బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరికి ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్‌ | YSRCP MP Vijayasai Reddy Political Counter To BJP Purandeswari Over Chandrababu Scam Cases - Sakshi
Sakshi News home page

బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరికి ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్‌

Published Sat, Oct 21 2023 12:10 PM | Last Updated on Sat, Oct 21 2023 12:19 PM

MP Vijayasai Reddy Political Counter To BJP Purandeswari - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పలు కుంభకోణాల కేసుల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. రాజమండ్రి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. మరోవైపు.. చంద్రబాబు తరఫున పేరుమోసిన లాయర్లు పలు కోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయాన్ని ఓడించడానికి నారా ఫ్యామిలీ కోట్ల రూపాయలను వెదజల్లుతోందని విమర్శించారు. 

కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘న్యాయాన్ని ఓడించడానికి ఓ పక్క కోట్లు వెదజల్లుతూ, పేరుమోసిన లాయర్లతో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తూ మరోపక్క న్యాయం గెలవాలని ఆందోళన చేయడం వింతే కదా? మీ దృష్టిలో న్యాయం, ధర్మం, నిజాయితీ అంటే అర్థం ఏమిటి పురంధేశ్వరి గారు?. వేల కోట్ల స్కాములకు పాల్పడిన చంద్రబాబు గారిపై కేసులు పెట్టడం అన్యాయమా?’ అని ప్రశ్నించారు. 

అలాగే, ‘ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు 50కు పైగా పిటిషన్లు వేశారు చంద్రబాబు గారి ప్లీడర్లు. వాటిని కొట్టేసినా, వాయిదా వేసినా మరికొన్ని పిటిషన్లు పడుతున్నాయి. ఏ కోర్టును ఏం అభ్యర్థిస్తున్నారో వాళ్ళకే తెలియనంత గందరగోళం. పెండింగ్ కేసుల భారంతో ఒత్తిడిలో ఉన్న కోర్టులకు ఈయనో తలనొప్పిలా మారాడు. న్యాయ వ్యవస్థ ఇదంతా గమనిస్తూనే ఉంది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: ‘రాజకీయాల్లో చంద్రబాబు శకం ముగిసింది’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement