న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కచ్చతీవు ద్వీపం విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మోదీ ఎండగట్టారు. 1970లో కాంగ్రెస్ పార్టీ కచ్చతీవు ద్వీపాన్ని పొరుగు దేశం శ్రీలంకకు నిర్మొహమాటంగా ఇచ్చేయాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు.
అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ.. దేశ సమగ్రత, సమైక్యత, ప్రయోజనాలను కాంగ్రెస్ పార్టీ బలహీన పరుస్తూ వచ్చిందని ‘ఎక్స్’వేదికగా ధ్వజమెత్తారు. 1974లో కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకు మొండివైఖరితో వదిలేసిన విషయానికి సంబంధించిన ఓ ఆర్‌టీఐ నివేదికపై ప్రధాని మోదీ ఆదివారం స్పందించారు.
‘కళ్లు తెరిపించే, ఆశ్చర్యకమైన.. కచ్చతీవు ద్వీపానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొండిగా తీసుకున్న నిర్ణయానికి చెందిన కొత్త నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ నిర్ణయం పట్ల భారతదేశ ప్రజలు ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీని ఇక ఎప్పడూ నమ్మొద్దని ప్రజలు భావించారు. ఆనాడు కాంగ్రెస్ అవలంభించిన మొండివైఖరి ప్రజల మదిలో నిలిచిపోయింది. 75 ఏళ్లుగా భారతదేశ సమగ్రత, సమైక్యత, ప్రయోజనాలను బలహీన పరచటమే కాంగ్రెస్ విధానం’అని మోదీ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
Eye opening and startling!
— Narendra Modi (@narendramodi) March 31, 2024
New facts reveal how Congress callously gave away #Katchatheevu.
This has angered every Indian and reaffirmed in people’s minds- we can’t ever trust Congress!
Weakening India’s unity, integrity and interests has been Congress’ way of working for…
కచ్చతీవు ద్వీపం 1975 వరకు భారత దేశంలో భాగంగానే ఉండేదని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది అన్నారు. అక్కడికి తమినాడు మత్స్యకారులు చేపలు పట్టేందుకు వెళ్తుండేవారు. భారత్ ఒప్పదం అయిపోయాక తమిళమత్స్యకారులను శ్రీలంక అక్కడికి రానివ్వలేదని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కచ్చతీవు ద్వీపంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. అదేవింధంగా దీనికి తమ కుటుంబమే బాధ్యతవహిస్తుందని ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వేసిన ఆర్టీఐ పిటిషన్ ద్వారా కచ్చతీవు ద్వీపానికి సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. 1974లో ఇందిరా గాంధీ ఈ ద్వీపాన్ని అప్పటి మాజీ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ శ్రీలంకకు అప్పగించినట్లు అందులో పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల వేళ ఈ వ్యవహరాన్ని బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment