సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: విశాఖలో చంద్రబాబు కుట్ర రాజకీయం చేస్తున్నాడంటూ మండిపడ్డారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సంఖ్యా బలం లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారంటే చంద్రబాబు కార్యాచరణ ప్రణాళిక ఏవిధంగా ఉంటుందో అర్ధం అవుతోందని దుయ్యబట్టారు.
కుట్ర, బెదిరింపు, ప్రలోభాలకు చంద్రబాబు పూనుకున్నాడు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడంటూ ఉషశ్రీచరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, మహా విశాఖ నగర పాలక సంస్థలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీడీపీ కూటమి కుట్ర రాజకీయాలకు తెరతీసింది. కూటమి కార్పొరేటర్లకు జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ మద్దతు పలుకుతూ.. చెల్లని ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుని.. 10కి 10 స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించినట్లు ప్రకటించారు.
కుట్రలు చేసైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో.. కార్పొరేటర్లకు రూ.5 లక్షల వరకూ డబ్బులిచ్చి మరీ ఓట్లు బహిరంగంగానే కొనుగోలు చేశారు. తమకు మద్దతిస్తున్న కార్పొరేటర్లను భీమిలిలోని రిసార్టులో మంగళవారం రాత్రి మొత్తం అక్కడే బస చేయించి.. ఉ.11 గంటల సమయంలో ఓటింగ్‌కు బస్సులో తీసుకొచ్చారు. మరోవైపు.. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు నేరుగా ఫోన్లుచేసి డబ్బులు పంపిస్తున్నట్లు చెప్పి ఓట్లు కొనుగోలు చేశారు.
ఇది చదవండి: విశాఖలో కూటమి ‘మహా’ కుట్ర
Comments
Please login to add a commentAdd a comment