సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘలు చేపట్టిన ఛలోఢిల్లీ కార్యక్రమం పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారింది. రాజధాని ఢిల్లీ వైపు దూసుకుపోతున్న రైతన్నలను నిలువరించేందుకు పోలీసుల లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. పలుచోట్లు బాష్పవాయువులు, నీటి ఫిరంగులను ప్రయోగించి రైతులపై ప్రతాపం చూపించారు. అయినప్పటికీ వెనక్కితగ్గని రైతులు.. రాజధాని దగ్గర్లోని సింఘు సరిహద్దు వద్ద భారీ స్థాయిలో బైఠాయించిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం దిగిచ్చిందన ఢిల్లీ సర్కార్ రైతుల ధర్నాకు అనుమతినిచ్చింది. రాజధానిలో అతి పెద్దదైన నిరంకారీ మైదానంలో ధర్నా నిర్వహించారు. (రైతుల ‘చలో ఢిల్లీకి’ అనుమతి)
అయితే అంతకుముందు సింఘు సరిహద్దు వద్ద ధర్నా చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీ ఝులిపించారు. పంజాబ్‌కు చెందిన ఓ 65 ఏళ్ల రైతుపై జవాను దాడి చేస్తున్న ఓ ఫోటో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని కామెంట్ చేస్తున్నారు. జై జవాన్.. జై కిసాన్ అనే నినాదాన్ని మరిచి.. జవాను చేతిలో కిసాన్ లాఠీ దెబ్బలు తినాల్సి పరిస్థితి ఏర్పడిందని రాహుల్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ ఫోటోను సినీ, రాజకీయ ప్రముఖులు సైతం షేర్ చేస్తూ రైతుల ధర్నాలకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. రైతులపై ఈ విధంగా దాడి చేయడం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు.
అయితే విపక్షాల ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోపై బీజేపీ అభిమాని క్లారిటీ ఇచ్చారు. ఆ ఫోటోను పూర్తిగా అపార్థం చేసుకున్నారని, జవాను రైతును కొట్టలేదని స్పష్టం చేశారు. జవాన్ తన లాఠీతో కేవలం బయపెట్టాడని రైతుపై దాడి చేయలేదని వివరించారు. దీనికి సంబంధించి ఓ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. రాజకీయ పరమైన విమర్శల కోసమే ట్రిక్స్ ప్లే చేస్తున్నారని, తప్పుడు ప్రచారానికి, రియాలిటీకి తేడా తెలుసుకోవాలని సూచించారు.
What more can we expect from Pappu, always targets and tries to defame and bring down moral of our Armed Forces, Here's the truth, propaganda vs reality pic.twitter.com/n6du85FA8n
— N K Deewan. (@Spoof_Junkey) November 28, 2020
Comments
Please login to add a commentAdd a comment