
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో బీజేపీ, జనసేన భవిష్యత్తు కార్యాచరణపై మార్చి 3,4 తేదీల్లో అమిత్ షా తిరుపతి పర్యటన సందర్భంగా సమగ్రంగా చర్చిస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో నాదెండ్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని ఏపీ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంగా చూడాలని కేంద్రాన్ని కోరామన్నారు.
ప్రైవేటీకరణపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. మంగళవారం హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన పవన్ బృందం, బుధవారం కిషన్‌రెడ్డి, మురళీధరన్‌తో భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment