
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అబద్ధాలు తప్ప మరేం మాట్లాడటం లేదని మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. టీడీపీ పుట్టక ముందే డ్వాక్రా గ్రూపులు ఉన్నాయని అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం తన వల్లే డ్వాక్రా గ్రూపులు వచ్చినట్టు పచ్చి అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. 2014-19 మధ్యలో డ్వాక్రా మహిళలకు 14 వేల కోట్లు మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని తెలిపారు. ఎల్లోమీడియాతో కలిసి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్వాక్రా మహిళలకు మాటిచ్చి నిలబెట్టుకున్నది సీఎం జగన్ మాత్రమేనని చెప్పారు. నాలుగు విడతల్లో 25వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ఆనాడు జగన్ మాట ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పటివరకూ రూ.12,750 కోట్లు డ్వాక్రా మహిళలకు ఇచ్చామని తెలిపారు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలను ఇచ్చామని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం దిశయాప్ తీసుకొచ్చారన్నారు. టీడీపీ, జనసేన రాజకీయాలే ముఖ్యం. ఇళ్ల నిర్మాణం విషయంలో జనసేన నేతలను లబ్దిదారులే తరిమికొట్టారని గుర్తుచేశారు.
మహిళలను రాజకీయంగా మోసం చేయాలనుకుంటే కుదరదన్నారు. జగన్ మాత్రమే మహిళలకు అండగా నిలిచారన్నారు. మహిళలకు యాభై శాతం పైగా పదవులు కూడా ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. తొలి డిప్యూటీ సీఎం, తొలి ఎస్సీ హోంమంత్రి, తొలి సీఎస్ పదవి.. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించి, అభినవ అంబేద్కర్‌గా నిలిచారని సీఎం జగన్‌ను ప్రశంసించారు. మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ మాత్రమేనని మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు.
చదవండి: (రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాను.. బట్టలిప్పించికొట్టిస్తా: చంద్రబాబు)