Pawan Kalyan Senseless Comments On AP Hindu Dharma - Sakshi
Sakshi News home page

హిందూ ధర్మం టార్గెటా? బాబూ పవనూ.. ఎక్కడా?.. ఇక్కడో లుక్కేస్కో

Published Sat, Jul 15 2023 6:52 PM | Last Updated on Sat, Jul 15 2023 7:26 PM

Pawan Kalyan Senseless Comments On AP Hindu Dharma - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల గురించి పాపం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఎక్కడాలేని బెంగ పట్టుకున్నట్లు ఉంది. ఈ క్రమంలో ఉన్నవీ లేనివీ జమ చేసి తప్పుడు లెక్కలు బయటకు తీస్తున్నాడు. శాంతి భద్రతల్లో బెస్ట్ ఆంధ్రప్రదేశ్ అంటూ కేంద్ర హోం శాఖ ఇచ్చిన కితాబే ఆయనగారి కళ్లకు కనిపించడం లేదేమో!. పైగా మహిళలకు రక్షణలోనూ  ఏపీ ఉత్తమ స్థానంలో ఉంది. నిజాల్ని విస్మరించి అసత్యాల ప్రచారంతో వా(నా)రాహిపై దూసుకుపోతున్న పవన్‌కి ఆలయాల ఘటనలకు సంబంధించి ఈ కింది సమాచారం అందితే బ్రేకులు వాటంతట అవే పడి బొక్కబోర్లా పడతాడేమో! 


నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు..

  • 2017లో పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కె. పెంటపాడు గ్రామంలో చారిత్రక శ్రీగోపాలస్వామి ఆలయ రథం దగ్ధమైంది. కానీ..  బాబు అప్పుడు ఇవి ఏమీ చేయలేదు. అప్పుడు బీజేపీ మంత్రి మాణిక్యాల రావు  దేవాదాయ శాఖ మంత్రి )
  • 2018 జనవరిలో విజయవాడ దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయి. అమ్మవారి గర్భాలయంలో అర్ధరాత్రి ఒక అపరిచిత వ్యక్తి కదలికలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
  • ఆలయ EO కి చెప్పి ఆయ‌న సతీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి త‌న కొడుకు లోకేష్ కోసం విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ ఆలయంలో క్షుద్ర పూజ‌లు జ‌రిపించార‌ని  ప్రస్తుత సాక్షాత్తు ఆల‌య ఈవో సామినాయుడు చెప్పారు
  • చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా  దుర్గ‌మ్మ ఆల‌యంలో  భ‌క్తులు అమ్మవారికి స‌మ‌ర్పించిన ఖరీదైన చీర‌లు మాయం  అయ్యాయి
  • తిరుమ‌లలో వెయ్యి కాళ్ల మండపాన్ని  కూల్చాడు బాబు
  • విజయవాడ లో 40  గుడులను కూల్చాడు
  • స‌దావ‌ర్తి  ఆలయ భూముల‌ను అప్ప‌నంగా త‌న‌వారికి క‌ట్ట‌బెట్టాల‌ని చూసాడు 
  • అయ్య‌ప్ప మాల‌లు ధ‌రించ‌డం వ‌ల‌న రాష్ట్రానికి మ‌ద్యం ఆదాయం ప‌డిపోయింద‌ని అన్నాడు బాబు
  • విజయవాడలో రూ.437 కోట్ల విలువ చేసే 14 ఎకరాల దుర్గగుడి భూములను సిద్ధార్థ విద్యాసంస్థలకు కేవలం రూ.21 లక్షలకు అప్పగించాడు   ఆ సంస్థ ఏమైనా ఉచితంగా బోధిస్తోందా?
  • దేవదాయ శాఖ మంత్రిగా బీజేపీ నేత మాణిక్యాలరావు ఉన్నప్పుడే చాలా చోట్ల దేవాలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయి
  • మంత్రాలయం భూములు వేలంలో అమ్మాలని బాబు హయాంలో 2018 జనవరిలో నాటి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, మంత్రి ఆమోదించారు.
  • రిసార్టుల కోసం దేవుళ్ల విగ్ర‌హాలు ధ్వంసం చేసాడు బాబు 
  • ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరులో శివ‌లింగం, దేవుళ్ల విగ్ర‌హాల తొల‌గింపు (నంబ‌ర్ 14,2017)
  • గోదావరి పుష్కారాల్లో సినీ దర్శకుడు బోయపాటి చౌదరి చెప్పాడని  పబ్లిసిటీ  పిచ్చి తో  29  మంది భక్తులను పొట్టన పెట్టుకున్నాడు..

బాబు హయాంలో 4 ఏళ్లలో జరిగినవి.. 
ఆల‌యాల ఘ‌ట‌న‌ల‌పై  డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ (జ‌న‌వ‌రి 13, 2021) చేసిన ప్రకటన ఆధారంగా..
ఏడాది-ఘటనలు 
2015-163
2016-207
2017-139
2018-123
2019-177
2020-143
2021-006

ఏపీలో హిందూ ధర్మాన్ని టార్గెట్ చేశాంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మాట్లాడాడు. చంద్రబాబు హయాంలో 400 ఆలయాలను కూల్చి వేస్తే పవన్ ఎక్కడున్నారు?  ఆ లెక్కల గురించి ఒక్క మాటా మాట్లాడడా?.. 

  • వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అయ్యాక.. 2020  సెప్టెంబర్‌ వరకు 33 ఆలయాల్లో జరిగిన నేరాలకు సంబంధించి 27 కేసుల్లో నిందితులతోపాటు  నేరాలకు పాల్పడిన 130 మందిని అరెస్టు చేశారు. 
  • అంతర్వేది రథం కాలిపోతే EO ను సస్పెండ్ చేసి సీబీఐ విచారణకు ఆదేశించారు . పైగా రూ. 13.5 కోట్లతో ‘అంతర్వేది’ అభివృద్ధి చేశారు. 
  • కాలి నడకన తిరుమల మెట్లెక్కి  శ్రీవారిని దర్శించుకున్న వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. 
  • ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తే కఠినంగా శిక్షించండి  అని ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి.

చదవండి: ‘వృద్ధసైకో, పిల్లసైకో, ఇంకొక సైకో గంజాయి తాగి రోడ్డున పడ్డారు’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement