సాక్షి, ముంబై: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే- యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ రాజకీయాలను.. రష్యా, చైనా రాజకీయాలతో పోల్చారు.
‘దేశంలో ఎవరూ సురక్షితంగా లేరు. ఎవరు ఎప్పుడైనా అరెస్ట్ కావొచ్చు. రష్యా , చైనా తరహాలోనే భారత్‌లోనూ జరుగుతోంది. ప్రజలే కేజ్రీవాల్‌ను సీఎంగా ఎన్నుకున్నారు. కాబట్టి ఆయన భవితవ్యాన్ని వారే నిర్ణయిస్తారు అని సంజయ్ రౌత్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కష్టం కావడంతో ప్రత్యర్ధుల్ని ఈ రకంగా దెబ్బతీసే కార్యక్రమం చేపట్టిందని అన్నారు.
ఈడీ కస్టడీలోనే అరవింద్ కేజ్రీవాల్
ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌ను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి పంపింది. అయితే, లిక్కర్ కేసులో ప్రధాన లబ్ధి దారులు ఆమ్ ఆద్మీ పార్టీయేనని ఈడీ ఆరోపిస్తోంది. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు రూ.45 కోట్లు వరకు ఖర్చు పెట్టినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment