిపించాలని సీఎం ఆదేశం. ►పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యతతో అందించాలని సీఎం ఆదేశం. ►హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలన్న సీఎం. ►మండలాలవారీగా పర్యవేక్షణ ఉండాలన్న సీఎం. ►హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలని సీఎం ఆదేశం. ►ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ల పోస్టులను భర్తీచేయాలన్న సీఎం. ►ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి గ్రీన్‌సిగ్నల్. ►పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్ –4 ఉద్యోగుల నియామకంపైనా దృష్టి పెట్టాలని ఆదేశం. ►ప్రతి హాస్టల్‌ను పరిశీలించి... కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలన్న సీఎం. ►హాస్టళ్ల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే.. ఫిర్యాదు చేయడానికి ప్రతి హాస్టల్లో ఒక నంబర్ ఉంచాలని సీఎం ఆదేశం. ►అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక నంబర్ ఉంచాలని సీఎం ఆదేశం. ఈ సమావేశానికి మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషా శ్రీచరణ్, సీఎస్ సమీర్ శర్మ, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ ఏ బాబు, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ సిరి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
టీడీపీ, జనసేన పార్టీలు కనుమరుగు అవ్వడం ఖాయం : మంత్రి ఉషశ్రీ చరణ్
-
మహిళా శిశు సంక్షేమానికి పెద్ద పీట
తిరుచానూరు: మహిళా శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషాశ్రీచరణ్ తెలిపారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన అంగన్వాడీ ఇన్చార్జి సూపర్వైజర్లకు మహిళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శనివారం నాల్గో రోజు మంత్రి ఉషాశ్రీచరణ్ హాజరై ప్రసంగించారు. సమగ్ర ప్రణాళికతో పౌష్టికాహారం అందించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఐసీడీసీ పీడీ జయశ్రీ, మహిళా ప్రాంగణ అధికారి వాసంతి, సీడీపీవోలు సుధారాణి, పద్మజ పాల్గొన్నారు. -
పవన్ ప్రపంచంలోనే పెద్ద అరాచకవాది
సాక్షి, కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): ‘పవన్ కళ్యాణ్ ప్రపంచంలోనే పెద్ద అరాచకవాది. ఇలాంటి అరాచకవాది మరొకరుండరు. ఆయన దుర్మార్గ పనులను సమర్థించుకునేందుకు మిగతా మగవారిని కూడా అలాగే నడవమంటున్నాడు. స్త్రీలను స్టెపినీలు అంటూ అసభ్యంగా సంబోధించిన వ్యక్తి రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హుడు. మరోసారి స్త్రీల పట్ల నీచంగా మాట్లాడితే రాక్షసులను సంహరించిన దుర్గాదేవిలా మహిళలే బుద్ధి చెబుతారు’ అని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ అన్నారు. శుక్రవారం కళ్యాణదుర్గంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్ సభ్య సమాజం తలదించుకునే పదజాలంతో ప్రజా ప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి విలువలు లేని నాయకుడిని సమర్థిస్తూ టీడీపీ నాయకులు ప్రెస్మీట్లు పెట్టడం, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, లోకేశ్ వంతపాడటం దుర్మార్గ రాజకీయానికి అద్దం పడుతోందన్నారు. పవన్, లోకేశ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఓ మహిళగా డిమాండ్ చేస్తున్నానన్నారు. విలేకరుల సమావేశంలో మంత్రి ఇంకా ఏమన్నారంటే.. మహిళల మానంతో ఆడుకోవాలా? ‘మీరూ మూడు పెళ్లిళ్లూ చేసుకోండి’ అంటూ పవన్ మాట్లాడుతున్నారు. యువతకు మీరిచ్చే సందేశం ఇదేనా? మహిళల మానంతో ఆడుకోవాలని చెబుతున్నారా? మహిళల పట్ల మీకున్న గౌరవం ఇదేనా? వారు చేసిందే గొప్ప అని పవన్, చంద్రబాబు ఒక లైన్ తీసుకున్నారు. పవన్‌తో టీడీపీ వారే బూతులు తిట్టించారు. అందుకే దత్త పుత్రుడికి చంద్రబాబు కొడుకు లోకేశ్ మద్దతు పలుకుతూ అవే పదాలు ఉపయోగించారు. ‘నా కొడుకులు’ అని పవన్, లోకేశ్, అయ్యన్న పాత్రుడు.. ఇలా వారంతా మాట్లాడుతున్నారు. వారందరికీ వారి బిడ్డల మీద కోపం ఉన్నట్టుంది. పవన్ వ్యాఖ్యలను గొప్పగా చిత్రీకరిస్తూ ఎల్లో మీడియాలో డిబేట్లు నడిపారు. టీడీపీ పత్రికల్లో జనసేన అధినేత అసభ్య పదజాలాన్ని పైకెత్తుతూ కథనాలు రాశారు. ఇదేమి పద్ధతి? ఏమిటా వెకిలినవ్వు బాబూ? చంద్రబాబు, ఆయన కొడుకు సమాజానికి ఏం చెప్పదలచుకున్నారు? ఆడపిల్ల నచ్చితే ముద్దు పెట్టాలి, లేదంటే కడుపు చేయాలన్న బాలకృష్ణకు ఉన్న విలువలు ఏమిటి? మొత్తంగా టీడీపీ టాప్ లీడర్లు అందరూ మహిళలను గౌరవించడంలో దిగజారి ప్రవర్తిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్‌లో ఆడపిల్లలతో మందు, విందు చేసుకోవటంలో తప్పేమిటి అని నారా లోకేశ్ ‘ఆహా’ షోలో అంటాడు. ఆ ఫొటోలను నిస్సిగ్గుగా సమర్థిస్తూ మామకు (బాలకృష్ణకు) లేని అభ్యంతరం తనకు ఎందుకని చంద్రబాబు వెకిలినవ్వు నవ్వుతాడు. అమ్మాయిల వ్యవహారాలు ‘మీరు సినిమాల్లో చేసిన దానికంటే.. నేను నిజ జీవితంలో ఎక్కువ చేశాను’ అని వయసు కూడా మర్చిపోయి చంద్రబాబు చెప్పడం చూసి ప్రజలందరూ అసహ్యించుకుంటున్నారు. ఎక్కడైనా పోలిక ఉందా? కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా? ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా అన్న చంద్రబాబు అహం ఎక్కడ? అదే మహిళలకు అన్నింటా 50 శాతం ప్రాతినిథ్యం కల్పించిన సీఎం జగన్ మనసు ఎక్కడ? సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అన్నింటా అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారు. అభినవ అంబేడ్కర్‌గా, పూలె అడుగుజాడల్లో నడుస్తున్న సీఎం జగన్ వెంటే మహిళలంతా ఉన్నారు. జగన్‌కు ఉన్న ఇంతటి ప్రజాదరణను చూసి ఓర్వలేక ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. అయినా సరే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ వైఎస్సార్సీపీకే పట్టం కడతారు. ప్రభుత్వం చేసే మంచి పనుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడమే పవన్, చంద్రబాబు, దుష్టచతుష్టయం పని. మొన్న విశాఖ గర్జన సందర్భంగా పవన్ ఆడిన డ్రామానే ఇందుకు నిదర్శనం. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటును అడ్డుకుంటున్నారు. అసలు వాళ్లు రాయలసీమకు అనుకూలమో, వ్యతిరేకమో స్పష్టం చేయాలి. -
పవన్ కల్యాణ్ వాడిన బాష చాలా దారుణంగా ఉంది : మంత్రి ఉష శ్రీ చరణ్
-
టీడీపీ పై మంత్రి ఉషశ్రీ చరణ్ ఫైర్
-
ఆత్మీయ ఆదరణ
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి ఆత్మీయ ఆదరణ లభిస్తోంది. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారు. అన్ని జిల్లాల్లో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, అర్హులకు అవి అందుతున్నాయో లేదో అని అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన చిన్నచిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. -
బలహీనవర్గాలకు రాజ్యాధికారం: ఉషాశ్రీ చరణ్
-
బాలల్లో సంకల్పబలం ఉండాలి
భవానీపురం (విజయవాడ పశ్చిమ): సమాజానికి మంచి చేయాలన్న సంకల్పబలం బాలల్లో ఉండాలని, అందుకోసం కష్టపడి చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్ ఆకాంక్షించారు. మంగళవారం ఆమె ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రభుత్వ బాలుర పరిశీలనా గృహాన్ని (జువెనైల్ హోం) సందర్శించారు. గృహంలో ఉన్న బాలలతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విశాలమైన ప్రపంచంలో అనేక అవకాశాలున్నాయని, బెయిల్‌పై బయటకు వెళ్లిన తర్వాత సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాలలు పెరిగిన వాతావరణం, అక్కడి పరిస్థితుల ప్రభావంతో జరిగిన చిన్నచిన్న ఘటనల కారణంగా ఇక్కడికి వచ్చారని అన్నారు. వారికి ఇక్కడ ఇస్తున్న కౌన్సెలింగ్‌తో చాలా మార్పు వచ్చిందన్నారు. బెయిల్ పూచీకత్తు అంశాన్ని జేజేసీ దృష్టికి తీసుకెళ్తా తమకు బెయిల్ మంజూరు అయినప్పటికీ పూచీకత్తు, నగదు జమ చేయలేని పరిస్థితుల్లో తమ తల్లిదండ్రులున్న కారణంగా ఇంకా ఇక్కడే ఉండాల్సి వస్తుందని పలువురు బాలలు మంత్రి ముందు కన్నీటి పర్యంతమయ్యారు. దాంతో చలించిపోయిన ఆమె.. ఈ అంశాన్ని తాను జువెనైల్ జస్టిస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని ధైర్యం చెప్పారు. వారిని గురుకుల పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చైల్డ్ లైన్ 1098 ఏర్పాటు చేసిన బాలల హక్కుల పరిరక్షణ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. బాలల సంస్కరణల సేవలు జాయింట్ డైరెక్టర్ బీడీవీ ప్రసాదమూర్తి, పరిశీలనా గృహం సూపరింటెండెంట్ టి.మధుసూధనరావు, మహిళా శిశు సంక్షేమ పీడీ ఉమాదేవి పాల్గొన్నారు. -
ఏపీ కొత్త మంత్రులు: ఇంగ్లీష్‌లో ప్రమాణం చేసింది వీరే..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులు కొలువుదీరారు. 25 మంది మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులుగ్రూపు ఫొటో దిగారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులు తేనీటి విందులో పాల్గొన్నారు. చదవండి: AP: మంత్రుల ప్రమాణ స్వీకారం.. తొలుత ప్రమాణం చేసింది ఆయనే.. మంత్రులుగా అంబటి రాంబాబు, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, కాకాణి గోవర్థన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, ఉషాశ్రీ, చరణ్, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్, పి.రాజన్న దొర, ఆర్కే రోజా, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, విడదల రజినీ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఉషాశ్రీ చరణ్ ఆంగ్లంలో ప్రమాణం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అనంతపురం జిల్లా: ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్
-
‘స్థానిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించాలి’
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానికి సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కర్యాకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో తమ ప్రభుత్వం ప్రభంజనం సృష్టించాలని పేర్కొన్నారు. బాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో!: అనంత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. 9 నెలల పాలనతో నవరత్నాల అమలు ఎలా ఉందో ప్రచారంలో పేర్కొవాలని సూచించారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలను ధీటుగా ఎదుర్కొవాలని చెప్పారు. అత్యధిక స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలిచి, టీడీపీ జనసేనలకు బుద్ది చెప్పాలని ఆయన అన్నారు. ఇక ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ పరిపాలన అద్భుతంగా ఉందని, ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకేళ్లాలన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు ఐక్యమత్యంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొవాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. -
దోచుకోవడమే టీడీపీ ధ్యేయం
- దుర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి : అనంత వెంకట్రామిరెడ్డి - మనవడికి అవినీతి పాఠాలు నేర్పిన బాబు : విశ్వేశ్వరరెడ్డి - మూడేళ్లలో అభివృద్ధి గుండు సున్నా : శంకర నారాయణ - రాజన్న రాజ్యాన్ని తీసుకొద్దాం : గురునాథ్‌రెడ్డి - జగన్ సీఎం కావడం తథ్యం : డాక్టర్ తిప్పేస్వామి - కళ్యాణదుర్గం ప్లీనరీలో టీడీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ నేతలు కళ్యాణదుర్గం : టీడీపీ పాలన దోచుకోవడమే ధ్యేయంగా సాగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం నియోజకవర్గ ప్లీనరీ సమావేశాన్ని సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అనంత మాట్లాడుతూ ప్రజలు టీడీపీ నాయకులను నమ్మి ఓట్లేస్తే వారు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతి పనిలోనూ దోచుకోవడానికి చూస్తున్నారని మండిపడ్డారు. కళ్యాణదుర్గం అభివృద్ధి చెందిందంటే దివంగత లక్ష్మీదేవమ్మ, అనంత వెంకటరెడ్డిల హయాంలోనేనని, ప్రస్తుతం వైఎస్సార్‌సీపీతోనే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆ నమ్మకాన్ని ప్రజలకు కలిగించేలా ధైర్యంగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వైఎస్సార్ సిద్ధాంతాలతో ఏర్పడ్డ వైఎస్సార్సీపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. ఎన్ని కష్టాలు కలిగించినా అధికార పార్టీ దౌర్జన్యాలకు లొంగని కార్యకర్తలు ఇక్కడ ఉన్నారని, ఐకమత్యంతో, క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి పాటుపడదామని పిలుపునిచ్చారు. పరిటాల రవి మంత్రిగా ఉంటూ శాసిస్తున్న సమయంలోనూ ఎదురొడ్డి పోరాడిన నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఎందరో ఉన్నారన్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలతో విసిగిపోయిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆ పార్టీని ఓడించాలనే కసి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన టీడీపీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆయన కుమారుల చేతుల్లో బందీ అయ్యారని, వారు ఎమ్మెల్యే పీఠాన్ని అవినీతి పీఠంగా మార్చుకున్నారని విమర్శించారు. భవిష్యత్‌లో గాలిని సైతం తమ అనుమతితోనే పీల్చుకోవాలనే స్థాయికి టీడీపీ నాయకులు దిగజారారని, ఇలాంటి పరిస్థితుల్లో అందరం ఐకమత్యంతో పోరాడి ఇక్కడ కూడా వైఎస్సార్సీపీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. - ప్లీనరీ పరిశీలకుడిగా హాజరైన ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పాలు తాగే మనువడికి అవినీతి పాఠాలు నేర్పిన ఘనుడు సీఎం చంద్రబాబు అని విమర్శించారు. అక్షరాభ్యాసం సమయంలో అ - అంటే అమరావతి, ఆ - అంటే ఆదాయమని, అమరావతిలో ఆదాయం ఉందంటూ మనువడికి విద్య నేర్పిన చరిత్ర సీఎంకే దక్కిందన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమాధానం చెప్పాలంటే చంద్రబాబు వణికి పోతున్నారన్నారు. రాజన్న రాజ్యం కోసం ప్రజలు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారన్నారు. పరిస్థితి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉందని, అందరూ ఐకమత్యంతో టీడీపీ అరాచకాలు, మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మూడేళ్ల చంద్రబాబు పాలనలో అవినీతి, నిరంకుశత్వం, అప్రజాస్వామిక పాలన తప్ప చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు రాత్రికి రాత్రే విజయవాడకు మకాం మార్చారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఆయన భయపడకుండా ప్రత్యేక హోదా కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. - పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు మూడేళ్ల పాలనలో అభివృద్ధి గుండుసున్నా అన్నారు. జన్మభూమి కమిటీల నుంచి చంద్రబాబు వరకు అవినీతిలో కూరుకుపోయారన్నారు. ఇసుకను తైలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారని, నీరు - చెట్టు పథకంలో నిలువు దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. పట్టిసీమలో 600 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ అక్షింతలు వేసినా వారికి సిగ్గు రాలేదన్నారు. జిల్లాలో టీడీపీని ఆదరించినా ప్రజాప్రతినిధులు చేసిందేమీ లేదన్నారు. టీడీపీ నాయకులు పట్టపగలే దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. హంద్రీనీవా నీరు రావాలంటే జగన్ సీఎం కావాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మేలు జరిగేందు కోసం వైఎస్సార్సీపీని గెలిపించి రాజన్న రాజ్యాన్ని తీసుకొద్దామన్నారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఎంతైనా ఉందన్నారు. ప్రజలు కూడా ఎవరి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో గుర్తించాలని ఆయన కోరారు. వైఎస్సార్సీపీ మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు. కళ్యాణదుర్గంలో ఉషాశ్రీచరణ్ గెలవడం కూడా ఖాయమన్నారు. దళితులంతా టీడీపీ మోసాలను గ్రహించి వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వాలన్నారు. సేవ చేయడానికే వచ్చా.. ఒక్క అవకాశం ఇవ్వండి ‘ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో కళ్యాణదుర్గం వచ్చా.. అందులో భాగంగానే గడపగడపకూ తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి’ అని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ కోరారు. ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తుండగా టీడీపీ అడ్డుకుందని, ఇక నుంచి మరీ ఎక్కువగా ఉచిత కంటి ఆపరేషన్లు చేపడతామని అన్నారు. వికలాంగులకు కృత్రిమ అవయవాలు కూడా అందజేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నం కుటుంబ సభ్యుల లావాదేవీలు లక్షలు, కోట్లకు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. కళ్యాణదుర్గం చెరువులకు నీరు నింపేదాక పోరాటాలు చేస్తామన్నారను. మహిళలకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందంటూ.. ఎమ్మెల్యే రోజా, తహసీల్దార్ వనజాక్షి ఉదంతాలను ప్రస్తావించారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరితో కలిసి శ్రమిస్తానన్నారు. - ఉషాశ్రీచరణ్, కళ్యాణదుర్గం సమన్వయకర్త