
సాక్షి, తాడేపల్లి: తెలంగాణ మంత్రి హరీష్‌రావుపై మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. కేసీఆర్‌ను వెన్నుపోటు పొడిచేందుకు హరీష్ సిద్ధంగా ఉన్నారని కామెంట్స్ చేశారు. కేసీఆర్‌ను నేరుగా తిట్టలేకే మాపై విమర్శలు చేస్తున్నారని ఫైరయ్యారు.
కాగా, పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను వెన్నుపోటు పొడిచేందుకు హరీష్ సిద్ధంగా ఉన్నారు. మామ(కేసీఆర్)పై ఎప్పుడు కడుపు మంట రగిలినా మమ్మల్ని తిడతాడు. కేసీఆర్ తనను పట్టించుకోవడం లేదని హరీష్‌కు కోపంగా ఉంది. మామ, అల్లుళ్ల మధ్య తగాదాలే ఈ విమర్శలకు కారణం. ఏపీపై ప్రేమ ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఎందుకు అడ్డుకున్నారు?. నోటితో ప్రేమ చూపిస్తూ నొసలతో వెక్కిరించే రకం కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్‌ను తిట్టకపోతే హరీష్‌రావు ఫీలవుతారు అంటూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌ను అందరం కలిసి డెలవల్ చేశాం. ఇప్పుడు దాన్ని చూసి మురిసిపోతున్నారు. సిద్దిపేట్, హైదరాబాద్ కాదు.. ఖమ్మం, ఆదిలాబాద్, ఇంత ఇతర జిల్లాల్లో అభివృద్ధి జరిగిందా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment