‘తప్పుడు’ లెక్కలే బాబు భయం | Perni Nani Satirical Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘తప్పుడు’ లెక్కలే బాబు భయం

Published Wed, Jul 17 2024 6:25 AM | Last Updated on Wed, Jul 17 2024 10:39 AM

Perni Nani Satirical Comments On Chandrababu

అందుకే చంద్రబాబు పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టడంలేదా?

మేము గద్దెనెక్కినప్పుడు ఖజానాలో ఉన్నది రూ.100 కోట్లే

అయినా పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాం

మాజీ మంత్రి పేర్ని నాని  

సాక్షి, అమరావతి: పూర్తిస్థాయి బడ్జెట్‌ కూడా ప్రవే శపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు అనుభవం ఉందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పు­లపై వారు చేసిన విష ప్రచారం మొత్తం అవాస్తవ­మన్న విషయం బయటపడుతుందనే భయంతోనే పూర్తి స్థాయి బడ్జెట్‌ గురించి చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన కూడా చేయడం లేదని అన్నారు. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఖజా­నాలో ఉన్నది రూ.100 కోట్లు మాత్రమేనని, అయి­నప్పటికీ తాము ఆ ఏడాది జూలై 12న  పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టామని తెలిపారు.

నాని మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యా­లయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జూన్‌ 12న చంద్రబాబు ప్రమాణ స్వీ కారానికి 2 రోజుల ముందే కేంద్రం నుంచి డ­బుల్‌ డెవల్యూషన్‌ ద్వారా రూ.5,655.72 కోట్లు వచ్చా యని, అయినా అట్టహాసంగా ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలకు నిధులివ్వలేకే పూర్తి స్థాయి బడ్జెట్‌కు వెనకాడుతున్నారన్నారు. ఇప్పటికే ఉచిత ఇసుక కొండెక్కగా, తల్లికి వందనంలో కోత పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే సూపర్‌ సిక్స్, పవన్‌ కళ్యాణ్‌ షణ్ముఖ వ్యూహానికి ఎంత బడ్జెట్‌ కేటాయిస్తారో ఎంత ఖర్చు చేస్తారో చెప్పాలన్నారు.

రహస్యంగా బిల్స్‌ పాస్‌ చేసేందుకు, కేటాయింపు లు, శాఖల డిమాండ్లు కూడా చూపించాల్సిన అవసరం ఉండదనే ఆర్డినెన్స్‌ లేదా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు వెళ్తున్నారని దుయ్యబ­ట్టారు. నాడు అప్పు లపై అసత్యాలు ప్రచారం చేసిన టీడీపీ, కూటమి నేతలు ఇప్పుడు అప్పటికంటే ఎక్కువ తెస్తున్నారని, ఈ నెల రోజుల్లోనే పరిమితికి మించి అప్పు చేశారని చెప్పారు. హామీలు అమలు చేయ­లేక, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు పర్యటనలు, శ్వేతప­త్రా­లతోనే బాబు కాలం వెళ్లదీస్తున్నారు. అప్ప­టికీ, ఇప్పటికీ రాష్ట్రంలో ఏం మారిందని నిల­దీశారు.

వైఎస్‌ జగన్‌పై దుర్భాష­లా­డటం, వ్యక్తిత్వ హననం చేయడం తప్ప చేసిన­దేముందని ప్రశ్నించారు. ద మ్ముంటే వైఎస్సార్‌సీపీ నేతలపై చేసిన ఆరోపణల్లో ఒక్క దానినైనా నిరూపించాలని సవాల్‌ చేశారు. త మ ప్రభుత్వం రైతులు, నిరుపేదలకు మేలు చేస్తూ అనేక భూము­లను నిషేధిత జాబితాల నుంచి తొ లగించి, హక్కు­లు కల్పించిందని తెలిపారు. త మ ప్రభు త్వం నెలకు రూ.30 నుంచి రూ.60 మా త్రమే చెత్త పన్ను వసూలు చేసిందన్నారు. ఇప్పుడు చెత్తకు రోజుకు రూ.3 పన్ను వసూలు చేయాలని పవన్‌ అంటున్నారని, ఇప్పుడు ఎవరు చెత్త సీఎం అని నిలదీ­శారు. అసెంబ్లీ సమావేశాలకు జగన్‌తో సహా పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారని తెలిపారు.

మీడియా ముసుగులో వ్యక్తిత్వ హననం నీచం
మీడియా ముసుగులో కొందరు దిగజారి ప్రవ­ర్తిస్తున్నారని పేర్ని నాని  మండిపడ్డారు. విజయ­సాయిరెడ్డి గానీ, చంద్రబాబు గానీ, పేర్ని నాని గానీ.. ఎవరైనా సరే.. ప్రజా జీవితంలో ఉన్న వా­రి మీద ఎవరైనా విమర్శలు చేసినప్పుడు మీడి­యా హుందాగా ప్రవర్తించాలన్నారు. ముందుగా వాటికి ఆధారాలున్నాయేమో చూడాలని, ఆధా­రాల్లేక­పోతే ప్రచురించకూడదని, ప్రసారం చేయ­కూ­దని, అయితే ఇప్పుడు మీడియాలో ఇది జర­గ­డంలేదని ఆక్షేపించారు. మీడియా అంతా రాజ­కీయ రంగులు పులుముకుందన్నా­రు. అందుకే ఆరోపణల విషయంలో ఫలానా వ్యక్తి ఆరోపించారని చెప్పకుండా పూర్తి భిన్నంగా వ్యవహ­రిస్తున్నారని అన్నారు.

ఎంపీ వి.విజయసాయిపై ఒక వ్యక్తి ఆరోపణలు చేస్తే, ఆయన వివరణ తీసుకోకుండా, కనీసం మాట్లాడే ప్రయత్నం కూ­డా చేయకుండా, ఏకంగా ఒక ఛానల్‌ సీఈవోనే డిబేట్‌ పెట్టడం, అందులో నీచంగా మాట్లాడటం  పూర్తిగా దిగజారి పోవడమే అని మండిపడ్డారు. ఛానల్‌ను హుందాగా నడపాల్సింది పోయి వ్య­క్తిత్వ హననం చేస్తూ మనిషిని మానసికంగా చంపే ప్రయత్నం చేయడం హేయమన్నారు. ఓ మ­ని­షిని రాజకీయంగా చంపటానికి, మానసికంగా పతనం చేయడానికి పైశాచికం ప్రద­ర్శించడం సరికాదన్నారు. పార్టీ మహిళా కార్య­కర్త­లతో టీవీలో తిట్టించడం దుర్మార్గ­మ­న్నారు. మీ­డి­యా ముసుగులో ఇంత అస­హ్యంగా ప్రవర్తి­స్తున్న వారిని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement