
సాక్షి, హైదరాబాద్: ఇకపై తాను గాంధీభవన్ మెట్లు ఎక్కనంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. సోనియా, రాహుల్‌పై విమర్శలు చేయనని, తన నియోజకవర్గం ప్రజలకే పరిమితం అవుతానని తెలిపారు.
టీడీపీ నుంచి వచ్చే నేతలు నన్ను కలవద్దు. టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిపోయింది. ఓటుకు నోటు కేసులో ఎలా లాబీయింగ్ చేశాడో.. పీసీసీ పదవిని కూడా అలాగే తెచ్చుకున్నాడు. పీసీసీ పదవిని రాష్ట్ర ఇంఛార్జ్ ఠాగూర్ అమ్ముకున్నారు. పార్టీలు మారిన వారికే పదవులు వస్తున్నాయి.. ఎన్నికల్లో డిపాజిట్లు రాని వారికి కూడా కమిటీలో పదవులు దక్కాయి. నా రాజకీయ భవిష్యత్‌ను కార్యకర్తలు నిర్ణయిస్తారు. కాంగ్రెస్‌ను నమ్ముకున్నవారికి అన్యాయం జరిగిందని కార్యకర్తలు అంటున్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో కొత్త కార్యవర్గం డిపాజిట్లు తెచ్చుకోవాలంటూ’’ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
చదవండి: TPCC: మరి అసంతృప్తుల పరిస్థితి ఏమిటి?
అక్కడికి వద్దన్నా వెళ్లిన మోత్కుపల్లి.. బీజేపీ సీరియస్!
Comments
Please login to add a commentAdd a comment