statics
-
బాబూ పవనూ.. నీ తొక్కలో లెక్క తప్పింది చూస్కో!
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల గురించి పాపం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎక్కడాలేని బెంగ పట్టుకున్నట్లు ఉంది. ఈ క్రమంలో ఉన్నవీ లేనివీ జమ చేసి తప్పుడు లెక్కలు బయటకు తీస్తున్నాడు. శాంతి భద్రతల్లో బెస్ట్ ఆంధ్రప్రదేశ్ అంటూ కేంద్ర హోం శాఖ ఇచ్చిన కితాబే ఆయనగారి కళ్లకు కనిపించడం లేదేమో!. పైగా మహిళలకు రక్షణలోనూ ఏపీ ఉత్తమ స్థానంలో ఉంది. నిజాల్ని విస్మరించి అసత్యాల ప్రచారంతో వా(నా)రాహిపై దూసుకుపోతున్న పవన్‌కి ఆలయాల ఘటనలకు సంబంధించి ఈ కింది సమాచారం అందితే బ్రేకులు వాటంతట అవే పడి బొక్కబోర్లా పడతాడేమో! నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. 2017లో పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కె. పెంటపాడు గ్రామంలో చారిత్రక శ్రీగోపాలస్వామి ఆలయ రథం దగ్ధమైంది. కానీ.. బాబు అప్పుడు ఇవి ఏమీ చేయలేదు. అప్పుడు బీజేపీ మంత్రి మాణిక్యాల రావు దేవాదాయ శాఖ మంత్రి ) 2018 జనవరిలో విజయవాడ దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయి. అమ్మవారి గర్భాలయంలో అర్ధరాత్రి ఒక అపరిచిత వ్యక్తి కదలికలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆలయ EO కి చెప్పి ఆయన సతీమణి నారా భువనేశ్వరి తన కొడుకు లోకేష్ కోసం విజయవాడ కనకదుర్గ ఆలయంలో క్షుద్ర పూజలు జరిపించారని ప్రస్తుత సాక్షాత్తు ఆలయ ఈవో సామినాయుడు చెప్పారు చంద్రబాబు సీఎంగా ఉండగా దుర్గమ్మ ఆలయంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన ఖరీదైన చీరలు మాయం అయ్యాయి తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చాడు బాబు విజయవాడ లో 40 గుడులను కూల్చాడు సదావర్తి ఆలయ భూములను అప్పనంగా తనవారికి కట్టబెట్టాలని చూసాడు అయ్యప్ప మాలలు ధరించడం వలన రాష్ట్రానికి మద్యం ఆదాయం పడిపోయిందని అన్నాడు బాబు విజయవాడలో రూ.437 కోట్ల విలువ చేసే 14 ఎకరాల దుర్గగుడి భూములను సిద్ధార్థ విద్యాసంస్థలకు కేవలం రూ.21 లక్షలకు అప్పగించాడు ఆ సంస్థ ఏమైనా ఉచితంగా బోధిస్తోందా? దేవదాయ శాఖ మంత్రిగా బీజేపీ నేత మాణిక్యాలరావు ఉన్నప్పుడే చాలా చోట్ల దేవాలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయి మంత్రాలయం భూములు వేలంలో అమ్మాలని బాబు హయాంలో 2018 జనవరిలో నాటి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, మంత్రి ఆమోదించారు. రిసార్టుల కోసం దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేసాడు బాబు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో శివలింగం, దేవుళ్ల విగ్రహాల తొలగింపు (నంబర్ 14,2017) గోదావరి పుష్కారాల్లో సినీ దర్శకుడు బోయపాటి చౌదరి చెప్పాడని పబ్లిసిటీ పిచ్చి తో 29 మంది భక్తులను పొట్టన పెట్టుకున్నాడు.. బాబు హయాంలో 4 ఏళ్లలో జరిగినవి.. ఆలయాల ఘటనలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ (జనవరి 13, 2021) చేసిన ప్రకటన ఆధారంగా.. ఏడాది-ఘటనలు 2015-163 2016-207 2017-139 2018-123 2019-177 2020-143 2021-006 ఏపీలో హిందూ ధర్మాన్ని టార్గెట్ చేశాంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడాడు. చంద్రబాబు హయాంలో 400 ఆలయాలను కూల్చి వేస్తే పవన్ ఎక్కడున్నారు? ఆ లెక్కల గురించి ఒక్క మాటా మాట్లాడడా?.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అయ్యాక.. 2020 సెప్టెంబర్ వరకు 33 ఆలయాల్లో జరిగిన నేరాలకు సంబంధించి 27 కేసుల్లో నిందితులతోపాటు నేరాలకు పాల్పడిన 130 మందిని అరెస్టు చేశారు. అంతర్వేది రథం కాలిపోతే EO ను సస్పెండ్ చేసి సీబీఐ విచారణకు ఆదేశించారు . పైగా రూ. 13.5 కోట్లతో ‘అంతర్వేది’ అభివృద్ధి చేశారు. కాలి నడకన తిరుమల మెట్లెక్కి శ్రీవారిని దర్శించుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తే కఠినంగా శిక్షించండి అని ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి. చదవండి: ‘వృద్ధసైకో, పిల్లసైకో, ఇంకొక సైకో గంజాయి తాగి రోడ్డున పడ్డారు’ -
ఫెడ్ నిర్ణయాలు... ఆర్థిక గణాంకాలు కీలకం
ముంబై: ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, స్థూల ఆర్థిక, ఆక్టోబర్ ఆటో అమ్మక గణాంకాలు ఈ వారం సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. గురువారం దీపావళీ, శుక్రవారం బలి ప్రతిపద సందర్భంగా ఎక్చ్సేంజీలకు సెలవుకావడంతో ట్రేడింగ్ మూడు రోజులే జరుగుతుంది. ‘‘ఫెడ్ పాలసీ కమిటీ సమావేశానికి ముందు అప్రమత్తతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. వివిధ రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. మూడురోజుల పరిమిత ట్రేడింగ్‌లో అమ్మకాలు కొనసాగవచ్చు. నిఫ్టీకి 17,250 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు స్థాయి ఉంది. నిర్ణయాత్మక ఈ స్థాయిని కోల్పోతే అమ్మకా తీవ్రత మరింత పెరగవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్ద్ ఖేమా తెలిపారు. గతవారంలో సెన్సెక్స్ 1,515 పాయింట్లు, నిఫ్టీ 443 పాయింట్లు నష్టపోయాయి. దేశీయ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ, కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాల ప్రకటన, ప్రపంచ మార్కెట్లలో బలహీన సంకేతాలు దేశీయ ఈక్విటీ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను విశ్లేషిస్తే.., నేడు వాహన విక్రయ గణాంకాల వెల్లడి దేశీయ ఆటో కంపెనీలు నేడు(సోమవారం) తమ అక్టోబర్ నెల వాహన విక్రయ గణాంకాలను విడుదల చేయనున్నాయి. దీంతో ఈ వారంలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఆశోక్ లేలాండ్, ఐషర్ మోటర్స్, హీరో మోటోకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎస్కార్ట్స్ లాంటి ఆటో కంపెనీల షేర్లు అధిక పరిమాణంతో ట్రేడయ్యే అవకాశం ఉంది. సెమి కండెక్టర్ల కొరత, రవాణా ఛార్జీలు, ముడి సరుకు ధరల పెరుగుదల తదితర అంశాలు వాహన విక్రయాలను పరిమితం చేసి ఉండొచ్చని పరిశమ్ర నిపుణులు భావిస్తున్నారు. ఫెడ్ పాలసీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు మంగవారం(నవంబర్ 2న) మొదలై.., మూడో తేదిన(బుధవారం)ముగియనున్నాయి. రెండురోజుల ఫెడ్ పాలసీ సమావేశంలో ఆర్థిక ఉద్దీపనల ఉపసంహరణ(ఫెడ్ ట్యాపరింగ్), బాండ్ల క్రయవిక్రయాలపై కమిటీ తీసుకొనే నిర్ణయాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. కార్పొరేట్ల క్యూ2 ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ల రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్ నవంబర్ మొదటి వారంలోనూ కొనసాగనుంది. హెచ్డీఎఫ్సీ, టాటామోటార్స్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, సన్‌ఫార్మా, ఐషర్ మోటార్స్, హెచ్‌పీసీఎల్, దివీస్ ల్యాబ్స్, ఐఆర్సీటీసీలతో సహా 350కి పైగా కంపెనీలు ఈ వారంలో తమ సెప్టెంబర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. గతవారంలో కార్పొరేట్ల క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. గురువారం ముహురత్ ట్రేడింగ్ దీపావళి సందర్భంగా గురువారం ఎక్సే్చంజీలకు సెలవు రోజు అయినప్పటికీ.., ఆ రోజు సాయం త్రం ముహూరత్ ట్రేడింగ్ జరుగుతుంది. ప్రీ ఓపెనింగ్ సెషన్ 06:00 – 06:08 మధ్య ప్రారంభమవుతుంది. ప్రధాన సెషన్ 06:15 నుంచి 07:15 నిర్వహించబడుతుంది. ఎక్చ్సేంజీల సమయ పాలన మినహా ట్రేడింగ్ విధివిధానాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ నిర్ధిష్ట సమయంలో షేర్లను కొనుగోలు చేస్తే లాభాలు వస్తాయని ట్రేడర్ల విశ్వాసం. ఈ వారంలో మూడు ఐపీఓలు మూడు కంపెనీలు ఈ వారంలో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. పాలసీ బజార్, సంఘీ ఇండస్ట్రీస్, జేఎస్ఎస్ ఎంటర్‌ప్రైజస్ కంపెనీల పబ్లిక్ ఇష్యూలు సోమవారం మొదలైన బుధవారం ముగియనున్నాయి. ఇందులో పాలసీ బజార్ రూ. 5,625 కోట్లను, ఎస్‌జేఎస్ ఎంటర్ప్రైజెస్ రూ.800 కోట్లను, సంఘీ ఇండస్ట్రీస్ రూ.125 కోట్ల నిధుల సమీకరించున్నాయి. అలాగే గతవారం ప్రారంభమైన నైకా, ఫినో పేమేంట్స్ బ్యాంక్ ఐపీఓలు మంగళవారం ముగియనున్నాయి. అక్టోబర్‌లో అమ్మేశారు రెండు నెలల వరుస కొనుగోళ్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్‌లో దేశీయ ఈక్విటీలను అమ్మేశారు. గత నెలలో భారత మార్కెట్ నుంచి రూ.12,278 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.13,550 కోట్ల షేర్లను విక్రయించగా.., డెట్ మార్కెట్లో రూ.1,272 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిట రీ గణాంకాలు తెలిపాయి. ‘‘షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతున్నాయనే నెపంతో మిర్లేంచ్, యూఎస్బీ, నోమురా బ్రోకరేజ్ సంస్థలు భారత ఈక్విటీ మార్కెట్ రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణకు ఇదొక కార ణం అయ్యిండొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. -
క్షీణతను ఆపలేని గణాంకాలు..!
అవలోకనం మన ఆర్థిక చరిత్రలో ఒక వింత దశ గుండా ప్రయాణిస్తున్నాం. ఈ సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి -జీడీపీ-లో 9 శాతం పెరుగుదల సాధించే అవకాశ ముందని ఆర్థిక మంత్రి ఇటీవలే మాట్లాడారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కీలక ఆర్థిక వ్యవస్థగా ఉంటోందన్న వాస్తవాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విజయ సంకేతంగా తరచుగా ఉదహరిస్తున్నారు. అధికారిక ప్రకటనలను బట్టి చూస్తే, కల్లోల ప్రపంచంలో భారత్ ఒక ప్రశాంత ఆర్థిక ద్వీపంగా కనిపిస్తుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోని అనర్థ ఆర్థిక నిర్వహణలో చాలా భాగం ఇప్పుడు మన వెన్నంటే ఉంది. ఈలోగా 2014లో నరేంద్రమోదీ కేంద్రంలో అధికారాన్ని స్వీకరించిన నాడు ఉన్న స్థాయికి మన స్టాక్ మార్కెట్ పడిపోయింది. రూపాయి పరిస్థితి కూడా అలాగే ఉంది. దానికి తోడుగా ప్రభుత్వ ఆశావాదానికి, మార్కెట్ల నిరాశా వాదానికి మధ్య పొంతన కుదరటం లేదు. మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థలో వర్ధమాన మార్కెట్ల విభాగాధిపతి రుచిర్ శర్మ, ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్‌కి కొన్ని రోజుల క్రితం ఇచ్చిన అద్భుతమైన ఇంటర్వ్యూలో భారత ఆర్థిక పరిస్థితిపై కొన్ని కీలకమైన సూచనలు చేశారు. రుచిర్ శర్మ సూచనల్లో మొదటిది.. ప్రపంచ వాణిజ్య వృద్ధి 2015లో జీరో స్థాయికి పతనమైపోయింది. రెండు.. ప్రపంచ వాణిజ్యంలో జీరో శాతం వృద్ధి నమోదు చారిత్రకంగా ఆర్థిక మాంద్య కాలంలోనే సంభవిం చింది. అంటే మనం ఇప్పటికే మాంద్యంలోకి ప్రవేశించా మని అర్థం. దీనికి మరొక సంకేతం ఏదంటే సగటున ప్రతి ఎనిమిదేళ్లకు ఒకసారి మాంద్యం ఏర్పడేది. ఈ తర్కం బట్టి చూస్తే, అలాంటి మాంద్యం ఇప్పుడు పొంచి ఉంది. మూడు.. భారత ఎగుమతులు 5 శాతం ప్రతికూల స్థాయికి పతనమయ్యాయి. అంటే ఎగుమతులు 5 శాతం ప్రతికూల వృద్ధిలో ఉన్నప్పుడు దేశం 8 శాతం వృద్ధి చెంద డం అసంభవం (భారత్ 8 శాతం వృద్ధి సాధించిన సమ యంలో మన ఎగుమతులు ఏటా 20 శాతం పెరుగుదల సాధించేవి). నాలుగు. ప్రపంచంలోనే అత్యంత రక్షణాత్మక వైఖరిని అవలంబిస్తున్న దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగుతోంది. ఇక నరేంద్రమోదీ పాలనలో జరిగిన సంస్కరణలు చాలా చాలా తక్కువే. ప్రపంచ దేశాలన్నింటితో పోలిస్తే, 2015 సంవత్సరంలో అత్యధిక రక్షణాత్మక చర్యలు చేపట్టిన రెండో దేశంగా భారత్‌కు చోటు దక్కింది. ఇది వ్యక్తిగతంగా నాకు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఎందుకంటే పలు సంస్కరణలను ప్రతిపక్షం అడ్డుకుంటోందన్న వార్తలే మనకు వినపడు తుంటాయి తప్ప, కేంద్ర ప్రభుత్వమే వాస్తవానికి సంస్క రణలను క్రియాశీలకంగా వెనక్కు మరలిస్తున్న విషయాన్ని మనం ఎన్నటికీ వినడం లేదు. అయిదు. 500 భారతీయ అగ్రశ్రేణి సంస్థలు 2015లో జీరో శాతం అమ్మకాల వృద్ధిని చవిచూశాయి. తదను గుణంగా, 2016 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో వీటి లాభ వృద్ధి ప్రతికూలంగానే ముగియనుంది. మన జీడీపీ వృద్ధి ఒత్తిడిలో ఉందనడానికి ఇది రెండో సంకేతం (క్షీణ ఎగుమతి వృద్ధితోపాటు). ఆరు. ప్రభుత్వ జీడీపీ డేటాకు, కార్పొరేట్ వ్యవహా రశైలికి మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. దీనివల్లే భారత ప్రభుత్వ డేటా విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోంది. దీనికి సంబంధించి మరికొన్ని కలవరపర్చే సూచికలూ ఉన్నాయి. రుణాల వృద్ధి (నూతన ఆర్థిక కార్యకలాపాలకు రుణాలు అని అర్థం) పతనమైంది. భారతీయ కార్పొరేట్ సంస్థలు పూర్తిగా రుణవలయంలో ఉన్నాయి. మన ప్రభుత్వ బ్యాంకుల్లో మొండి బకాయిలు అత్యధిక శాతంలో ఉంటున్నాయి. మన ప్రభుత్వం మాత్రం తను ప్రకటించిన డేటాకు కట్టుబడి ఉంది. అంచనా ప్రాతిపదికన వ్యాప్తి చెందే సిద్ధాం తాల కంటే పన్ను వసూళ్లలో పెరుగుదల వంటి నిర్దిష్ట అంశాలకు విశ్వసనీయత అధికంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. దీనికి తోడు విదేశీ పరపతి సంస్థలు 2016లో భారత్ అధిక వృద్ధి రేటును (దాదాపు 7 శాతం) సాధించ గలదన్న అంచనాలను కొనసాగిస్తున్నాయి. ఈ కథనం ప్రారంభంలో నేను ప్రస్తావించినట్లుగా ఇలాంటి పరిస్థితే వింతలను సృష్టిస్తోంది. మన ఆర్థిక వ్యవస్థ నిజంగానే అద్భుతరూపంలో ఉండి 9 శాతం వృద్ధి రేటును చేరనుందా లేక పేలవంగా తయారై మందగిస్తోందా? ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడిందా లేక 2015ను అది సంస్కరణల వెనకడుగు సంవత్సరంగా మలిచిందా? ఈ రెండు విషయాలూ నిజం కాకపోవచ్చు. వీటిలో ఏదో ఒకటి నిజం కావలసి ఉంది. ప్రభుత్వం చెబుతున్న అంకెలకు, రుచిర్ శర్మ చెబుతున్న అంశాలకు మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకుంటోంది? ఆర్థిక మంత్రి ప్రకటిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని మార్కెట్ ఎందుకు ప్రతిబిం బించడం లేదు? దేశీయ కారణాల వల్ల కాకుండా గ్లోబల్ సంకేతాల వల్లే ఇలా జరుగుతోందా? ప్రభుత్వ డేటాను అంగీకరించడంలో నాకు ఎలాంటి సమస్యా లేదు కానీ, ఇది ప్రధానమంత్రి మరింత ప్రత్య క్షంగా జోక్యం చేసుకోవలసిన సమస్య అని నేను భావిస్తున్నాను. నెల తర్వాత నెల గడిచేకొద్దీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నమోదవుతున్న గణాంకాలు ప్రభుత్వ ఆశావా దానికి అనుగుణంగా ఉండ కపోగా అవి మరింత అయో మయాన్ని సృష్టిస్తున్నాయి. ఉదాహరణకు, మన ఎగుమ తులు క్షీణిస్తున్నప్పటికీ, ఆటోమొబైల్ అమ్మకాలు నిరంతరం పెరుగుతున్నాయి. పైగా పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధికి సంబంధించి ఎలాంటి అంచనాలూ కనిపించడం లేదు. చివరకు, చమురు ధరలు కూడా వాస్తవంగా మనం భావిస్తున్న మంచివార్తలను అందివ్వడం లేదు. చమురు ధరలు మరింతగా తగ్గితే (లేదా బ్యారెల్‌కు ప్రస్తుతమున్న 30 డాలర్ల ధర వద్దే నిలిచిపోయినప్పటికీ ) అది వాస్తవానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చెడువార్తే అవుతుంది. సర్వత్రా మాంద్యం అలముకుంటున్నదనటానికి ఇది సంకేతం కూడా. మన్మోహన్సింగ్ హయాంతో పోలిస్తే మోదీ ప్రభు త్వంలో అత్యున్నత స్థానాల్లో అవినీతి చాలా తక్కువగా ఉండటం సంతోషకరమైన విషయమేనని నేను అంగీకరి స్తాను. కానీ ఇది చాలా చిన్న విషయం. భారతీయులకు అతి ముఖ్యమైన సమస్య.. దారిద్య్రం నుంచి వారిని త్వరగా బయటపడవేసే ఏకైక మార్గం ఏదంటే నిలకడైన అధిక వృద్ధి. కేంద్రంలో బలమైన ప్రభుత్వం, దార్శనికత, లక్ష్యంపై స్పష్టత కలిగిన నేత ఉండి కూడా మనం అధిక వృద్ధిని సాధించనట్లయితే మనం నిజంగానే పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నట్లే. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్ aakar.patel@icloud.com