సాక్షి, సత్యసాయి: ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తే పరిస్థితి లేదన్నారు మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్. చంద్రబాబు పాలనలో వంద రోజుల్లో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది కాబట్టే తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ సోమవారం సత్యసాయి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఒక పెన్షన్ తప్ప.. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే పరిస్థితుల్లో లేదు. రాష్ట్రంలో వంద రోజుల్లో ఏమీ చేయలేకపోయారు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్‌లో తిరుపతి లడ్డుపై దుష్ప్రచారం చేశారు. సనాతన ధర్మం గురించి చంద్రబాబు మాట్లాడటం మంచిది కాదని కోర్టు మొట్టికాయలు వేసింది.
విశాఖ ఉక్కు, పెనుగొండలో గవర్నమెంట్ ఆసుపత్రుల ప్రైవేటీకరణను ఆపాలి. మహిళలకు ఉచిత బస్సు, ఫ్రీ గ్యాస్, 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 రూపాయలు ఖాతాలో జమ అంటూ ఏ ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. మన జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సవితమ్మ 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ ఇస్తామంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పటివరకు అమలు చేయలేక మంత్రి విఫలమయ్యారు. వైఎస్ జగనన్నను మళ్లీ సీఎం చేసుకునే వరకు, ప్రజలకు మంచి జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: భారీ దోపిడీకి టీడీపీ ప్లాన్!: వైఎస్సార్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment