సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీలో వర్గపోరు ముదరడంతో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఓ రౌడీ అని, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తూ అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నారని పల్లె రఘునాథ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చదవండి: టీడీపీ: పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున బట్టబయలైన విభేదాలు
గత 35 ఏళ్లుగా టీడీపీ నేతలపై జేసీ కుటుంబం దాడులు చేసింది.. అక్రమ కేసులతో వేధించిందని ధ్వజమెత్తారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి రాజకీయ అజ్ఞాని అంటూ పల్లె మండిపడ్డారు. టీడీపీ కండువా కప్పుకోవటానికి జేసీ నామోషీగా ఫీలయ్యాడంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014లో టీడీపీలో చేరిన జేసీ కుటుంబం తమపై పెత్తనమా? అంటూ ప్రశ్నించారు. పరిటాలకు భయపడి జేసీ తాడిపత్రి నుంచి పారిపోయాడరన్నారు. నాజోలికి వస్తే ఊరుకోనని పల్లె రఘునాథ్‌రెడ్డి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment