![Perni Nani Slams Chandrababu Tadepalli - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/27/perni-nani.jpg.webp?itok=ksHwPGi2)
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నంగనాచి కబుర్లు చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. కొనటం, అమ్మడమే చంద్రబాబు విజయ రహస్యమని ధ్వజమెత్తారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అంటేనే నయవంచన, నమ్మకద్రోహం, వెన్నుపోటు అని దుయ్యబట్టారు.
చంద్రబాబు చరిత్ర అంతా కొనుగోలు రాజకీయమేనని పేర్ని నాని మండిపడ్డారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబేనని గుర్తు చేశారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిన చరిద్ర చంద్రబాబుది కాదా? హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా? అని నిప్పులు చెరిగారు
‘ఉండవల్లి శ్రీదేవి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. అవమానించారంటూ అసత్యాలు మాట్లాడుతున్నారు. ఆమెకు నియోజకవర్గంలో ఆదరణ తగ్గింది. ఆ విషయాన్ని శ్రీదేవికి పార్టీ అధ్యక్షుడు నేరుగానే చెప్పారు. టికెట్ దక్కదని ఆ ఎమ్మెల్యే పార్టీకి నమ్మకద్రోహం చేశారు’ అని విమర్శించారు.
చదవండి: వివేకా కేసులో కీలక పరిణామం..
Comments
Please login to add a commentAdd a comment