
సాక్షి,అమరావతి/గంగాధరనెల్లూరు: ప్రజాస్వామ్యమంటే ఏంటో తెలియని పవన్‌కళ్యాణ్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని.. బూతులు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌కళ్యాణ్ పనిచేస్తున్నారన్నారు. 14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబును కాపుల కోసం ఏమి చేశారని పవన్ ఏనాడైనా అడిగారా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తెచ్చింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తుచేశారు. దాని గడువు ముగిసిన వెంటనే జగన్ మరో 20ఏళ్లు పొడిగించారని దీనిపై పవన్ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అర్థంకావడంలేదన్నారు.
ఆ ఆర్హత పవన్‌కు లేదు: హనుమంత్ నాయక్
ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలుపై సదస్సు పెట్టే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదని వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరాజోత్ హనుమంత్ నాయక్ అన్నారు. తాడేపల్లిలో గురువారం ఆయన మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సబ్ ప్లాన్ చట్టం ప్రకారం బడ్జెట్ లో ఎస్టీల అభివృద్ధికి 2020–23లో రూ.6,822.65 కోట్లను కేటాయించిందని చెప్పారు. గిరిజనుల నిధులను దారి మళ్లించి గిరిజనుల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిన నాటి టీడీపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment