ఫైల్ ఫోటో
సాక్షి, రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లాకు సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఏమీ లేవని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం తిప్పర్తి మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాను దత్తత తీసుకున్న కేసీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదన్నారు. మండలంలో మాచనపల్లి రైల్వే అండర్ పాస్ అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి మరమ్మతులు చేయిస్తానని తెలిపారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బంద్‌లో పాల్గొన్న టీఆర్‌ఎస్ పార్టీ అదే నల్లా చట్టాలను రాష్ట్రం లో ఎలా అమలు చేస్తోందని ప్రశ్నించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండల్‌రావు, ఆదిమూల ప్రశాంత్, చెర్కుపల్లి క్రిష్ణ కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో పాశం నరేష్‌రెడ్డి, మక్కెర్ల శ్రీనివాస్‌యాదవ్, బద్దం సుధీర్, జూకూరి రమేష్, ఎంపీటీసీలు పల్లె ఎల్లయ్య, బత్తిని మట్టయ్య, దొంతినేని నాగేశ్వరావు, వంగూరి గిరి, భాస్కర్, బత్తిని సోమరాజు, గుండు శ్రీనివాస్‌గౌడ్, వంగూరి కిరణ్, మనోహర్, బద్దం సైదులు, గుండె బోయిన సైదులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ పరామర్శ
మాడుగులపల్లి : మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన కట్ట జగన్నాథరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆదివారం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జగన్నాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట జెడ్పీటీసీ పుల్లెంల సైదులు, నాంపల్లి శ్రీశైలం, ఎరుకుల వెంకన్న తదితరులు ఉన్నారు.
57 ఏళ్లు నిండిన వారికి ఫించన్ ఇవ్వాలి
చిట్యాల : సీఎం కేసీఆర్ శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రూ.3 వేల పింఛన్ ఇవ్వాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం చిట్యాలలో నిర్వహించిన వయోవృద్ధుల సదస్సులో ఆయన మాట్లాడారు. వయో వృద్ధులకు ఉచితంగా వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. చిట్యాలలో వయో వృద్ధుల భవననిర్మాణానికి నిధుల మంజూరు చేస్తానని హామీనిచ్చారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఆసరా వంటి పథకాలతో వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, వయో వృద్దుల సంఘం మండల అధ్యక్షుడు పామన గుళ్ల అచ్చాలు, కంపె మల్లయ్య, జెల్లా సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment