సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అరవింద్ మాటలు హేయమని ఫైరయ్యారు. కాగా, శుక్రవారం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. ‘అరవింద్ యాక్సిడెంటల్‌గా గెలిచారు. అరవింద్ చిల్లరగా మాట్లాడతాడు.
నిజామాబాద్ పేరును అరవింద్ చెడగొడుతున్నాడు. బురదలో రాయి వేయకూడదనే ఇన్నాళ్లు అరవింద్‌ను పట్టించుకోలేదు. నా గురించి తప్పుగా మాట్లాడితే చెప్పుతో కొడతాను. రాజకీయం చేయి.. పిచ్చి వేషాలు వేయకు అరవింద్. పార్టీ మారుతానని అడ్డమైన కూతలు కూస్తే నిజామాబాద్ చౌరస్తాలో నిలబెట్టి చెప్పుతో కొడతాను. నేను ఆవేదనతో, బాధతో మాట్లాడుతున్నాను. ఇంకోసారి గీత దాటితే ఊరుకోను..
రాజకీయాల్లో ఉంటే నీతి, నిజాయితీ, ఇంగిత జ్ఞానం ఉండాలి. కుక్క కాటుకు చెప్పుదెబ్బ తప్పదు. అరవింద్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడి సమయం వృథా చేసినందుకు మీడియాకు క్షమాపణలు చెబుతున్నాను. నేను మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి కాంగ్రెస్‌లో చేరతానని అన్నానా?. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి ఓడిస్తాను. కాంగ్రెస్‌తో కలిసి గెలిచింది నువ్వు అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
కేసీఆర్‌ను అనరాని మాటలు అంటున్నారు. పార్లమెంట్‌లో ఎంపీ అరవింద్ చేసిందేమీ లేదు. బీజేపీలో చేరమని నాకు ప్రతిపాదనలు వచ్చాయి. నాకు చాలా ఆశలు చూపించారు. కానీ, నేను వాటిని తిరస్కరించారు. షిండే తరహాలో ఈ ప్రతిపాదన తెచ్చారు. వారి ప్రతిపాదనను మర్యాదకపూర్వకంగా తిరస్కరించాను. ప్రజలను, నాయకులను మోసం చేయబోమని చెప్పాను. ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. ఎలాంటి కేసులనైనా ఎదుర్కొంటాను’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment